సెప్టెంబర్‌ 6, 7, 8 తేదీల్లో ‘జలసిరికి హారతి’

నదులు, చెరువులు, జలవనరులను పూజించాలన్న చంద్రబాబు

అమరావతి,ఆగస్ట్‌28 : సెప్టెంబర్‌ 6, 7, 8 తేదీల్లో ‘జలసిరికి హారతి’ కార్యక్రమం చేపట్టాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అధికారులను ఆదేశించారు. నదుల దగ్గర నుంచి చెరువుల వరకు రాష్ట్రంలోని అన్ని జలవనరులను ఆ మూడు రోజులు పూజించుకునేలా, ఇందులో ప్రజలు భాగస్వామ్యులు అయ్యేలా చూడాలని సూచించారు. సోమవారం తన కార్యాలయంలో పోలవరం సహా 28 ప్రాజెక్టుల పనులపై జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుతో కలిసి ముఖ్యమంత్రి సవిూక్ష నిర్వహించారు. 38వ సారి పోలవరం పనుల పురోగతిపై వర్చువల్‌ ఇన్‌స్పెక్షన్‌ చేశారు. వర్షాల కారణంగా ఈనెల మొదటి రెండు వారాల పనులు ఆలస్యమయ్యాయని, అయితే ఎన్నడూ లేనంతగా ఈవారం మాత్రం రికార్డు స్థాయిలో 21,226 క్యూబిక్‌ విూటర్ల వరకు స్పిల్‌వే, స్టిల్లింగ్‌ బేసిన్‌ కాంక్రీట్‌ పనులు జరిగాయని ముఖ్యమంత్రికి అధికారులు వివరించారు. అయితే రోజుకు కాంక్రీట్‌ పనుల సరాసరి 3,050 క్యూబిక్‌ విూటర్ల మేర మాత్రమే చాలవని, 4 వేల నుంచి 5 వేల క్యూబిక్‌ విూటర్ల వరకు పనుల వేగం పెరగాల్సి వుందని ముఖ్యమంత్రి అన్నారు. స్పిల్‌ చానల్‌, లెప్ట్‌ ఫ్లాంక్‌కు సంబంధించి రెండున్నర లక్షల క్యూబిక్‌ విూటర్ల మేర మట్టి తవ్వకం పూర్తయ్యింది. మొత్తం రేడియల్‌ గేట్ల ఫ్యాబ్రికేషన్‌, 15 ఆర్మ్‌ గైడ్రర్ల ఫ్యాబ్రికేషన్‌ పూర్తయ్యింది. ఈనెల 24న పోలవరం ప్రాజెక్ట్‌ అథారిటీ సమావేశమై ప్రాజెక్టు డిజైన్లు, నిర్మాణం తీరుతెన్నులను సవిూక్షించిందని ముఖ్యమంత్రికి అధికారులు తెలిపారు. గిరిజనులకు న్యాయం చేస్తూ, ముంపు ప్రాంతాలలో భూసేకరణ పక్రియ వేగంగా పూర్తి చేస్తున్నామని పేర్కొన్నారు. సెప్టెంబర్‌ 15 నాటికి యాగ్రిగేట్‌ కూలింగ్‌ ప్లాంట్‌ సిద్ధమవుతుందని అన్నారు. విశాఖ, ఉభయగోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ఈ రెండ్రోజులు భారీ వర్షాలు కురుస్తాయని, సెప్టెంబర్‌లో కాస్త తగ్గుముఖం పడతాయని ముఖ్యమంత్రి దృష్టికి ఇస్రో అధికారులు తీసుకొచ్చారు. భూగర్భ జలాలు సమృద్ధిగా వున్నాయని అధికారులు చెప్పడంతో కొత్తగా బోర్లకు అనుమతులు ఇవ్వాలని ముఖ్యమంత్రి నిర్దేశిరచారు. ముందుగా రాష్ట్రంలో ఏయే జిల్లాల్లో ఎన్ని బోర్లు అవసరం అనేది లెక్క తేల్చాలని చెప్పారు.

 

తాజావార్తలు