సేంద్రియ పద్ధతుల్లో పంటల సాగుకు ప్రోత్సాహం
కర్నూలు,మే3(జనం సాక్షి): రైతులు కృత్రిమ ఎరువులకు బదులుగా సేంద్రియ ఎరువులతోనే తమ పంటలను సాగు చేయాలని జిల్లా వ్యవసాయ అధికారి అన్నారు. ఖరీఫ్‌కు సంబంధించి పంటల సాగు పద్ధతులు, ఎరువుల వాడకం వంటి అంశాలపై రైతులకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఆయా గ్రామాల రైతులు పాల్గొన్నారు. ఇదిలావుంటే పంట సాగులో విత్తనం కీలకమైనదని, రైతులు విడి విత్తనాలు కొనుగోలు చేయకుండా దుకాణాల్లో కొనుగోలు చేసి బిల్లులు తీసుకోవాలని రైతులకు సూచించారు. రైతులు భూసార పరీక్షలకు అనుగుణంగా ఎరువులు వాడి పెట్టుబడులు తగ్గించుకోవాలని తెలిపారు. ఇదిలావుంటే గ్రామాల ప్రజలు ప్రతి ఇంట్లో మరుగుదొడ్డి నిర్మించుకునేలా అవగాహన కల్పించాలని డిఆర్‌డిఎ పిడి అన్నారు. మరుగుదొడ్లతో పాటు ప్రతి ఇంట మొక్కలు నాటుకోవాలని సూచించారు. అలాగే తమ ఇళ్ల చుట్టూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. సర్పంచులకు అధికారులకు స్వచ్ఛభారత్, వ్యక్తిగత మరుగుదొడ్లపై అవగాహన కల్పించారు.
———-