సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలి

వేమనపల్లి, జూలై 11,(జనంసాక్షి)    గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలు సైబర్‌ నేరాలపై అప్రమత్తంగా ఉండాలని నీల్వాయి ఎస్ఐ సుబ్బారావు అన్నారు.మంగళవారం వేమనపల్లి మండల కేంద్రంలో సైబర్‌నేరాలు, మూఢనమ్మకాలపై ప్రజలకు అవగాహన సదస్సు నిర్వహించారు.ఈ సందర్భంగా ఎస్ఐ సుబ్బారావు మాట్లాడుతూ శాంతిభద్రతల పరిరక్షణకు ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరారు.సైబర్‌నేరాలపై ప్రజలు జాగ్రత్తగా ఉండాలన్నారు.రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ నిబంధనలు పాటించాలన్నారు.ద్వీచక్ర వాహనదారుడు హెల్మెంట్‌ ధరించాలని,కారు నడిపేవారు సీటు బెల్ట్‌ ధరించాలని సూచించారు.మహిళల భద్రతే పోలీసుల లక్ష్యం అన్నారు.మహిళలతో,చిన్న పిల్లలతో అసభ్యకరంగా ప్రవర్తించిన,మానసిక, శారీరకంగా హింసించిన వారిపట్ల చట్టపరమైన కఠిన చర్యలు తీసుకొని కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.ప్రజలు,మహిళలు ఆపద సమయంలో,ఎవరైనా చట్టవ్యతిరేకమైన కార్యకలాపాలకు పాల్పడిన,యువకులు గుంపులుగా ఏర్పడి బహిరంగ మద్యపానం సేవించిన,ప్రజా శాంతికి భంగం కలిగించే విధంగా ప్రవర్తిస్తే వెంటనే స్థానిక పోలీసులకు లేదా డయల్ 100 కు కాల్ చేసి సమాచారం ఇవ్వాలని తెలిపారు.ప్రజల రక్షణ కొరకు పోలీసులు ఎల్లప్పుడు అందుబాటులో ఉంటారని,వ్యాపార సముదాయాల దగ్గర, కాలనీలలో,గ్రామాలలో మరింత స్వీయ రక్షణ కొరకు సీసీ కెమెరాలను అమర్చుకోవాలని ఈ విషయంలో పోలీసుల సహకారం ఉంటుందని అన్నారు.భద్రతా పరమైన అంశాలలో సీసీ కెమెరాలు కీలక పాత్ర వహిస్తాయని తెలిపారు.ఒక్క సీసీ కెమెరా వందమంది పోలీసులతో సమానంగా పని చేస్తుందన్నారు.బాల్య వివాహాలు, మూఢనమ్మకాల నిర్మూలనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు.గ్రామంలో ఎవరైనా కొత్తవారు అనుమానాస్పదంగా కనబడితే వెంటనే పోలీస్ లేదా డయల్ 100 కు ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలని కోరారు.ఈ కార్యక్రమంలో హెడ్ కానిస్టేబుల్ బండి రాజన్న,కానిస్టేబుల్ సమ్మయ్య,సత్యం,గ్రామస్తులు పాల్గొన్నారు.

తాజావార్తలు