సోమా కంపెనీకి సిఎం చంద్రబాబు అంక్షింతలు

సామర్థ్యం లేనప్పుడు నిర్మాణ బాధ్యతలు ఎందుకు తీసున్నారు
జనవరి 31లోగా దుర్గమ్మ వారధి పూర్తి కావాలిన ఆదేశాలు
విజయవాడ,మే5(జ‌నం సాక్షి):  విజయవాడలోని కనకదుర్గ  ఫ్లై ఓవర్‌ నిర్మాణం ఆలస్యం కావడంపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ  ఫ్లై ఓవర్‌  నిర్మాణ పనులు చేపట్టిన సోమా నిర్మాణ సంస్థ ప్రతినిధులపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.  ఫ్లై ఓవర్‌  నిర్మించే సామర్థ్యం లేనప్పుడు ఎందుకు చేపట్టారని ప్రశ్నించారు. విజయవాడ బెంజ్‌ సర్కిల్‌ దగ్గర ్గ//-ల ఓవర్‌ నిర్మాణం వేగంగా పూర్తి చేసేందుకు… రాత్రి సమయంలో ఒకవైపు ట్రాఫిక్‌ నిలిపివేయాలని సీఎం చంద్రబాబు సూచించారు. రాత్రి 11 నుంచి ఉదయం 6 గంటల వరకు ట్రాఫిక్‌ను మళ్లించేలా చూడాలని ఆయన ఆదేశించారు. కనకదుర్గ ఫ్లై ఓవర్‌ నిర్మాణం 65 శాతం పూర్తయిందని, పనుల పురోగతిపై ప్రతి నెలా నివేదిక ఇవ్వాలని అధికారులను చంద్రబాబు సూచించారు. ఫ్లై ఓవర్‌ నిర్మాణం వచ్చే ఏడాది జనవరి 31 నాటికి పూర్తిచేయాలని,  ఫ్లై ఓవర్‌  నిర్మించే సామర్థ్యం లేనప్పుడు… నిర్మాణ బాధ్యతలు ఎందుకు తీసుకున్నారని సోమా ప్రతినిధులను సీఎం ప్రశ్నించారు.  ఫ్లై ఓవర్‌ నిర్మాణంలో జాప్యం చేస్తూ ప్రజలను ఇబ్బంది పెడుతున్నారని చంద్రబాబు మండిపడ్డారు. ఇదిలావుంటే ఏపీలోని 4వేల కిలోవిూటర్ల రహదారుల నిర్వహణ బాధ్యత… ఐదేళ్ల పాటు ప్రైవేటు సంస్థలకు ఇవ్వాలని సీఎం చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. రహదారులపై గుంతలు లేకుండా చూడాలని, రోడ్ల పక్కనున్న పిచ్చిమొక్కలు, పొదలు తొలగించాలని సూచించారు. నీళ్లు నిలిచిపోయి రోడ్లు పాడవకుండా డ్రైనేజీలు నిర్మించాలన్నారు. సీసీ కెమెరాలతో రోడ్ల నిర్మాణ పర్యవేక్షణ జరగాలని, నత్తనడకన రోడ్ల నిర్మాణం చేపట్టే సంస్థలపై చర్యలు తప్పవని సీఎం హెచ్చరించారు. నిర్ణీత సమయంలో నిర్మాణం పూర్తిచేయకుంటే బ్లాక్‌ లిస్టులో పెడతామని చంద్రబాబు చెప్పారు. ఎట్టి పరిస్థితుల్లోనూ జనవరి 31లోగా ఫ్లై ఓవర్‌ పనులు పూర్తి చేయాలని ముఖ్యమంత్రి
అధికారులను ఆదేశించారు.

తాజావార్తలు