సోము వీర్రాజును అధ్యక్షుడిని చేయాలి
లేకుంటే మూకుమ్మడి రాజీనామాలు
తూర్పు బిజెపి నేతల హెచ్చరిక
కాకినాడ,మే14(జనంసాక్షి): ఓ వైపు ఢిల్లీలో అమిత్‌షా విూటింగ్‌లో ఎపి అధ్యక్షుడిగా నియమితులైన కన్నా లక్ష్మీనారాయణ పాల్గొంటున్న వేళ తూర్పు బిజెపిలో చిచ్చు రేగుతోంది. కన్నా స్థానంలో ఎమ్మెల్సీ సోము వీర్రాజులను అధ్యక్షుడిని చేయాలని డిమాండ్ వచ్చింది. సాయంత్రంలోగా ఎమ్మెల్సీ సోము వీర్రాజును ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా నియమించకపోతే బీజేపీ జిల్లా కార్యవర్గం మొత్తం రాజీనామాలు చేస్తామని బీజేపీ తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షుడు మాలకొండయ్య పేర్కొన్నారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ… దశాబ్దాలుగా పార్టీలో కష్టపడుతున్న నేతను మరిచారని, మొన్న పార్టీలోకి వచ్చి నిన్న వైసీపీలోకి వెళ్లేందుకు యత్నించిన కన్నా లక్ష్మీనారాయణకు అధ్యక్ష పదవి ఇవ్వాలని నిర్ణయించడం దౌర్భాగ్యమన్నారు. అలాగే సాయంత్రం విజయవాడలో రాష్ట్ర పార్టీ నేతల సమావేశం జరగనుందని, ఈలోగా వీర్రాజును పార్టీ అధ్యక్షుడిగా నియమించకపోతే నాయకులంతా రాజీనామా చేస్తారని మాలకొండయ్య పేర్కొన్నారు. దశాబ్దాలుగా పార్టీలో కష్టపడుతున్న నేతను మరిచారని, మొన్న పార్టీలోకి వచ్చి నిన్న వైసిపిలోకి వెళ్లేందుకు యత్నించిన కన్నా లక్ష్మీనారాయణకు అధ్యక్ష పదవి ఇవ్వాలని నిర్ణయించడం దౌర్భాగ్యమన్నారు. అలాగే సాయంత్రం విజయవాడలో రాష్ట్ర పార్టీ నేతల సమావేశం జరగనుందని, ఈలోగా వీర్రాజును పార్టీ అధ్యక్షుడిగా నియమించకపోతే నాయకులంతా రాజీనామా చేస్తారని మాలకొండయ్య పేర్కొన్నారు.