స్కాలర్‌షిప్‌నకు దరఖాస్తు గడువు పొడిగింపు

గుంటూరుప్రభుత్వ, స్థానిక సంస్థలు, ఎయిడెడ్‌, ఉర్దూ, ఆంగ్లమాధ్యమం పాఠశాలల్లో ఎనిమిదో తరగతి చదువతున్న విద్యార్థులు నేషనల్‌ మీన్స్‌ మెరిట్‌ స్కాలర్‌షిప్‌కు దరఖాస్తు చేసుకునే గడువును పొడిగించినట్లు డీఈవో కేవీ శ్రీనివాసులురెడ్డి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. నవంబర్‌ ఎనిమిదో తేదీన పరీక్ష నిర్వహిస్తారని వెల్లడించారు. ఈనెల 29లోగా ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చునని తెలిపారు. దరఖాస్తు ఫారాలు విద్యాశాఖ కార్యాలయం నుంచి పొందవచ్చునని తెలిపారు. ఓసీ, బీసీ విద్యార్థులు ఏడో తరగతి పరీక్షలో 55 శాతం మార్కులు, ఎస్సీ, ఎస్టీ, పీహెచ్‌సీ విద్యార్థులు 50 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించాలని సూచించారు. వివరాలకు ఠీఠీఠీ.ఛట్ఛ్చఞ.ౌటజ వెబ్‌సైట్‌లో చూడాలని కోరారు.

తాజావార్తలు