స్పోర్ట్స్ అభివృద్ధికి 900 ఎకరాలు
విజయవాడ సమీపంలోని మూలపాడులో నిర్మించిన ట్విన్ క్రికెట్ క్రీడా ప్రాంగణాలను ముఖ్య మంత్రి బుధవారం ప్రారంభించారు. నేటి నుంచి భారత్- వెస్టిండీస్ మహిళా జట్ల మధ్య ప్రారంభ మయ్యే వన్డే సిరీస్‌లో తలపడనున్న క్రీడాకారులకు ఆయన శుభాక్షాంక్షలు తెలిపారు. ఈ సంద్భంగా సిఎం చంద్రబాబు మాట్లాడుతూ రాష్ట్రాన్ని క్రీడాంధ్రప్రదేశ్‌గా తీర్చిదిద్దేందుకు అవసరమైప అన్ని చర్యలు తీసుకుంటామని అన్నారు. ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా 18 క్లాస్ వన్, రెండు ఇండోర్, నాలుగు రెసిడెన్షియల్ మైదానాలను అభివృద్ధి చేయడం హర్షణీయమని ఎసిఎ గౌరవ కార్యదర్శి గోకరాజు గంగరాజును అభినందించారు. బిసిసిఐ చీఫ్ సెలక్టర్‌గా గుంటూరుకు చెందిన ఎంఎస్‌కె ప్రసాద్ ఎంపికవడం గర్వకారణమని, మెరిట్ ప్రకారం ఆంధ్రా క్రికెటర్లు భారతదేశం తరపున ఆడేలా చర్యలు తీసుకోవాలని కోరారు. రాష్ట్రంలో అడ్వెంచర్ స్పోర్ట్స్‌ను అభివృద్ధి చేసేందుకు 900 ఎకరాలు కేటాయించినట్లు చెప్పారు.