స్వర్ణభారతిలో గోపీ, సింధులకు సన్మానం

1hha81guనెల్లూరు : వెంకటాచలంలో స్వర్ణ భారతి ట్రస్ట్‌ 15వ వార్షికోత్సవ వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమానికి లోక్‌సభ స్పీకర్‌ సుమిత్ర మహాజన్, పలువురుకేంద్ర మంత్రులు, బ్యాడ్మింటన్ స్టార్‌ సింధు, కోచ్ గోపీచంద్‌ హాజరయ్యారు. ఈ సందర్భంగా సింధు, గోపీచంద్‌లను స్వర్ణభారత్‌ ట్రస్ట్‌ ఘనంగా సన్మానించింది. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు మాట్లాడుతూ స్వర్ణభారత్‌ ట్రస్ట్‌ వార్షికోత్సవానికి సింధు, గోపీలు రావడం సంతోషకరంగా ఉందని అన్నారు. సింధు ఎదుగుదల వెనుక ఆమె తల్లిదండ్రుల కృషి ఎంతో ఉందని, విద్య నేర్పిన గురువును ఎవరూ మర్చిపోకూడదని వెంకయ్య అన్నారు. కన్నతల్లిని, జన్మభూమిని, మాతృభాషను మరవొద్దని, సామాజిక సేవ ప్రతిఒక్కరి జీవితంలో భాగం కావాలని ఆయన అన్నారు. క్రమశిక్షణ ఉంటే జీవితంలో ఉన్నతశిఖరాలకు ఎదగవచ్చునని, ప్రజాసేవలో తృప్తి, ఆనందం అనిర్వచనీయమని, దేశాన్ని శరవేగంగా ముందుకు తీసుకెళ్లేందుకు ప్రధాని మోదీ కృషి చేస్తున్నారని వెంకయ్య నాయుడు అన్నారు. అంతకు ముందు కార్యక్రమాన్ని లోక్‌సభ స్పీకర్‌ సుమిత్ర మహాజన్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు.

తాజావార్తలు