హైదరాబాద్ లో అతి త్వరలో జరిగే మాదిగల విశ్వరూప మహాసభ తాడో పేడో తేల్చుకోవాలి : మంద కృష్ణ మాదిగ

హాజరైన డాక్టర్ పిడమర్తి రవి

మాదిగ ఉప కులాల సమగ్ర అభివృద్ధి ఎస్సీ వర్గీకరణ ద్వారానే సాధ్యం

కంటోన్మెంట్ జనం సాక్షి ఆగస్టు 05 ఎమ్ఆర్పిఎస్,మహాజన సోషలిస్టు పార్టీ అధ్వర్యంలో రిజర్వేషన్ వర్గీకరణ సాధనకై హైదరాబాద్ లో ఈ నెలలో జరగనున్న మాదిగల విశ్వరూప మహాసభను విజయవంతం చేయాలని మంద కృష్ణ మాదిగ పిలుపునిచ్చారు. మరో విశ్వ రూప పోరాటానికి సిద్ధం కావాలని అయన అన్నారు.ఈ సభనువిజయవంతం చేసేందుకు తిరుమల గిరిలోనీ జయ లక్ష్మి గార్డెన్ లో జరిగిన హైదరాబాద్ జిల్లా సన్నాహక సభకు ముఖ్య అతిథిగా మంద కృష్ణ హాజరైయ్యారు. అనంతరం మంద కృష్ణ మాదిగ మాట్లాడుతూ1950లో రాజ్యాంగం అమలు అయితే, 50 సంవత్సరాలు రిజర్వేషన్లను మలలే అనుభవించారని, 2000 నుండి 2004 సంవత్సరం వరకు ఎస్సీ వర్గీకరణ అమలు అయితే, మాదిగ, మాదిగ ఉప కులాలకు 22 వేల ఉద్యోగాలు వచ్చాయని ఆయన తెలిపారు. ఆ తర్వాత 2005 నుండి ప్రస్తుతం 2023 వరకు అనగా 19 సంవత్సరాలు కూడా మళ్లీ రిజర్వేషన్ ఫలాలను మాలలే అనుభవిస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మాలలను ఎస్సీ జాబితాలో నుంచి తొలగించాలని, లేదా ఎస్సి ఏబిసిడి వర్గీకరణ జరగాలని మందకృష్ణ మాదిగ,రాష్ట్ర,కేంద్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. ఆగస్టు చివర్లో జరిగే మాదిగల విశ్వరూపం మహాసభనుసుమారుగా 30 లక్షల మందితో నిర్వహించే సభకుమాదిగ ఉపకులాలు ప్రతి ఇంటికి తాళం వేసి హైదరాబాద్ నగరానికి రావాలనిమందకృష్ణ మాదిగ పిలుపునిచ్చారు. వర్గీకరణ పై బిజెపి పార్లమెంట్ లో బిల్లు పెట్టాలి.ఎస్సీ వర్గీకరణకు మద్దతు ఇవ్వని పార్టీలను బొంద పెట్టాలి అనిఅన్నారు.ఈకార్యక్రమంలోడాక్టర్ పిడమర్తి రవి,ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకుడు అజిత్ కళ్యాణ్, హైదరాబాద్ జిల్లా ఉపాధ్యక్షులు ఇటికే శ్రీ కిషన్, ఎమ్మార్పీఎస్ నాయకులు మంద ప్రభాకర్, చెర్రిపోతు సాయన్న, మహేష్, శ్రీను, రాములన్న,రాగటి సత్యం మాదిగ,మంద కుమార్ మాదిగ,వాల్మీకి,తిరుమల నర్సింహ మాదిగ,శేఖర్ గణేష్ మాదిగ, ఎమ్ఆర్పిఎస్ నాయకులు కార్యకర్తలు, విద్యార్ధులు, మహిళా నాయకురాలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

తాజావార్తలు