13న పశ్చిమలో ప్రవేశించనున్న జగన్‌ యాత్ర

జిల్లాలో 250 కి.విూ. మేర పర్యటన: ఆళ్లనాని
ఏలూరు,మే10(జ‌నం సాక్షి): వైకాపా అధినేత జగన్‌ పాదయాత్ర పశ్చిమగోదావరి జిల్లాలో ఈనెల 13వ తేదీ నుంచి ప్రారంభమవుతుందని ఆ పార్టీ ఎమ్మెల్సీ, జిల్లా అధ్యక్షుడు ఆళ్లనాని తెలిపారు. ఏలూరులోని జిల్లా పార్టీ కార్యాలయంలో జగన్‌ పాదయాత్రకు సంబంధించిన రూట్‌మ్యాప్‌, తదితర వివరాలను ఆయన వెల్లడించారు. జిల్లాలో చింతలపూడి, పోలవరం మండలాలు మినహా 250 కిలోవిూటర్లు పాదయాత్ర కొనసాగుతుందని తెలిపారు. జిల్లాలోని 15 అసెంబ్లీ నియోజకవర్గాల్లో దాదాపు 13 నియోజకవర్గాల్లో పాదయాత్రలు, బహిరంగ సభలు నిర్వహించనున్నట్లు ఆళ్ల నాని తెలిపారు. ప్రస్తుతం జగన్మోహన్‌రెడ్డి పాదయాత్ర కృష్ణా జిల్లాలో జరుగుతోందని.. పెద్దయడ్లగాడ నుంచి ఆయన జిల్లాలోకి ప్రవేశిస్తారని వెల్లడించారు. అనంతరం దెందులూరు అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో పాదయాత్ర చేసుకుంటూ ఏలూరు చేరుకుంటారని, పాదయాత్ర 2వేల కిలోవిూటర్లు పూర్తి చేసుకున్నందుకుగాను వెంకటాపురం పంచాయతీలో 40 అడుగుల స్థూపాన్ని జగన్‌ ఆవిష్కరిస్తారని తెలిపారు. అనంతరం ఏలూరులో భారీ బహిరంగ సభ జరుగుతుందని వెల్లడించారు. ఆ తర్వాత దెందులూరు, నల్లజర్ల తాడేపల్లిగూడెం, భీమవరం పాలకొల్లు నర్సాపురం, తణుకు, నిడదవోలు, కొవ్వూరు బ్రడ్జి వరకు జిల్లాలో జగన్మోహన్‌రెడ్డి పాదయాత్ర జరిగేలా రూపకల్పన చేసినట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమాలను జిల్లాలోని వైఎస్‌ఆర్‌ పార్టీ శ్రేణులు, నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.
——————-

తాజావార్తలు