12 నుంచి వార్షిక పరీక్షలు..24నుంచి సెలవులు
విశాఖపట్టణం,ఏప్రిల్2(జనంసాక్షి): ఈ నెల 24 నుంచి పాఠశాలలకు వార్షిక సెలవుఉల ప్రకటించారు. పరీక్షలు పూర్తయ్యాక 24 నుంచి జూన్ 12 వరకు సెలవులు ప్రకటించినట్లు డిఇవో తెలిపారు. తిరిగి జూన్13న స్కూళ్లు తెఉస్తారు. ఇకపోతే ఈనెల 12 నుంచి 22వ తేదీవరకు ఒకటి నుంచి 9వ తరగతి వార్షిక పరీక్షలలను నిర్వహించనున్నట్లు జిల్లా విద్యాశాఖాధికారి ఎం.వెంకట కృష్ణారెడ్డి తెలిపారు. 6 నుంచి 8వ తరగతి వరకు ఉదయం 9.15 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు నిర్వహిస్తామన్నారు. 9వ తరగతికి ఉదయం 9.15 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, 2 నుంచి సాయంత్రం 4.45 గంటల వరకు పరీక్షలు ఉంటాయన్నారు. 6 నుంచి 9వ తరగతి వరకు 12న తెలుగు, 13న హిందీ, 16న ఆంగ్లం, 18న గణితం, 19న సైన్సు, 20న జీవశాస్త్రం, 21న సాంఘిక శాస్త్రం, 22న ఓ.ఎస్.ఎస్.సి పరీక్షలు జరుగుతాయన్నారు. ఒకటి నుంచి ఐదో తరగతి వరకు ఈ నెల 18న తెలుగు, 19న ఆంగ్లం, 20న గణితం, 21న పరిసరాల విజ్ఞానం పరీక్షలు నిర్వహించనున్నట్లు డీఈవో తెలిపారు. 1 నుంచి 8వ తరగతి వరకు ప్రశ్నపత్రాలను ఈనెల 8 నుంచి ఎంఈవోల ద్వారా తీసుకోవాలని ప్రధానోపాధ్యాయులకు సూచించారు. 9వ తరగతి ప్రశ్న పత్రాలు ఉమ్మడి పరీక్షల విధానం ద్వారా పొందాలన్నారు.