2019 ఎన్నికల్లో పోటీ చేస్తా – పవన్

pawan-kalyan-penumaka-opposing-la-27-1472297419గురువారం అనంత గర్జన సభలో ప్రత్యేక హోదా గురించి మాత్రమే మాట్లాడిన పవన్.. నేడు గుత్తి గేట్స్ కాలేజీ విద్యార్థులతో నిర్వహించిన ముఖాముఖిలో పెద్ద నోట్ల రద్దుపై స్పందించారు. ‘‘డబ్బులు పంచడం ద్వారా ఓట్లు కొనుక్కునే స్థాయికి మన నాయకులు వెళ్లే పరిస్థితులు ఉన్న నేపథ్యంలో పెద్ద నోట్ల రద్దు చాలా మంచి పని. బ్లాక్ మనీని బయటకు తీసుకురావాల్సిన అవసరం ఉంది. కానీ తీసుకొచ్చే విధానంలో చాలమంది ఇబ్బందులు పడొచ్చు. ట్యాక్స్‌లు కట్టాలంటే మనందరికీ ఇబ్బంది. దానికి కారణం.. మనం కష్టపడి డబ్బులు సంపాదిస్తే.. గవర్నమెంట్ మన దగ్గర ట్యాక్స్‌లు తీసుకొని, తిరిగి వాటికి తగ్గట్టు మనకు వసతులు కల్పించాలి. ప్రభుత్వం అలాంటి వసతులు కల్పించకపోవడం వల్లే సామాన్యుడు ట్యాక్స్ కట్టడానికి ముందుకు రావడం లేదు. ‘తాను డబ్బు కట్టి ప్రయోజనం ఏమిటి? ఎవరో రాజకీయనాయకులు తినేస్తారు. వాళ్ల జేబుల్లోకి వెళ్లిపోతాయనే’ సామాన్యులు టాక్స్‌లు కట్టరు. ముందు అవినీతి రాజకీయ నాయకుల మీద యుద్ధం చేయాలి. మార్పు అక్కడి నుంచి రావాలి.’’ అని పవన్ బదులిచ్చారు. 2019 ఎన్నికల్లో పోటీ చేస్తా అని పవన్ ప్రకటించారు. 

తాజావార్తలు