అత్యాశకు పోకండి.. మోసపోకండి

ఇన్వెస్ట్‌ మెంట్‌ ఫ్రాడ్స్‌ ..బీ అలర్ట్‌
అప్రమత్తంగా ఉండాలంటున్న పోలీసులు
హైదరాబాద్‌,సెప్టెంబర్‌9

మోసగాళ్లు విూ ఆశనే విూకు ఎరగా వేసి మిమ్మల్ని నిండా ముంచుతారు. నమ్మకం వెంటే మోసం ఉంటుంది. తక్కువ సమయంలో తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలంటూ అర చేతిలో వైకుంఠం చూపిస్తారు. తీరా డబ్బులు డిపాజిట్‌ చేశాక ముఖం చాటేస్తారు, ఫోన్‌ స్విచ్‌ ఆఫ్‌ అవుతుంది. తస్మాత్‌ జాగ్రత్త! అంటున్నారు.. సైబరాబాద్‌ కైమ్స్ర్‌ డీసీపీ రోహిణీ ప్రియదర్శినీ.
ఫలానా కంపెనీలో పెట్టుబడులు పెడితే రెట్టింపు ఇస్తాం, ఫలానా  షేర్లు కొంటే 10 రెట్ల లాభం వంటి ఆకర్షణీయ ప్రకటనలు చూసి మోసపోవద్దు. ఈజీ మనీ కి అర్రులు చాచవద్దు. ఏదేని సంస్థలో పెట్టుబడు పెట్టాలనుకున్నప్పుడు లేదా షేర్ల కొనుగోలులో క్షుణ్ణంగా అధ్యయనం చేయాలి. ఆ కంపెనీ నిజంగా ఉందా, సదరు ప్రకటన ఎవరిచ్చారు. షేర్‌ మార్కెట్‌ లో పెట్టుబడులు రిస్క్‌ టి కూడుకున్నవి. ఎవరూ విూకు ఊరికే లాభాలు ఇవ్వరని గమనించాలన్నారు.  ప్రముఖ కంపెనీలలో ఫ్రాంఛైజీ లలో పెట్టుబడులని ఫోన్‌ లు చేసి  ఊరించి ముందుగా తమ ఖాతాలలో అందినంత డబ్బులు వేసుకుంటారు. ఆ తర్వాత ఫోన్‌ చేసినా సమాధానం కరువవుతుంది. సెల్‌ టవర్ల ఏర్పాటు, తక్కువ వడ్డీకి లోన్‌ లు ఇప్పించడం, ప్రభుత్వ ఉద్యోగాలంటూ ఇలా దొరికితే.. అలా మోసాలు చేస్తారు. మోసగాళ్లు ఫోన్‌, ఎస్‌ఎంఎస్‌ లేదా ఈమెయిల్‌ ద్వారా ముందుగా బాధితుడిని అప్రోచ్‌ అవుతారు. వెంటనే వారి ఎత్తును పసిగడితే మోసపోకుండా ఉండొచ్చన్నారు.  ఫోన్‌ చేసి విూకు ఫలానా లాటరీలో కోట్లు వచ్చి పడ్డాయి.. ప్రాససింగ్‌ ఫీ, కస్టమ్స్‌ తదితర వాటికి కొంత అమౌంట్‌ పంపించాలని ఎవరైనా చెబితే.. ఖచ్చితంగా మోసం అని గుర్తించండి. వారు దశలవారీగా విూ నుంచి డబ్బుని వసూలు చేస్తారు. ముందుగా విూ దేశంలో లాటరీ టికెట్‌ లు కొనే అనుమతి ఉందా? అసలు లాటరీ టికెట్‌ విూరు కొన్నారా? లేదా అని నిర్దారించుకోండి.  విూరు అసలు టికెటే కోనంది ఎవరు విూకు గిప్ట్‌ ఇవ్వరని గుర్తుంచుకోండన్నారు.  అపరిచిత వ్యక్తులు విూకు ఫోన్‌ చేసి విూ బ్యాంక్‌ అకౌంట్‌ వివరాలు, వ్యక్తిగత సమాచారం వంటి విషయాలను అడిగినప్పుడు.. ముందుగా అడిగే వారి క్రిడెన్షియల్స్‌/పూర్వాపరాలు చూడండి. అసలు విూరెవరు?, ఎందుకు ఫోన్‌ చేశారు? నా ఫోన్‌ నంబర్‌ విూకు ఎవరు ఇచ్చారు? అని ప్రశ్నలు అడగండి. వారిచ్చిన సమాధానాలు సంతృప్తిగా లేకున్నా.. వారి తడపడ్డా వారి కాల్‌ కట్‌ డిస్కనెక్ట్‌ చేయడం మంచిదన్నారు. షేర్‌ మార్కెట్‌లో పెట్టుబడి పేరుతో మోసాలకు పాల్పడుతుంటారు. విూ తరపున తాము షేర్‌ లను కొని ఎక్కువ లాభాలు వచ్చేలా చూస్తామని నమ్మించి మోసం చేస్తారు. అమెరికాకు చెందిన ట్రేడింగ్‌ కంపెనీలో పెట్టుబడి పెడితే ప్రతిరోజు డాలర్లతోపాటు ఏడాది తరువాత పెట్టిన పెట్టుబడి రెండింతలు వస్తుందని అమాయకులను ముంచుతారు.మోసాలు సరికొత్త కోణంలో ప్రజలను నిలువునా ముంచేస్తున్నాయని హెచ్చరించారు.  తమ కంపెనీలో బంగారంలో పెట్టుబడులు పెడితే రెట్టింపు లాభాలంటూ డిపాజిట్లు సేకరించి బోర్డు తిప్పేసిన కంపెనీలు ఉన్నాయి.
బిట్‌కాయిన్ల పేరుతో మోసం చేస్తుంటారు. బిట్‌ కాయిన్‌ లు మంచి ఇన్వెస్ట్‌ మెంట్‌ సాధనాలని నమ్మిస్తారు.
మోసపూరిత ప్రకటనలు, కాల్స్‌ వస్తే సైబరాబాద్‌ సైబర్‌ కైమ్ర్‌ పోలీసులకు 9490617310 ఫోన్‌ నంబర్లలో ఫిర్యాదు చేయండని ఆమె సూచించారు.