ఆందోళన కలిగిస్తున్న సింగరేణి ప్రమాదాలు

ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని విధుల నిర్వహణ
కార్మికుల కుటుంబాల్లో నిత్యం ఆందోళనలే
రామగగుండం,మార్చి9(జనం సాక్షి): సింగరేణి కాలరీస్‌లో వరుస ప్రమాదాలు ఆందోళన కలిగిస్తున్నాయి. సరైన రక్షణ చర్యలు తీసుకోవడం లేదన్న ఆరోపణల మధ్య కార్మికులు నిత్యం జీవితాలతో పోరాడుతూనే ఉన్నారు. వివిధ ఏరియాల్లో నిత్యం జరుగుతున్న ప్రమాదాల కార్మిక కుటుంబాల్లో ఆందోళన కలిగిస్తు న్నాయి. ఉత్పిత్తి లక్ష్యాలను సాధించే క్రమంలో కార్మికులు రేయిపగలు తేడా లేకుండా శ్రమిస్తుండగా
యాజమాన్యం మాత్రం రక్షణ చర్యల పట్ల అప్రమత్తంగా లేకపోవడం, పని ప్రదేశాల్లో భద్రత ప్రమణాలను పూర్తిస్థాయిలో పాటించకపోవడం వంటి కారణాలతో ప్రమాదాలు జరుగుతున్నాయని కార్మికసంఘాలు ఆరోపిస్తున్నాయి. గత ఐదేళ్లలో భారీ సంఖ్యలో ప్రమాదాలు జరిగాయి. 2017లో 11 పెద్ద ప్రమాదాల్లో 12మంది కార్మికులు మృతి చెందారు. 2018లో జరిగిన ప్రమాదాల్లో ఏడుగురు కార్మికులు మృతి చెందారు. మొత్తం 190ప్రమాదాలు జరిగాయి. 2019లో 138 ప్రమాదాలు జరగ్గా ఎనిమిది మంది కార్మికులు మృతి చెందారు. 2020లో 98ప్రమాదాలు జరగ్గా 12మంది కార్మికులు మృతి చెందారు. 2021లో 104ప్రమాదాలు జరగ్గా 10 మంది కార్మికులు మృతి చెందారు. ఇలా సింగరేణి బొగ్గుగనులు ఆదాయంతో పాటు కార్మికుల రక్తంతో తడిసిముద్దవుతున్నాయి. తమ స్వేదం చిందించి సిరులు కురి పిస్తున్న సింగరేణిలో యాజమాన్యానికి ఉత్పత్తి, లాభాలపై ఉన్న శ్రద్ధ తమ ప్రాణాలను కాపాడే చర్యలపై ఉండటం లేదని కార్మికులు వాపోతు న్నారు. నిత్యం ఏదో ఒక ప్రమాదాలలో కార్మికులు గాయపడడం కొన్ని సందర్భాలలో ప్రాణాలు కోల్పోవడం నిత్యకృత్యంగా మారుతోంది. సోమవారం రామగుండం ఏరియాలోని ఆండ్రీయాల లాంగ్‌వాల్‌ ప్రాజెక్టులోని 8వ సీమ్‌ 86వ లెవల్‌వద్ద భూగర్భంలో పైకప్పు కూలిన ఘటనలో ఆరుగురు కార్మికుల ఆచూకీ గల్లంతైంది. సోమవారం రాత్రి వరకు వారి జాడ తెలియకపోవడంపై కార్మిక వర్గంలో తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. వరుస ప్రమాదాలతో ఆందోళనలో కార్మిక కుటుంబాలుగత రెండు దశాబ్దాలుగా రికార్డు స్థాయిలో బొగ్గు ఉత్పత్తులు సాగిస్తూ సింగరేణికి వేలాది కోట్ల లాభాలు సమకూరుస్తున్న సంస్థలో ప్రమాదాలు ఉత్పత్తితోపాటు పోటీ పడుతున్నాయి. నాలుగు నెలల క్రితమే శ్రీరాంపూర్‌ ఎస్‌ఆర్‌పీ మూడో గనిలో పైకప్పు కూలి నలుగురు కార్మికులు మృత్యువాత పడ్డారు. ఈ సంఘటనలో ఇల్లెందుకు చెందిన బదీలివర్కర్‌ రాజు అనే యువకార్మికుడు సైతం మృతి చెందాడు. మణుగూరు ఓసీలో కొద్ది నెలల క్రితమే డంపర్‌ ప్రమాదంలో ముగ్గురు కార్మికులు మృతి చెందారు. కొత్తగూడెం 7షాప్టు తదితర గనుల్లో జరిగిన ప్రమాదాలు కార్మిక కుటుంబాల్లో తీవ్ర భయాందోళనలు కలిగించాయి. వాటిని మరువకముందే