ఇఎస్‌ఐ చట్టపరిధిలోకి ప్రైవేటుస్కూళ్లు

న్యూఢిల్లీ,ఫిబ్రవరి13(జ‌నంసాక్షి): ప్రైవేటుస్కూళ్లను ఇఎస్‌ఐ చట్టపరిధిలోకి తెచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం  ప్రయత్నాలు చేస్తున్నది. అయితే దీనిపై వ్యతిరేకత వస్తోంది. దీనిని  తాము వ్యతిరేకిస్తున్నట్లు ది నేషనల్‌ ఇండిపెండెంట్‌ స్కూల్స్‌ అలయెన్స్‌ (నిసా) ప్రకటించింది. కేంద్రం ఈ చర్యలు అమలు చేస్తే తాము ఫీజులు పెంచాల్సి వుంటుందని నిసా ఒక ప్రకటనలో వివరించింది. ఇటీవలి కాలంలో ఉద్యోగుల్ని భవిష్యనిధి చట్ట పరిధిలోకి తెచ్చేందుకు ప్రైవేటు స్కూళ్లపై ప్రభుత్వం తెస్తున్న ఒత్తిడి వల్ల తాము ఫీజులు పెంచాల్సిన పరిస్థితి కల్పిస్తోందని పేర్కొంది. వాస్తవానికి ప్రమాదకర పరిశ్రమల్లో పనిచేస్తున్న కార్మికుల కోసం అమలులోకి తెచ్చిన ఇఎస్‌ఐ చట్టం ప్రైవేటు స్కూల్‌ టీచర్లకు వర్తింప చేయాలని చూడటం అర్ధరహితమని, ఇప్పుడు ఈ చట్టాన్ని గత కాలం నుండే స్కూళ్ళకు వర్తింప చేసేందుకు ప్రయత్నిస్తున్న నేపథ్యంలో స్కూళ్లు గతకాలపు బకాయిలను చెల్లించే పరిస్థితిలో లేవని నిసా సభ్యులు పేర్కొన్నారు.