ఉత్తరాది గాలులతో వణికిస్తున్న చలి

హైదరాబాద్‌,జనవరి7(జ‌నంసాక్షి): ఉభయ తెలుగు రాష్టాల్ల్రో మళ్లీ చలి పెరిగింది. ఉత్తరాది నుంచి వస్తున్న శీతల గాలులే ఇందుకు కారణమని వాతావరణ అధికారులు చెబుతున్నారు. దీంతో తెలంగాణ రాష్ట్రంలో కూడా చలి పెరిగింది. ఛత్తీస్‌గఢ్‌లో ఉపరితల గాలులు వీస్తున్నాయి. వాటి వల్ల తెలంగాణలో వాతావరణం చల్లబడి చలి పెరిగిందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రంతెలిపింది. . ఉత్తర భారతంలో సైతం పశ్చిమ అస్థిర గాలులు అధికంగా వీస్తున్నాయి. వాటి ప్రభావం కూడా తెలంగాణపై ఉందని ఆయన వివరించారు. శనివారం నుంచి 3 రోజుల దాకా సాధారణంకన్నా నాలుగైదు డిగ్రీల తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని, చలి అధికంగా ఉంటుందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.