ఎక్కడికి మట్టి కుప్పలు అక్కడే…..

ఎక్కడి గోతులు అక్కడే…. రహదారి మలుపుల వద్ద ప్రమాద ఘంటికలు…

ములుగు బ్యూరో,ఫిబ్రవరి10(జనం సాక్షి):-ములుగు బ్యూరో,ఫిబ్రవరి10(జనం సాక్షి):-
ములుగు జిల్లా గోవిందరావుపేట మండలంలోని పసర నుండిమేడారం ఆర్అండ్బి రహదారిపై ఎక్కడి గోతులు అక్కడే ఎక్కడి కుప్పలు అక్కడే అన్నట్టుగా ఉంది. మూలమలుపు వద్ద ప్రమాదకరమైన రాళ్ళు దర్శనమిస్తున్నాయి. ప్రతి రోజు వేల సంఖ్యలో కార్లు వాహనాలలో సందర్శకులు మేడారం జాతరకు వెళ్లి వస్తుంటారు.ఈ రహదారిలో గుత్తేదారుల నిర్లక్ష్యంస్పష్టంగా కనబడుతుందని స్థానికులు భక్తులుతెలుపుతున్నారు. మూలమలుపు వద్ద ప్రాక్లిన్ తో తోడి వేసిన పాత బిటి కుప్పలు ఇంకా కుప్పలుగా కనిపిస్తున్నాయి. ఏమాత్రం ఆదమరచిన కుటుంబంతో సహా ప్రమాదానికి గురి కావాల్సిందేనని ప్రయాణికులు తెలుపుతున్నారు.మామూలురోజుల్లోనే పరిస్థితి ఇలా ఉంటే తర సమయంలో ఎలాఉంటుందో అన్న భయాన్ని వారు వ్యక్తం చేస్తున్నారు.కల్వర్టుల వద్ద మట్టిని లెవెల్ చేయక పోవడం వల్ల గోతులు అలాగే ఉన్నాయి. కొన్ని ప్రదేశాలలో తూతూ మంత్రంగా మట్టి కుప్పలను లెవెల్ చేశారు మరికొన్ని చోట్ల లెవల్ చేయకుండా అలాగే వదిలి వేశారు.జాతర వరకు రహదారికి ఇరువైపులా నీటితో మట్టిని గడపాల్సి ఉండగా ఇప్పటివరకు అలాంటి పని చేయకపోవడం వల్ల దుమ్ము విపరీతంగా లేస్తోంది. ఇప్పుడే దుమ్ము ఇలా లేస్తే ఫుల్ జాతర సమయంలో పరిస్థితి ఏంటని వాహనదారులు స్థానిక గ్రామాల వ్యక్తులు వ్యాపారులు ప్రశ్నిస్తున్నారు. ఆర్అండ్ బి అధికారులకు చెప్పిన నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని వాపోతున్నారు.గుత్తేదారు ఎంత చెప్పినా పట్టించుకోవడం లేదని అంటున్నారు. ఇప్పటికైనా కలెక్టర్ ఉన్నతాధికారులు ఈ విషయంలో పట్టించుకోని పనులు సక్రమంగా జరిగేలా చర్యలు చేపట్టాలని లేకుంటే ప్రమాద స్థాయి ఉదృతగా ఉంటుందని వారంటున్నారు. పూర్తి జాతరలో వాహనాలు నియంత్రణ తప్పి వస్తాయనే అలాంటి సమయంలో ప్రమాదాలు తలెత్తుతాయని వారంటున్నారు.పది కోట్ల వ్యయంతో నిర్మించిన ఫలితం లేదని జాతర పనులంటేనే తూతూ మంత్రంగా చేస్తారన్న నానుడిని గుత్తేదారులు అధికారులు నిజం చేస్తున్నారని వారు తెలుపుతున్నారు.మీరు చల్లగా పోవడం వల్ల దుమ్ము లేస్తుందని అడిగితే దుమ్ము జాతర అని చెప్పడం హాస్యాస్పదంగా ఉందని ప్రజలు అంటున్నారు. ఇప్పటికైనా అధికారులు మత్తు నిద్ర వదిలి సకాలంలో పనులు పూర్తి చేయాలని లేకపోతే ప్రమాదాల రూపంలో భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని స్థానికులు అంటున్నారు.