ఎన్‌ఐఏకు డాక్యుమెంట్లు ఇవ్వలేం..

– కోర్టులో స్పష్టం చేసిన సిట్‌
విజయవాడ, జనవరి23(జ‌నంసాక్షి) : వైసీపీ అధ్యక్షుడు జగన్‌పై జరిగిన కోడికత్తి దాడి కేసులో విచారణ చేపట్టిన డాక్యుమెంట్లను ఎన్‌ఐఏకు ఇవ్వలేమని సిట్‌ అధికారులు కోర్టుకు స్పష్టం చేశారు. సిట్‌ అధికారులు విచారణకు సహకరించడం లేదంటూ ఎన్‌ఐఏ వేసిన పిటిషన్‌పై బుధవారం ఎన్‌ఐఏ కోర్టులో విచారణ జరిగింది. డాక్యుమెంట్లు ఎన్‌ఐఏకి ఇవ్వాలంటూ ఈ నెల 19న సిట్‌ను కోర్టు ఆదేశించింది. అయితే న్యాయస్థానం తీర్పుపై సిట్‌ అధికారులు అభ్యంతరం తెలుపుతూ కోర్టులో పిటిషన్‌ వేశారు. మరోవైపు ఎన్‌ఐఏకి కేసు అప్పగించడాన్ని వ్యతిరేకిస్తూ.. హైకోర్టులో ప్రభుత్వం వేసిన పిటిషన్‌ పెండింగ్‌లో ఉంది. బుధవారం కోర్టులో జరిగిన విచారణలో డాక్యుమెంట్లు ఎన్‌ఐఏకు ఇవ్వలేమని సిట్‌ కోర్టుకు తెలిపింది.
ది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య జరుగుతున్న వ్యవహారమని, హైకోర్టులో కేసు పెండింగ్‌లో ఉందని, దీనిపై విచారించేందుకు కింది కోర్టుకు అర్హత లేదని సిట్‌ అధికారులు వాదనలు వినిపించారు.