ఏపీ సమస్యలపై గళమెత్తిన జగదేవ్‌

– 30నిమిషాలకుపైగా కేంద్ర ప్రభుత్వం తీరుపై ఎదురుదాడి
– రెండు జాతీయ పార్టీలు కలిసి ఏపీకి అన్యాయం చేశాయంటూ ఆగ్రహం
– విభజనతో 90శాతం జాతీయ సంస్థలు తెలంగాణలోనే ఉండిపోయాయి
– కాంగ్రెస్‌ తల్లిని చంపి బిడ్డను ఇచ్చిందని ఆనాడు మోదీ అన్నాడు
– ఏపీకి విభజన సమస్యలను పరిష్కరిస్తామని హావిూ ఇచ్చారు
– వెంకన్న సాక్షిగా మోదీ ప్రత్యేక ¬దా ఇస్తామని అన్నారు
– చివరకు నమ్మించి మోసం చేశారు
– ఏపీ రూ.16,500 కోట్ల ఆర్థిక లోటుకు కేంద్రం ఇచ్చింది రూ. 3,900
– రాజధాని నిర్మాణానికి రూ.43వేల కోట్లకు రూ. 1500 కోట్లు ఇచ్చారు
– విగ్రహాలకు వేలకోట్లు, ఏపీ రాజధానికి 1500 కోట్లా?
– ఏపీపై ప్రధాని కార్యాలయం కక్ష సాధిస్తోంది.. ఆర్నెల్లుగా ఏపీ క్షోభ అనుభవిస్తోంది
– పలుమార్లు గల్లా ప్రసంగానికి అడ్డుచెప్పిన తెరాస ఎంపీలు
న్యూఢిల్లీ, జులై20(జ‌నం సాక్షి) : ఏపీ సమస్యలపై ఎంపీ గెల్లా జయదేవ్‌ గలమెత్తారు.. కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్రాన్ని విభజించిన తీరు, అనంతరం అధికారంలోకి వచ్చిన బీజేపీ ఏపీ పట్ల వ్యవహరిస్తున్న విధానాన్ని పార్లమెంట్‌ సాక్షిగా ఎండగట్టారు. మోదీ మోసగాడంటూ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. విభజన సమస్యల పరిష్కారం, తదితర అంశాలపై కేంద్రం తీరును నిరసిస్తూ తెదేపా పార్లమెంట్‌లో అవిశ్వాస తీర్మానం పెట్టిన విషయం విధితమే.. కాగా అవిశ్వాస తీర్మానాన్ని ప్రారంభించిన వెంటనే తొలుత స్పీకర్‌ సుమిత్రామహాజన్‌కు 13 నిమిషాలు మాట్లాడాల్సిందిగా అవకాశం ఇచ్చారు. ప్రసంగం ప్రారంభంతోనే ఏపీకి కేంద్రం చేస్తున్న అన్యాయాన్ని గెల్లా జయదేవ్‌ సభకు వివరించారు. విభజన పాపం కాంగ్రెస్‌దే కాదు… బీజేపీది కూడా అని టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్‌ విమర్శించారు. రెండు జాతీయ పార్టీలు కలిసి ఏపీకి అన్యాయం చేశాయని అన్నారు. కేంద్రం చేయాల్సినంత సాయం చేసి ఉంటే ఏపీ మరోలా ఉండేదని ఆయన అన్నారు. ఉమ్మడి ఏపీకి ఆదాయ వనరుగా హైదరాబాద్‌ ఉండేదని, హైదరాబాద్‌లో అన్ని ప్రాంతాల వారు పెట్టుబడులు పెట్టారని తెలిపారు. హైదరాబాద్‌ తెలంగాణకు పోవడం వల్ల ఏపీ ఆదాయం లేని రాష్ట్రంగా ఏపీ మిగిలిందని పేర్కొన్నారు. విభజనతో 90 శాతం జాతీయ సంస్థలు తెలంగాణలోనే ఉండిపోయాయన్నారు. ఏపీ అభివృద్ధి రేటు 13 శాతం ఉన్నా తలసరి ఆదాయం గణనీయంగా తగ్గిందని గల్లా తెలిపారు. అన్యాయంగా ఏపీని విభజించి తీరని అన్నాయం చేసిందని గెల్లా పేర్కొన్నారు. దీంతో టీఆర్‌ఎస్‌ ఎంపీలు గెల్ల ప్రసంగాన్ని అడ్డుకొనే ప్రయత్నం చేశారు. తెలంగాణ రాష్ట్రం ప్రజాస్వామ్య బద్దంగానే సాగిందని నినాదాలు చేశారు. ప్రసంగాన్ని కొనసాగించిన జయ్‌దేవ్‌ రాజ్యసభలో ఆనాడు ప్రధాని మన్మోహన్‌ ఆరు హావిూలు ఇచ్చారని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. ప్రత్యేక ¬దా, వెనుకబడిన జిల్లాలకు జిల్లాలకు బుందేల్‌ఖండ్‌ తరహా ప్యాకేజీ ఇస్తామని ప్రకటించారని గుర్తుచేశారు. పారిశ్రామిక రాయితీలు, పోలవరం ముంపు మండలాల విలీనం, రెవెన్యూలోటు పూడుస్తామని హావిూలు ఇచ్చారని ఎంపీ తెలిపారు. కాంగ్రెస్‌ పార్టీ 2014లో తెలుగుతల్లిని నిలువునా చీల్చిందని, కాంగ్రెస్‌ తల్లిని చంపి బిడ్డను ఇచ్చిందని ఆనాడు మోదీ అన్న వ్యాఖ్యలను ఈ సందర్భంగా ఎంపీ గల్లా జయదేవ్‌ ప్రస్తావించారు. గత ప్రభుత్వం ఇచ్చిన హావిూలను నెరవేర్చే బాధ్యత  బీజేపీకి లేదా అని గల్లా ప్రశ్నించారు. విపక్షంలో
ఉన్నప్పుడు బీజేపీ ప్రత్యేక ¬దా ఇవ్వాల్సిందేనని, మేనిఫెస్టోలో పదేళ్లు ప్రత్యేక ¬దా ఇస్తామని చెప్పారని అన్నారు. తిరుపతి వెంకన్న సాక్షిగా మోదీ ప్రత్యేక ¬దా హావిూ ఇచ్చారని ఎంపీ గల్లా జయదేవ్‌ తెలిపారు. ప్రత్యేక ¬దా ఇస్తామని ప్రధాని ప్రకటించారని, కానీ ఆ హావిూని నిలబెట్టకోలేక పోయారన్నారు. ప్రత్యేక¬దా ఇచ్చేది లేదని 2018లో జైట్లీ తేల్చి చెప్పారన్నారు. ఆర్థిక సంఘం అభ్యంతరాలను సాకుగా చూపారని విమర్శించారు.
అందుకే కేంద్రంపై విశ్వాసం పోయింది..
ఆంధప్రదేశ్‌ రూ.16,500 కోట్ల ఆర్థిక లోటుకు గానూ కేంద్రం రూ. 3,900 కోట్లు ఇచ్చిందని, రాజధాని నిర్మాణానికి రూ.43వేల కోట్లకుగాను రూ. 1500 కోట్లు ఇచ్చిందని టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్‌ ఆరోపించారు. కేంద్రం ఏపీకి ఇచ్చిన హావిూల్ని నెరవేర్చామని చెబుతోందని, 2 నుంచి 3 శాతం నెరవేర్చితే మొత్తం నెరవేర్చినట్టా? అని ప్రశ్నించారు. పోలవరం, ఆర్థికలోటు, రాజధానికి 100 శాతం నిధులు ఇస్తామని చెప్పారని, పోలవరం, కేంద్ర విద్యాసంస్థలకు నామమాత్రపు నిధులు మాత్రమే ఇచ్చారని, అందుకే కేంద్రంపై విశ్వాసం పోయిందని గల్లా జయదేవ్‌ అన్నారు. బుందేల్‌ఖండ్‌, ఒడిశాలో… వెనుకబడిన జిల్లాలకు చేసిన సాయంతో పోలిస్తే ఏపికి ఇచ్చింది చాలా తక్కువని జయదేవ్‌ అన్నారు. వెనుకబడిన జిల్లాల కోసం రాష్ట్ర ఖాతాలోకి ఆర్బీఐ రూ. 350 కోట్లు జమచేస్తే కేంద్రం ఆ సొమ్మును వెనక్కి తీసుకుందని ఆయన ఆరోపించారు. ఏపీపై ప్రధాని కార్యాలయం కక్ష సాధిస్తోందని ఆర్నెల్లుగా ఏపీ క్షోభ అనుభవిస్తోందని జయదేవ్‌ ఆవేదన వ్యక్తం చేశారు. వివిధ సెస్‌ల కింద కేంద్రం రూ. 2.5 లక్షల కోట్లు వసూలు చేసిందని, ఏ రాష్ట్రానికి ఒక్క రూపాయి ఇచ్చిన పాపాన పోలేదని ఎంపీ గల్లా జయదేవ్‌ తీవ్రస్థాయిలో విమర్శించారు. ఈఏపీ ప్రాజెక్టుల కింద సాయం చేస్తామన్న కేంద్రం ఇంత వరకు మార్గదర్శకాలు విడుదల చేయలేదన్నారు. ఆఖరికి ఇప్పుడు మార్గదర్శకాలను కూడా మార్చేస్తున్నారని, ఈఏపీ నిధుల కోసం స్పెషల్‌ పర్పస్‌ వెహికల్‌ పెడుతామంటున్నారని, దేశం ఎన్నడూ చూడని విధానమిదని ఆయన అన్నారు. నాన్చివేత కోసమే కేంద్రం ఈ ధోరణి ఎంపీ అవలంభిస్తోందని గల్లా జయదేవ్‌ తీవ్రస్థాయిలో విమర్శించారు.
ఏపీ రాజధానికి రూ.1500 కోట్లు ఎలా సరిపోతాయి..?
ఏపీ రాజధానికి రూ.1500కోట్లు కేటాయించడంపై ఎంపీ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇతర రాష్ట్రాల్లో విగ్రహాలకు ఎక్కువ నిధులు కేటాయించిన కేంద్రం రాజధానికి కొంత మాత్రమే నిధులు కేటాయించడం ఎంత వరకు సమంజసమన్నారు. పటేల్‌, శివాజీ విగ్రహాలకు కోసం రూ.6500కోట్లు ఇచ్చారని, కానీ ఏపీ రాజధానికి మాత్రం రూ.1500 కోట్లు కేటాయిస్తారా? అవి ఎలా సరిపోతాయంటూ కేంద్ర ప్రభుత్వాన్ని ఎంపీ నిలదీశారు. ఢిల్లీకి రెండింతల విస్తీర్ణంలో గుజరాత్‌లో దోలేరో నగరం కడుతున్నారని ఈ సందర్భంగా ఎంపీ గల్లా జయదేవ్‌ గుర్తుచేశారు. కజకిస్తాన్‌ రాజధాని అస్తానాను పరిశీలించి అలాంటి రాజధాని నిర్మించుకోండని ప్రధాని స్వయంగా చెప్పారని తెలిపారు. ఏపీ రాజధాని కోసం రూ.50 వేల కోట్ల విలువైన భూములు రైతులు స్వచ్ఛందంగా ఇచ్చారని చెప్పారు. నవీ ముంబై కోసం 40వేల ఎకరాలు సేకరించారని.. ఇప్పుడు అమరావతి కోసం 30 వేల ఎకరాలు ఎందుకంటున్నారని గల్లా మండిపడ్డారు. కేంద్రం రాజధానికి రూ.2500 కోట్లు ఇచ్చామని చెబుతోందని, అందులో రూ.1000 కోట్లు గుంటూరు, విజయవాడలో భూగర్భ డ్రైనేజీ కోసం ఇచ్చిందే అని తెలిపారు. గుంటూరు లాంటి చిన్న పట్టణంలో భూగర్భ డ్రైనేజీకి రూ.1000 కోట్లు ఖర్చు అయితే…రూ.1500 కోట్లతో రాజధాని ఎలా నిర్మిస్తామని కేందప్రభుత్వాన్ని ఎంపీ గల్లా జయదేవ్‌ నిలదీశారు. మాట్లాడితే యూసీలు ఇవ్వలేదని కేంద్రం అసత్యాలు
ప్రచారం చేస్తుందని, దేశంలో సకాలంలో యూసీలు ఇచ్చిన రాష్ట్రాల్లో ఆంధ్రపదేశ్‌ మూడువ స్థానంలో ఉందన్నారు.
¬దాకు దగ్గ ప్యాకేజీ అంటే ఒప్పుకున్నాం..
ఏపీకి న్యాయం చేస్తాడని మోదీని నమ్మినందుకు ఏపీ ప్రజలకు పంగనామాలు పెట్టారని గెల్లా జయదేవ్‌ అన్నారు. ఏపీకి ప్రత్యేక ¬దా కావాలనే తాము డిమాండ్‌ చేశామని, కానీ ¬దాకు సమానంగా ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామని కేంద్రం తెలిపిందన్నారు. ప్రస్తుతం ఉన్న రాష్ట్రాల్లోనూ ¬దాను తొలగిస్తున్నామని తెలిపిందని, దీంతో ప్రత్యేక ప్యాకేజీ అయితే త్వరగా నిధులొస్తాయని చంద్రబాబు కేంద్రం మాటలు నమ్మి ఒప్పుకున్నారన్నారు. కానీ ప్రత్యేక ప్యాకేజీ కింద నిధులు ఇవ్వకపోగా దేశంలోనా 11 రాష్ట్రాలకు ప్రత్యేక ¬దాను కొనసాగిస్తుందని గెల్లా కేంద్రం తీరుపై మండిపడ్డారు. ప్రత్యేక ప్యాకేజీ నిధుల కోసం నాలుగేళ్లు ఎదురుచూశామని, అయినా కేంద్రం ఏపీ ప్రభుత్వాన్ని, ప్రజలను నాలుగేళ్లు మానసికక్షోభకు గురి చేసిందన్నారు. చేసేదేంలేక మోదీ నిజస్వరూపాన్ని గ్రహించి కేంద్రంతో తెదేపా తెగదెంపులు చేసుకోవాల్సి వచ్చిందన్నారు. కేవలం రాజకీయంగా కక్షసాధించేందుకు ఇలా చేస్తున్నారన్నారు. రాష్ట్రంలోని ప్రతిపక్ష పార్టీ వైకాపా ప్రధాని కార్యాలయం వద్ద రాచమార్గం ఉంటుందని, తెదేపా ఎంపీలపై నిఘా ఉంటుందని గెల్లా మోదీ తీరుపై మండిపడ్డారు.