కావాలనే పెట్రోల్‌ ధరలను పెంచుతున్నాం

– కేంద్ర మంత్రి కేజీ ఆల్ఫోన్స్‌ వివాదాస్పద వ్యాఖ్యలు

తిరువనంతపురం,సెప్టెంబర్‌ 16,(జనంసాక్షి): పెట్రోల్‌ ఎవరు కొంటారు ? కార్లు, బైక్‌లు ఉన్నవాళ్లే కదా. వాళ్లేవిూ ఆకలితో అలమటించడంలేదు. వాళ్లు పన్ను కట్టేందుకు సిద్దంగా ఉన్నవాళ్లే. వాళ్లు కచ్చితంగా పన్ను కట్టాల్సిందే అని కేంద్ర టూరిజంశాఖ మంత్రి కేజీ ఆల్ఫోన్స్‌ అన్నారు. తిరువనంతపురంలో ఆయన ఇవాళ విూడియాతో మాట్లాడుతూ ఈ కామెంట్స్‌ చేశారు. ప్రజలపై పన్ను వేస్తామని తెలియజేస్తూ ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. పన్ను కట్టే స్థోమత ఉన్నవాళ్ల విూదనే పన్ను వసూల్‌ చేస్తున్నట్లు మంత్రి చెప్పారు. పెట్రోల్‌ ధరలు పెరగడాన్ని సమర్థించిన ఆయన ఆ డబ్బును పేదల సంక్షేమానికి వినియోగిస్తామని చెప్పారు. పేదలకు సాయం చేయాలన్న ఉద్దేశంతోనే ట్యాక్స్‌లు వసూల్‌ చేస్తున్నామని, ఇండ్లు, టాయిలెట్లు, మౌళిక వసతుల కల్పనకు ఆ సొమ్ము వాడుతున్నట్లు మంత్రి చెప్పారు. తానేవిూ తప్పు మాట్లాడడం లేదని, కార్లు-బైక్‌లు కొన్నవాళ్లు ఉన్నత శ్రేణి వ్యక్తులు అని, వాళ్లు ట్యాక్స్‌ కట్టాల్సిందే అని, లేదంటే పేదల బాధ్యత ఎవరు తీసుకుంటారని ఆయన ప్రశ్నించారు.