గవర్నర్‌ ప్రసంగంపై టిడిపి నిరసనలు

ప్రసంగం ప్రతులను చించివేసిన సభ్యులు
నిరసనలు..నినాదాల అనంతరం బహిష్కరణ
అమరావతి,మార్చి7(జనం సాక్షి): ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభమయ్యాయి. రాష్ట్ర గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ తొలిసారిగా అసెంబ్లీలో ప్రసంగించేందుకు రాగా సీఎం జగన్‌, ఏపీ స్పీకర్‌ తమ్మినేని సీతారాం స్వాగతం పలికారు. ముందుగా జాతీయ గీతంతో సమావేశాలను ప్రారంభించిన అనంతరం గవర్నర్‌ తన ప్రసంగాన్ని ప్రారంభించారు. గవర్నర్‌ ప్రసంగం ప్రారంభం కాగానే ప్రతిపక్ష టీడీపీ సభ్యులు నిరసనలు, నినాదాలు చేశారు. రాజ్యాంగ వ్యవస్థలను కాపాడాలని , రాజ్యాంగ వ్యవస్థలను కాపాడలేని గవర్నర్‌ గో బ్యాక్‌..గో బ్యాక్‌ అంటూ నినాదాలు చేశారు. గవర్నర్‌ ప్రసంగ ప్రతులను చింపివేశారు. దీంతో ఏపీ సీఎం జగన్‌ తన అసహనం వ్యక్తం చేశారు. గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ ప్రసంగాన్ని వ్యతిరేకిస్తూ ప్రతిపక్ష టీడీపీ సభ్యులు నిరసనలు, నినాదాలు చేశారు. రాజ్యాంగ వ్యవస్థలను కాపాడాలని , రాజ్యాంగ వ్యవస్థలను కాపాడలేని గవర్నర్‌ గో బ్యాక్‌..గో బ్యాక్‌ అంటూ నినాదాలు చేశారు. కొద్దిసేపు అసెంబ్లీలో నిరసన తెలిపిన అనంతరం సమావేశం నుంచి బయటకు వెళ్లి అసెంబ్లీ లాబీలో బైటాయించి నిరసన తెలిపారు. గవర్నర్‌ తిరిగి వెళ్లే దారిలోకి టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వెళ్లకుండా మార్షల్స్‌ అడ్డుకున్నారు. దీంతో మార్షల్స్‌, టీడీపీ సభ్యుల మధ్య కొంత వాగ్వాదం జరిగింది. అయితే టిడిపి నిరసనల మద్యనే గవర్నర్‌ తన ప్రసంగాన్ని కొనసాగించారు.