గుట్కా ప్యాకెట్లు తరలిస్తున్న ముఠా అరెస్ట్‌

ఒంగోలు,నవంబర్‌20(జ‌నంసాక్షి): అక్రమంగా గుట్కా పాన్‌ పరాగ్‌ గంజాయి బస్తాలను తరలిస్తున్న అంతర్రాష్ట ముఠాను మార్టూరు ఎస్సై సిహెచ్‌ వెంకటేశ్వర్లు అరెస్టు చేశారు. వీటివిలువ 17 లక్షల వరకు ఉంటుందని తెలిపారు. మంగళవారం ఉదయం చీరాల డిఎస్‌పి శ్రీనివాసరావు విలేకరులతో మాట్లాడుతూ.. బెంగుళూరు నుండి కాకినాడ వెళుతున్న అరేంజ్‌ ట్రావెల్స్‌ బస్సులో నిషేదిత గుట్కా, పాన్‌పరాగ్‌, గంజాయిలను పెద్ద మొత్తంలో అక్రమంగా తరలిస్తున్న అంతర్రాష్ట ముఠాను, మార్టూరు ఎస్సై సిహెచ్‌.వెంకటేశ్వర్లు, ఇంకొల్లు సిఐ శేషగిరిరావులు ఉదయం ప్రకాశం జిల్లా మార్టూరు సవిూపంలోని రాజుపాలెం జంక్షన్‌ వద్ద అదుపులోకి తీసుకున్నారని తెలిపారు. 11 మంది అంతర్రాష్ట ముఠాను అరెస్టు చేసినట్లు తెలిపారు. వారి వద్ద నుండి రూ.17 లక్షల విలువ గల గుట్కా, పాన్‌ పరాగ్‌ , గంజాయిలతో ఉన్న 71 బస్తాలను స్వాదీనపరుచుకున్నామని చెప్పారు. అత్యంత చాకచక్యంగా ముఠాని పట్టుకోవడంలో ప్రతిభ కనపరిచిన మార్టూరు ఎస్సై వెంకటేశ్వర్లు, ఇంకొల్లు సిఐ శేషగిరిరావులను డిఎస్‌పి అభినందించారు.