జగిత్యాల జిల్లా వ్యాప్తంగా భాష పండితుల 9,10 తరగతుల సహాయ నిరాకరణ

 

 

 

 

 

 

 

మెట్పల్లి టౌన్, ఫిబ్రవరి 01,జనంసాక్షి :ఫిబ్రవరి 01వ తేది నుండి జగిత్యాల జిల్లా వ్యాప్తంగా భాష పండితుల ఐక్య కార్యాచరణ ఆధ్వర్యంలో 9వ.10వ తరగతులు సహాయ నిరాకరణ కార్యక్రమం కొనసాగుచున్నది , భాష పండితుల పోస్టులు గత 25సంవత్సరాలు నుండి ఎస్జిటీ. వేతనంతో స్కూల్ అసిస్టెంట్ విధులు నిర్వహించడం జరుగుతుంది.భాష పండితుల పోస్టులు అప్గ్రేడ్,చేయనందుకు స్కూల్ అసిస్టెంట్ హోదా కల్పించక పోవడం వల్ల,9,10 తరగతులు సహాయ నిరాకరణ కొనసాగుతున్నది పండితుల ఉద్యోగ చార్ట్ ప్రకారం 6,7,8 తరగతులకు మాత్రమే బోదిస్తా మని, ముఖ్య మంత్రి భాష పండితుల కు ఇచ్చిన హామీ అమలు పరచాలని ప్రభుత్వం స్పందించి భాష పండితులకు స్కూల్ అసిస్టెంట్ హోదా కల్పించాలని భాష పండితుల ఐక్య వేదిక నాయకులు అల్లకట్టు సత్య నారాయణ, ఏనుగందుల రాజేంద్ర ప్రసాద్ , వేల్పుల స్వామి , దండే రాజేంధర్ ,రంగు శ్రీనివాస్, కటుకం నరేందర్, శ్రీకాంత్, పద్మావతి,జ్యోతి రజని,శారదా మేడం తదితరులు కోరారు. అలాగే కొనరావుపేట స్కూల్లో హిందీ యల్ పి జలంధర్, అధ్యాపకులు శ్రీరాములు, వెంకటరమణ, విజేందర్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రధానోపాధ్యాయులు రాజారెడ్డికి 9 10 తరగతుల సహాయ నిరాకరణ వినతిపత్రం సమర్పించారు