జస్టిస్‌ గొగోయ్‌పై ఆరోపణలు చేసిన మహిళ చీటర్‌

 

ఆమె బెయిల్‌ రద్దు చేయాలంటూ పిటిషన్‌

న్యూఢిల్లీ,ఏప్రిల్‌20(జ‌నంసాక్షి): భారత ప్రధాన న్యాయమూర్తి రంజన్‌ గొగోయ్‌పై లైంగిక వేధింపుల ఆరోణలు చేసిన సుప్రీంకోర్టు మాజీ మహిళా ఉద్యోగికి ఢిల్లీ కోర్టు షాక్‌ ఇచ్చింది. ఓ చీటింగ్‌ కేసులో ఆమె బెయిల్‌ రద్దు చేయాలంటూ పోలీసు అధికారి ఒకరు వేసిన పిటిషన్‌పై ఈ నెల 24న విచారణ చేపట్టనున్నట్టు వెల్లడించింది. ఇంకా పోలీస్‌ పిటిషన్‌ తాలూకు పత్రాలు ఆమెకు అందనందున తదుపరి విచారణ వచ్చే వారంలో జరగనున్నట్టు చీఫ్‌ మెట్రోపాలిటన్‌ మేజిస్టేట్ర్‌ మనీష్‌ ఖురానా ప్రకటించారు. సదరు మహిళ, ఆమె బంధువులు తనపై దాడిచేశారని పేర్కొంటూ…గత నెల 12న ఆమెకు మంజూరు చేసిన బెయిల్‌ రద్దు చేయాలని ఢిల్లీ పోలీసులు కోరారు. న్యూఢిల్లీకి చెందిన నవీన్‌ కుమార్‌ అనే వ్యక్తి తిలక్‌ మార్క్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో పోలీసు మార్చి 3న మోసం, బెదింపులు, నేరపూరత కుట్ర తదితర సెక్షన్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. కోర్టు పరిసరాల్లో తనకు ఉద్యోగం ఇస్తానని చెప్పి సుప్రీం మాజీ మహిళా ఉద్యోగి తన వద్ద రూ. 50 వేలు లంచం తీసుకుని మోసం చేశారంటూ పిటిషన్‌ చెప్పుకొచ్చాడు.