జీతం పడకుండడానే తగ్గిందనుకుంటే ఎలా ?

పిఆర్సీ జివోలపై విచారణలో హైకోర్టు
అమరావతి,ఫిబ్రవరి1(జనం సాక్షి): పీఆర్సీ జీవోను సవాల్‌ చేస్తూ దాఖలైన పిటిషన్‌పై ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు మంగళవారం విచారణ జరిపింది. జీతం పడకుండా తగ్గినట్లు విూకు ఎలా తెలుసు అని హైకోర్టు ఉద్యోగ సంఘాలను ప్రశ్నించింది. ’సమస్య పరిష్కారం కోసం కోర్టులో విచారణ జరుగుతున్నప్పుడు సమ్మె చేయడం అంటే ధర్మాసనంపై అనవసర ఒత్తిడి కలిగించడమే.. ఉద్యోగుల సమ్మెతో సమస్య పరిష్కారం కాదని హైకోర్టు పేర్కొంది. కోర్టుకు ఏజీ శ్రీరాం వాదనలు వినిపిస్తూ.. ఉద్యోగులు అనవసర భయాందోళన లకు గురవుతున్నారని తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగస్తులకు ఒక్క రూపాయి కూడా తగ్గదన్నారు. అత్యున్నతమైన న్యాయస్థానం భావించినట్లే మేము కూడా కోర్టులో పిటిషన్‌కు సంబంధించిన విచారణ నడుస్తున్నప్పుడు సమ్మె చేయటం ప్రయోజనకరం కాదని భావిస్తున్నామని అడ్వకేట్‌ జనరల్‌ శ్రీరామ్‌ కోర్టుకు తెలిపారు. పీఆర్సీ జీవోలపై హైకోర్టులో విచారణ జరిగింది. జీతాల్లో రికవరీ చేయొద్దని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. జీతాల్లో రికవరీ సహజన్యాయ సూత్రాలకు విరుద్ధమని హైకోర్టు పేర్కొంది. జీతాల్లో రికవరీ, ఎరియర్స్‌ వసూలు వంటి అంశాలపై హైకోర్టు దృష్టికి పిటిషనర్‌ న్యాయవాది రవితేజ తీసుకువచ్చారు. రికవరీ చేయడం లేదని కోర్టుకు అడ్వకేట్‌ జనరల్‌ తెలిపారు. సమగ్ర కౌంటర్‌ అఫిడవిట్‌ దాఖలు చేయాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది.