ట్రాఫిక్‌ రూల్స్‌ గౌరవించండి

రోజ్‌డే నిర్వహించిన పోలీసులు
హైదరాబాద్‌,ఫిబ్రవరి7(జ‌నంసాక్షి): లవర్స్‌ డే వస్తుందంటే ప్రేమికులు భలే సందడి చేస్తారు. వాలంటైన్‌ వీక్‌ పేరుతో వారం ముందు నుంచే సెలబ్రేషన్స్‌ మొదలు పెట్టేస్తారు. రోజుకో పేరుతో తమ ప్రేమను చాటుకుంటుంటారు. తొలి రోజు రోజ్‌ డేకాగా, తర్వాత ప్రపోజ్‌ డే, చాక్లెట్‌ డే, టెడ్డీ డే, ప్రామిస్‌ డే, హగ్‌ డే, కిస్‌ డే వరుసగా వస్తుంటాయి. రోజ్‌ డేను ట్రాఫిక్‌ పోలీసుల జరిపి.. అందరినీ ఆశ్చర్యపరిచారు. ట్రాఫిక్‌ రూల్స్‌పై అవగాహన కల్పించడానికి .. అంది వచ్చిన ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకుంటున్న పోలీసులు.. దీన్ని కూడా తమదైన శైలిలో వినియోగించుకున్నారు. గోపాలపురం ట్రాఫిక్‌ పోలీసులు రోజ్‌ డేని తమదైన శైలిలో జరిపారు. వాహనదారులను రోజా పువ్వులు ఇస్తూ.. వాళ్లకు ట్రాఫిక్‌ పాఠాలు చెబుతున్నారు. హెల్మెట్‌ ధరించమని సూచిస్తూ.. అవగాహన కల్పిస్తున్నారు. ప్రమాదాల నివారణకు సహకరించాలని అన్నారు.