తెలంగాణ కోటి రతనాల మగనిగా మార్చిన ఘనత కేసీఆర్ దే  అలంపూర్ శాసన సభ్యులు డాక్టర్.వి.యం.అబ్రహం

అలంపూర్ జూన్ 7( జనం సాక్షి)కోటి ఎకరాల మాగానిగా మార్చిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ కే దక్కుతుందని అలంపూర్ శాసనసభ్యులు డాక్టర్ వి.ఎం అబ్రహం అన్నారు.అలంపూర్ చౌరస్తా లోని మార్కెట్ యార్డ్ లో జరిగిన తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా బుధవారం సాగునీటి దినోత్సవం వేడుకలకు ముఖ్యఅతిథిగా అలంపూర్ శాసన సభ్యులు డాక్టర్.వి.యం.అబ్రహం హాజరై య్యారు. జాతీయ గీతం తో కార్యక్రమానికి ప్రారంభించారు.అనంతరం ముందు మా తెలంగాణ కోటి ఏకరల మాగాణి మరియు సాగు నీటి రంగంలో ప్రగతి ప్రవాహంఅనే పుస్తకాలను ఆవిష్కరించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ,తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన గౌరవ ముఖ్యమంత్రి సాగునీటి రంగానికి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చి, ప్రపంచంలోనే అతిపెద్డ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టుతో పాటు అనేక ప్రాజెక్టులను నిర్మించి తెలంగాణ రాష్ట్రంలోని కోట్లాది ఎకరాల భూములకు సాగునీటిని అందించారని, అందులో మన తుమ్మిల లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఒకటి అని అందులో భాగంగా రెండవ దశలో మల్లమ్మ కుంట రిజర్వాయర్ కూడా సాంక్షన్ చేయడం జరిగింది అన్నారు.సాగు, తాగు నీటికి దశాబ్దాల పాటు తండ్లాడిన తెలంగాణా స్వరాష్ట్రంలో అపరభగీరథుడు సీఎం కేసీఆర్‌ చేపట్టిన జలయజ్ఞంతో జలకేతనం ఎగరేసింది తొమ్మిదేండ్లలో సస్యశ్యామలంగా మారి, రైతుల్లో ఆనందం వ్యక్తమవుతున్నది అన్నారు.తెలంగాణను కోటి ఎకరాల మాగాణంగా మార్చేసింది మన గౌరవ సీఎం కేసీఆర్ అని ధన్యవాదములు తెలిపారు.ఈ కార్యక్రమంలో అలంపూర్ మున్సిపాల్ చైర్మన్ మనోరమ, ఎంపిటిసి రాజు.వివిధ శాఖల చైర్మన్లు వైస్ చైర్మన్ ప్రజా ప్రతినిధులు మరియు ఇరిగేషన్ అధికారులు మరియు BRS పార్టీ నాయకులు మరియు రైతులు మరియు తదితరులు పాల్గొన్నారు..