తెలుగు రాష్ట్రాల్లో విజృంభిస్తున్న స్వైన్‌ఫ్లూ

హైదరాబాద్‌: రెండు తెలుగు రాష్ట్రాల్లో స్వైన్‌ఫ్లూ విజృంభిస్తోంది. నగరంలోని గాంధీ ఆస్పత్రిలో ఇప్పటికే స్వైన్‌ఫ్లూ వ్యధితో 10 మంది చిన్నారులు చికిత్స పొందుతుండగా.. తాజాగా తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో స్వైన్‌ఫ్లూ కలకలం రేగింది. స్వైన్‌ఫ్లూ లక్షణాలతో ఆస్పత్రికి వచ్చిన ఐదుగురిని పరీక్షించిన వైద్యులు అందులో ఒకరికి ఫ్లూ సోకిందని నిర్ధరించారు.
ఉత్తరాంధ్రలో కూడా ఈ కేసులు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. ‍ ప్రస్తుతం విశాఖలో 24 కేసులు, శ్రీకాకుళంలో 3 కేసులు, విజయనగరంలో 2 కేసులు నమోదయ్యాయి. కాగా.. గత మూడు నెలల్లో విశాఖలో 30 మందికి స్వైన్‌ఫ్లూ సోకిందని వైద్యులు తెలిపారు. వాతావరణంలో వచ్చిన మార్పుల వల్లే వేసవిలో కూడా స్వైన్‌ఫ్లూ వ్యాపిస్తోందని వైద్యులు అంటున్నారు.