పెళ్లి కానుకగా పెట్రోల్‌ క్యాన్‌

చెన్నై,సెప్టెంబర్‌18(జ‌నంసాక్షి): పెళ్లికి వెళ్తూ ఖరీదైన గిప్ట్‌ తీసుకెళ్తారు. లేకపోతే వధూవరులకు ఉపయోగపడే వస్తువేదైనా బహుమతిగా ఇస్తారు. కానీ తమిళనాడులోని కడలూరులో కొందరు యువకులు మాత్రం వినూత్నంగా ఆలోచించారు. నూతన దంపతులకు ఉపయోగపడే గిప్టే ఇచ్చినప్పటకీ అందులో కాస్త వ్యంగం జోడించారు. ఐదు లీటర్ల పెట్రోల్‌ క్యాన్‌ను పెళ్లి కొడుకు, పెళ్లికూతురుకు అందించారు. స్నేహితులు చేసిన పనికి నూతన వధూవరులతో పాటూ మండపమంతా నవ్వుకున్నారు. రోజు రోజుకూ పెరుగుతున్న పెట్రోల్‌ ధరలపై ఇలా తమదైన రీతిలో సెటైర్‌ వేయడంతో.. ఈ వీడియో వైరల్‌ గా మారింది.