ప్రభావవంతంగా లేని ప్రధాని ప్రసంగం

ప్రధాన సమస్యలపై అస్పష్ట సమాధానం
లోక్‌సభలో చివరి ప్రసంగంపై మేధావుల పెదవివిరుపు
న్యూఢిల్లీ,ఫిబ్రవరి14(జ‌నంసాక్షి): లోక్‌సభలో చివరి ప్రసంగంలో కూడా ప్రధాని మోడీ రఫేల్‌ దుమారంపై సమాధనాం ఇవ్వలేకపోయారు. అందరినీ మభ్యపెట్టే ప్రయత్నమే చేశారు. రఫేల్‌పై సభలో తాను మాట్లాడితే ప్రకంపనలు వస్తాయంటూ గతంలో రాహుల్‌ చేసిన వ్యాఖ్యల్ని గుర్తుచేస్తూ అలాంటిదేవిూ సంభవించలేదని విమర్శించారు. అనీల్‌ అంబానీకి కాంట్రాక్ట్‌  ఎందుకు కట్టబెట్టార్న విషయాన్ని చెప్పడంలో ప్రధాని మోడీ తప్పించుకున్నారు. ఎదురుదాడితో రక్షణ వ్యవస్థను ఆధునీకరించడం ఇష్టం లేదని విమర్శలు చేశారు. జిఎస్టీ, నోట్ల రద్దు దుష్ఫలితాలపనా వివరణ ఇవ్వలేదు. సరికదా దేశగౌరవాన్ని ఇనుమడించేలా చేశానని, దేశ ప్రయోజనాల కోసం మరోసారి తమకు మెజారిటీ ప్రభుత్వాన్ని అందించాలని మోదీ కోరారు. ప్రస్తుత ప్రభుత్వానికి ఓటర్లు ఇచ్చిన ఆధిక్యం కారణంగానే ప్రపంచవ్యాప్తంగా దేశ ప్రతిష్ఠ ఇనుమడించిందని తననుతాను అభినందించుకున్నారు. అయితే ఈ ప్రసంగం పెద్దగా ఆకట్టుకోలేక పోయింది. మేధావులు సైతం పెదవి విరిచారు.  సార్వత్రిక ఎన్నికల ముందు లోక్‌సభలో ప్రధానమంత్రి 30 నిమిషాలపాటు చేసిన తన చివరి ప్రసంగంలో దేశంఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలపై ఎక్కడా ప్రస్తావించలేదు. మహిళా సభ్యులు ఎక్కువగా ఉ/-నారని, స్పీకర్‌గా మంత్రులుగా మహిళలు ఉన్నారని చెప్పుకున్నా, ఎందుకు మహిళా బిల్లునే తేలేక పోయారో చెప్పలేకపోయారు. ప్రస్తుత లోక్‌సభ నిర్వహించిన 17 సెషన్లలో ఎనిమిది వందశాతంపైగా ఫలవంతమయ్యాయని పేర్కొన్నారు. మొత్తంగా సభ 85 శాతం ఫలవంతంగా సాగిందన్నారు. ప్రస్తుతం మెజారిటీతో కూడిన ప్రభుత్వం వల్ల భారత్‌ను అందరూ పట్టించుకుంటున్నారని పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా దేశ ప్రతిష్ఠ పెరగడానికి తానుగానీ, విదేశీ వ్యవహారాల మంత్రి సుష్మాస్వరాజ్‌గానీ కారణం కాదని, మూడు దశాబ్దాల తర్వాత లోక్‌సభలో సంపూర్ణ మెజారిటీతో ఏర్పడిన ప్రభుత్వానిదేనని, ఈ ఘనత దేశ ప్రజలకే చెందుతుందన్నారు. భారతదేశ ఆత్మవిశ్వాసం పెరిగిందని, విభిన్న పరిమితుల్లో మెరుగుదల నమోదైంద న్నారు. తమ ప్రభుత్వ విజయాలను ప్రస్తావిస్తూ.. భారత్‌ 6వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించిందని, సుమారు రూ.360 లక్షల కోట్ల ఆర్థిక వ్యవస్థ దిశగా సాగుతోందన్నారు. అవినీతి, నల్లధనం నిరోధకానికి కఠినమైన చట్టాల్ని ఆమోదించడం జరిగిందని,  జీఎస్టీని కూడా ఆమోదించిందని, ఈ పక్రియ సహకార స్ఫూర్తిని వెల్లడించిందని వ్యాఖ్యానించారు. విదేశాల్లో నల్లధనం, బినావిూ ఆస్తులు, జీఎస్టీ బిల్లుల్ని సభ ఆమోదించిందని తెలిపారు. బంగ్లాదేశ్‌తో ఎంతోకాలంగా అపరిష్కృతంగా ఉన్న సరిహద్దు వివాదం పరిష్కారం, ఆర్థికంగా బలహీన వర్గాలకు 10 శాతం రిజర్వేషన్లు కల్పించిన అంశాన్ని ప్రస్తావించారు. అయితే ఈ ప్రసంగం పెద్దా ప్రభావం చూపేలా లేదు. మసిపూసి మారేడుకాయ చేశారే తప్ప మరోటి కాదు.