మారుతున్న రాజకీయ సవిూకరణాలు !

పాదయాత్రలతో ప్రజల్లో వెళుతున్న నేతలు
కెసిఆర్‌కు దీటుగా ఎదగడమే లక్ష్యంగా ప్రణాళికలు
హైదరాబాద్‌,మార్చి15( జనం సాక్షి ): తెలంగాణలో రాజకీయ సవిూకరణాలు మారుతున్నాయి. కొత్తగా రాజకీయ పార్టీలు బల ప్రదర్శనలకు తెలంగాణ వేదికగా మారుతోంది. ఇంతకాలం టిఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయం లేదనుకుంటున్న దశలో అనూహ్యంగా బిజెపి దూసుకుని వచ్చి దుబ్బాకతో తొలిదెబ్బ కొట్టింది. తరవాత జిఎహెచ్‌ఎంసి, హుజూరాబాద్‌లతో మలిదెబ్బ కొట్టింది. ఇప్పుడు రేవంత్‌ రెడ్డి పిసిసి చీఫ్‌ కావడంతో ఒక్కసారిగా రాజకీయాలు మారాయి. ఆయన కూడా అనేక కార్యక్రమాలతో దూకుడుగా సాగుతున్నారు. ఇక వైసిపి తెలంగాణపార్టీతో వైఎస్‌ షర్మిల ప్రజాప్రస్థానం పేరుతో యాత్రలకు శ్రీకారం చుట్టారు. ఇదే సమయంలో ఆయా పార్టీలు యాత్రకలు శ్రీకారం చుట్టబోతున్నాయి. ప్రజల్లో తమ బలం పెంచుకునే ప్రయత్నంలో ఉన్నాయి. ఆమె తెలంగాణ ప్రజల పక్షాన పోరాడుతానని అంటున్నారు. అయితే ఆమె పాత్ర పరిమితమే అన్నది మున్ముందు తేలనుంది. అయితే తాజా రాజకీయాలు ఏ మేరకు ప్రజల
అవసరాలను, ఆకాంక్షలను తీరుస్తాయన్నది మున్ముందు జరిగే పరిణామాలను బట్టి అంచనా వేయాల్సి ఉంది. ఇంతకాలం అధికార టిఆర్‌ఎస్‌కు తిరుగులేకుండా పోయింది. అయితే బిజెపి అధ్యక్షుడిగా బండి సంజయ్‌ నియామకం, దుబ్బాక గెలుపుతో కొంత పరిస్థితిలో మార్పులు గోచరించాయి. కెసిఆర్‌ విూద ఉన్న వ్యతిరేకతను క్యాష్‌ చేసుకునే ప్రతయ్నంలో ఇప్పుడు అన్ని పార్టీలు నిమగ్నం అయ్యాయి. తెలంగాణలో పిసిసి చీఫ్‌గా రేవంత్‌రెడ్డి నియామకంతో మళ్లీ కాంగ్రెస్‌ రాజకీయాల్లో అనూహ్య మార్పులు కనిపించ బోతున్నాయి. యువకుడైన రేవంతం పట్ల యూత్‌ అట్రాక్ట్‌ అవుతోంది. కాంగ్రెస్‌లో ఉన్న గ్రూపులు కూడా ఆయనతో కలసి రావాల్సి ఉంటుంది. గతంలో లాగా గోచీ గుంజే ప్రయత్నాలు సాగకపోవచ్చు. ఎందుకంటే మారుతున్న రాజకీయ పరిణామ క్రమంలో పార్టీని బలోపేతం చేయడం లక్ష్యంగా రేవంత్‌ సవిూకరణాలను మార్చుకునే అవకాశం ఉంది. యూత్‌లో మంచి పాలోయింగ్‌ ఉండడం, మాస్‌ లీడర్‌గా పేరుండడం, మంచి వక్త కావడం ఆయనకు కలసి వచ్చే అవకావం ఉంది. అంతే గాకుండా కాంగ్రెస్‌ను వీడిని వారు సైతం వెనక్కి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇదే సమయంలో దివంగత వైఎస్‌ తనయ షర్మిల ఓ రాజకీయ పార్టీని ప్రారంభించారు. అయితే ఆమె కేవలలం వైఎస్‌ అభిమానులను మాత్రమే అట్రాక్ట్‌ చేయగలదు. తెలంగాణలో ఇప్పుడు పరిస్థితుల్లో ఆంధ్రా నాయకులకు పెద్దగా అండ దక్కక పోవచ్చు. కాంగ్రెస్‌ అసంతృప్తులు కూడా ఇప్పుడు రేవంత్‌ను అనుసరించడం ఖాయం. అలాగే వైఎస్‌ అభిమానులు కూడా రేవంత్‌ వెంటే ఉండడానికి ఇష్టపడతారు. ఎందుకంటే షర్మిలకు ఉన్న మైనస్‌ పాయింట్లు అనేకం ఉన్నాయి. ఇకపోతే తెలంగాణ ఉద్యమంలో ముందువరసలో ఉన్న అనేకమంది ఉద్యమకారులు, యువత, నిరుద్యోగులు రేవంత్‌ను అనుసరించే అవకాశాలు కనిపి స్తున్నాయి. ఉద్యమ సమయంలో అందరినీ కదిలించిన ప్రొఫెసర్‌ కోదండరామ్‌ సైతం వెనకబడిపోయారు. ఆయన ఎలాంటి పిలుపు ఇచ్చినా పెద్దగా స్పందన రావడం లేదు. ఈ దశలో మరో సంఘటిత రైతాంగ ఉద్యమం అవసరం ఎంతైనా ఉందని తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరామ్‌ అన్నారు. దోపిడీ నుంచి రైతులకు రక్షణ కోసం కొత్త ఉద్యమానికి అందరూ ఏకం కావాలని ఢల్లీిలో జరుగుతున్న రైతుల పోరాటం చెబుతోందని కోదండరామ్‌ అంటున్నారు. నిజానికి గత 9నెలలుగా రైతులు అరెస్టులను తట్టుకుని పోరాడుతున్నా..మోడీని ప్రభావితం చేయలేక ప ఓయారు. ప్రజలలను ఆకట్టుకోలేక పోయారు. ఇకపోతే తెలంగాణలో కెసిఆర్‌ రాజకీయ వ్యూహాలను తక్కువగా అంచనా వేయలేం. ఎపిలో జగన్‌కన్నా కెసిఆర్‌ మంచి రాజకీయ వ్యూహకర్త. ఆయన ముందు ఎవ్వరైనా దిగదుడుపే. ఆయన పాచిక వేసారంటే తట్టుకోవడం కష్టమే. ఈటెలను బటయకు పంపినా దాని ప్రభావం పడకుండా జాగ్రత్త పడ్డారు. అందుకే ఎదుటి పక్షాలను దునుమాడే లక్ష్యంతో టిఆర్‌ఎస్‌ గతంలో ఎప్పుడూ లేనంతగా దృష్టి సారించింది. చివరి గెలుపు వరకు వ్యూహాత్మకంగా అడుగుల వేసేలా పార్టీ శ్రేణులను కెసిఆర్‌ దిశానిర్దేశం చేస్తున్నారు. ప్రాంతీయ పార్టీలతో కలిసి ఫెడరల్‌ ఫ్రంట్‌ ఏర్పాటు చేస్తానని గతంలోనే ప్రకటించిన కెసిఆర్‌ ఇప్పుడు తాజా రాజకీయల నేపథ్యంలో మరోమారు చురుకుగా వ్యవహరించడం ద్వారా జాతీయ రాజకీయాలపై ఫోకస్‌ పెడతారా లేదా అన్నది ఇప్పుడే చెప్పలేం. అవసరమైతే జాతీయ పార్టీ పెడతానని అప్పట్లోనే వెల్లడిరచారు.కేటీఆర్‌ను ముఖ్యమంత్రిని చేసి కేసీఆర్‌ జాతీయ రాజకీయాల్లోకి వెళతారనే ప్రచారమూ నేటికీ జరుగుతోంది. అయితే, కేంద్రంలో బీజేపీ నేతృత్వంలో పూర్తి మెజారిటీ ఉన్న ప్రభుత్వం కావడంతో కేసీఆర్‌ అడుగులు ముందుకు పడలేదు. ఇటీవలి ఎన్నికల ఫలితాలు కూడా కొంత వెనక్కి తగ్గేలా చేశాయి. మమతా బెనర్జీ మళ్లీ కాలుదువ్వుతున్నా అందుకు తగ్గ పరిస్థితులు లేవు. ఈ క్రమంలో తెలుగు రాష్టాల్ల్రో రాజకీయ సవిూకరణాలు
ఎలా ఉంటాయన్నది చూడాలి.