మూగజీవాల రోదన ఆగేనా

జనం సాక్షి ప్రత్యేక కథనం ….

గోవుల అక్ర‌మ ర‌వాణాకు అడ్డుక‌ట్ట ప‌డేనా.. ? నిబంధ‌న‌లు తుంగ‌లో తొక్కుతూ య‌థేచ్ఛ‌గా ప‌శువుల ర‌వాణా…..

పాల సిరులు పిండుకుని పశు పోషకులు
వదిలించుకుంటుంటే..వ్యాపారులు కబేళాలకు తరలించేస్తున్నారు…!
కోట్లు
కళ్లజూడటం కోసం…నిబంధనలను తుంగలో
తొక్కుతున్నారు..! భారీ సంఖ్యలో
మూగజీవాలను కొనేసి…కంటైనర్లలో
కుక్కేస్తున్నారు.! ఎన్ని పోలీస్ స్టేషన్లు, చెక్
పోస్టులున్నా…తాపీగా దాటేస్తున్నారు..!
విశాఖ ఏజెన్సీ అరకు లోయ లో సాగుతున్న పశువుల అక్రమరవాణాపై జనం సాక్షి ప్రత్యేక కథనం….

అరకులోయ ,ఫిబ్రవరి 16 (జనం సాక్షి): పశువుల అక్రమ రవాణాకు కేరాఫ్ అడ్రస్ గా అరకులోయ నియోజకవర్గం పరిధిలోని డుంబ్రిగూడ మండలం కొర్రాయి, కొర్రాయికొత్త వలస గ్రామం పరిసర ప్రాంతం నుండి పశువుల అక్రమ రవాణా అడ్డు అదుపు లేకుండా జరుగుతుంది. సరిహద్దు రాష్ట్రమైన ఒరిస్సాకు కొర్రాయి, కొర్రాయి కొత్త కొత్త వలస గ్రామం దగ్గర కావడంతో వివిధ ప్రాంతాల నుండి వ్యాపారం చేసే బడా వ్యాపారులు ఏజెన్సీ ప్రాంతంలో మకాం వేసి ఇక్కడ కొంతమందిని తమకు అనుకూలంగా మార్చుకుని పశువులను కొనుగోలు చేస్తూ అక్రమంగా కలేబరలకు తరలిస్తున్నారు. ప్రతివారం సుమారు రెండువేల వరకు కంటైనర్ లలో పశువులను ఎక్కించి యదేచ్ఛగా జిల్లా, అంతర్ రాష్ట్రాల తెలియవచ్చింది.కొర్రాయి కేంద్రంగా పశువుల అక్రమ రవాణా జరుగుతున్న విషయం జగమెరిగిన సత్యం. ప్రతిబుధ,గురు వారాలలో కంటైనర్ వాహనాల్లో పశువులను మూగజీవుల చట్టానికి విరుద్ధంగా ఇరికించి ఇక్కడ నుంచి పాడేరు,కాకినాడ, రాజమండ్రి, హైదరాబాద్ ,కేరళ ప్రాంతాలలో కలేబరలకు తరలిస్తున్నట్లు తెలుస్తోంది. ఒరిస్సా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుండి పశువులను వందల కిలోమీటర్లు నడిపిస్తున్న సమయంలో కర్రలతో కొట్టడం, సూదులతో గుచ్చి హింసిస్తునట్లు పలువురు చెబుతున్నారు.కొన్ని పశువుల కాళ్ళ నుంచి రక్తం సైతం కారుతుంది. ఈ హింస ఏ ఒక్క అధికారికి కనిపించకపోవడం గమనార్హం. ఇంత జరుగుతున్నా ఏ ఒక్క అధికారి వాటిపై చర్యలు తీసుకోవటం లేదని ఈ ప్రాంతవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గోసంరక్షణ చట్టాన్ని పరిరక్షించాల్సిన సంబంధిత అధికారులు గోవధను ప్రోత్సహిస్తున్నారని విమర్శలు కూడా ఈప్రాంతంలో వెల్లువెత్తుతున్నాయి. గత కొద్ది నెలల క్రితం ఇక్కడ నుంచి రాత్రి వేళల్లో పశువుల అక్రమ వ్యాపారులు అక్రమంగా పశువులను తరలిస్తుండగా పాడేరు ఘాట్ రోడ్ లో కంటైనర్ అదుపుతప్పి బోల్తా పడడంతో పశువులు మృత్యువాత పడిన విషయం తెలిసిందే. అయితే ఈ సంఘటన అధికారులకు తెలిసిన కూడా ఎటువంటి విచారణ చేపట్టకపోవడం వెనక అనేక అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి. సంబంధిత అధికారులు నెలవారి మామూలు ముందుగా మాట్లాడు కోవడం వలన బడా వ్యాపారులు ఎటువంటి భయం లేకుండా ఈ అక్రమ వ్యాపారాన్ని దర్జాగా కొనసాగిస్తున్నారని ఈ ప్రాంత వాసులు చెప్పుకుంటున్నారు.ఇప్పటికైనా సంబంధిత ఉన్నతాధికారులు పోలీస్ శాఖ అధికారులు పశువుల అక్రమ రవాణాపై ఏవిధంగా స్పందిస్తారో వేచి చూడాల్సిందే.