సమ్మక్క, సారలమ్మను కుటుంబ సమేతంగా దర్శించింన‌ మంత్రి గంగుల కమలాకర్

ములుగు : మేడారంలో వనదేవతలు సమ్మక్క, సారలమ్మను బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ శుక్రవారం కుటుంబ సమేతంగా దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు.

ఈ సందర్భంగా నిలువెత్తు బంగారాన్ని అమ్మలకు నైవేద్యంగా సమర్పించారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలు, సీఎం కేసీఆర్‌పై నిరంతరం అమ్మవార్ల దీవెనలు ఉండాలని, ఆయురారోగ్యాలతో చిరకాలం జీవించాలని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

అనంతరం తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అశేష భక్త జన సందోహం మధ్య అంగరంగ వైభవంగా ప్రభుత్వం వేడుకల్ని నిర్వహిస్తుందన్నారు.

తెలంగాణ కుంభమేళాకు వస్తున్న భక్తులకు సకల సౌకర్యాలు ప్రభుత్వం ఏర్పాటు చేసిందన్నారు. వీఐపీలతో సమానంగా సామాన్య భక్తులకు సైతం శీఘ్ర దర్శన ఏర్పాట్లు చేయడం అభినందనీయం అన్నారు.