హైదరాబాద్‌లో మైక్రోసాఫ్ట్‌ ఏర్పాటుకు కృషి

అలీబాబా క్లౌడ్‌ అధ్యక్షుడు సైమన్‌ హూతో చంద్రబాబు భేటీ

దావోస్‌,జనవరి25(జ‌నంసాక్షి): హైదరాబాద్‌ లో మైక్రోసాప్ట్‌ కంపెనీ నెలకొల్పేలా కృషిచేశానని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పేర్కొన్నారు. అలాగే అక్కడ సైబరాబాద్‌ను ఏర్పాటు చేసి ఐటి అభివృద్దికి కృషఙ చేశానని అన్నారు. దంతో అనేక కంపెనీలు పి/-పుడు అక్కడ కార్యకలపాలు నిర్వహిస్తున్నాయని అన్నారు. అలీబాబా క్లౌడ్‌ అధ్యక్షుడు సైమన్‌ హూతో చంద్రబాబు గురువారం భేటీ అయ్యారు. అనంతరం ఆయన విూడియాతో మాట్లాడుతూ… అలీబాబా గ్రూపుతో భేటీకావాలని ఎప్పటినుంచో ఆసక్తిగా ఉన్నానని, ఆ సంస్థ మాతో కలిసి పనిచేయాలని కోరుకుంటున్నామన్నారు. అలాగే భారతీయులు ఐటీలో ఎంతో బలమైన వారన్నారు. అంతేగాక భారతీయులు ఇంగ్లిష్‌, గణితంలో ప్రావీణ్యం కలిగి ఉంటారని చంద్రబాబు పేర్కొన్నారు. వాజ్‌పేయి హాయంలో టెలికాం రంగానికి అత్యంత ప్రాధాన్యత లభించిందని, ఆ పక్రియ ఐటీ రంగంలో మార్పును తీసుకొచ్చిందన్నారు. ఏపీ అభివృద్ధికి నూతన సాంకేతిక పద్ధతులు అవలంభిస్తున్నామని, మారుమూల ప్రాంతాలకూ ఇంటర్నెట్‌ అందించాలనేది మా లక్ష్యమని చంద్రబాబు పేర్కొన్నారు. ఎపిలో పరిశ్రమల స్థపానకు అనేక రాయితీలు ఇవ్వడంతో పాటు సింగిల్‌ విండో అనుమతులు ఇస్తున్నామని అన్నారు. మౌళిక వసతులకు పెద్దపీట వేశామని అన్నారు.