హైదరాబాద్‌ : ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు సీఎం కేసీఆర్ గుడ్ న్యూస్ అందించారు. బుధవారం శాసనసభలో ఉద్యోగ నియామకాలపై సీఎం కేసీఆర్ ప్రకటనతో తెలంగాణలో నిరుద్యోగుల సంబురాలు అంబరాన్నంటాయి. మొత్తం తెలంగాణలో 91,142 పోస్టులకు నోటిఫికేషన్లు విడుదల చేస్తున్నట్లు కేసీఆర్ ప్రకటించారు.

నేటి నుంచే నోటిఫికేషన్లు వెలువడుతాయని ప్రకటించడంతో విద్యార్థులు హర్షం వ్యక్తం చేస్తూ పటాకులు కాలుస్తూ, స్వీట్లుప పంచుతూ, సీఎం కేసీఆర్‌ చిత్రపటాలకు పాలాభిషేకాలు చేస్తూ సంబురాలు జరుపుకున్నారు. కేసీఆర్‌కు ప్రత్యేక కృత‌జ్ఞతలు తెలుపుతున్నారు.