1.హాని చేయాలని చుశారో జాగ్రత్త!
` చైనాకు రాజ్‌నాధ్‌ హెచ్చరిక
వాషింగ్టన్‌,ఏప్రిల్‌ 15(జనంసాక్షి): భారత్‌కు హానీ తలపెట్టాలని చూస్తే ఎవర్నీ వదిలిపెట్టబోమంటూ రక్షణమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ చైనాకు పరోక్షంగా గట్టి వార్నింగ్‌ ఇచ్చారు.అమెరికా పర్యటనలో ఉన్న ఆయన ప్రవాస భారతీయులతో మాట్లాడారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ నాయకత్వంలో భారత్‌ శక్తిమంతమైన దేశంగా ఎదిగిందన్నారు.భారత్‌, అమెరికా మధ్య 2G2 చర్చల కోసం రాజ్‌నాథ్‌ అమెరికా వెళ్లారు. ఈ సందర్భంగా శాన్‌ ఫ్రాన్సిస్కోలోని భారత కాన్సులేట్‌ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని ప్రవాసాంధ్రులతో ముచ్చటించారు. ఈ సందర్భంగా చైనా సరిహద్దుల్లో భారత సైనికుల శౌర్యపరాక్రమాలు, లద్దాఖ్‌ ఉద్రిక్తతల గురించి ప్రస్తావించారు. ‘’భారత సైనికులు ఏం చేశారో(గల్వాన్‌ ఘర్షణలను ఉద్దేశిస్తూ).. ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాలు తీసుకుందో నేను బహిరంగంగా చెప్పలేను. అయితే భారత్‌కు హాని కలిగిస్తే.. ఎవర్నీ విడిచిపెట్టబోమన్న స్పష్టమైన సందేశం మాత్రం వారికి(చైనాను ఉద్దేశిస్తూ) వెళ్లిందని కచ్చితంగా చెప్పగలను’’ అని రాజ్‌నాథ్‌ అన్నారు.ఈ సందర్భంగా ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం విషయంలో భారత్‌ అనుసరిస్తోన్న వైఖరి పట్ల అమెరికా చేస్తోన్న విమర్శలపై కూడా రాజ్‌నాథ్‌ పరోక్షంగా స్పందించారు. ‘’భారత్‌ ఒక దేశంతో సత్సంబంధాలు కలిగి ఉందంటే.. దాని అర్థం మరో దేశంతో మన సంబంధాలు క్షీణిస్తున్నాయని కాదు. ఇలాంటి దౌత్య విధానాన్ని భారత్‌ ఎప్పుడూ అవలంబించదు. రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు ‘విన్‌`విన్‌’ సూత్రాలపై అధారపడి ఉండాలని భారత్‌ విశ్వసిస్తుంది’’ అని రాజ్‌నాథ్‌ చెప్పుకొచ్చారు.

2.ఆలస్యంగానైనా..(కి
జిల్లాకో వైద్యకళాశాల
` డాక్టర్ల సంఖ్యను గణనీయంగా పెంచుతాం:మోదీ
` గుజరాత్‌లో సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రి ప్రారంభించిన ప్రధాని
న్యూఢల్లీి,ఏప్రిల్‌ 15(జనంసాక్షి): దేశంలో వైద్యరంగాన్ని బలోపేతం చేస్తున్నామని, ఆసుపత్రుల నిర్మాణంతో పాటు,ఐవద్యుల నియామకం సాగుతోందని ప్రధాని మోడీ అన్నారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రతి జిల్లాకు ఒక వైద్య కళాశాల పథకం వల్ల రానున్న పదేళ్లలో రికార్డు స్థాయిలో నూతన వైద్యులు రాబోతున్నారని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. అందరికీ వైద్య విద్య అందుబాటులో ఉండేలా ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. గుజరాత్‌లోని భుజ్‌ జిల్లాలో కేకే పటేల్‌ సూపర్‌ స్పెషాలిటీ హాస్పిటల్‌ను ఆయన శుక్రవారం వీడియో కాన్ఫరెన్సింగ్‌ ద్వారా ప్రారంభించారు. ఈ ఆసుపత్రి ప్రారంభం సందర్భంగా ఏర్పాటైన సభను ఉద్దేశించి మోదీ మాట్లాడుతూ, దేశంలోని ప్రతి జిల్లాలోనూ ఓ వైద్య కళాశాలను నిర్మించాలనే లక్ష్యంతో ప్రభుత్వం పని చేస్తోందన్నారు. వైద్య విద్యను అందరికీ అందుబాటులోకి తీసుకొచ్చేందుకు కృషి జరుగుతోందన్నారు. వీటి వల్ల రానున్న పదేళ్ళలో మన దేశంలో కొత్తగా రికార్డు సంఖ్యలో డాక్టర్లు రాబోతున్నారని చెప్పారు. భుజ్‌ జిల్లాలో ప్రారంభమైన ఈ ఆసుపత్రి ప్రజలకు నాణ్యమైన ఆరోగ్య సంరక్షణ సేవలను అందుబాటు ధరలకు అందజేస్తుందన్నారు. రెండు దశాబ్దాల క్రితం గుజరాత్‌లో కేవలం తొమ్మిది వైద్య కళాశాలలు, 1,100 సీట్లు మాత్రమే ఉండేవన్నారు. నేడు 36 వైద్య కళాశాలలు, 6,000 సీట్లు ఉన్నాయన్నారు. 2001లో సంభవించిన భూకంపం వల్ల జరిగిన నష్టాన్ని గుర్తు చేసుకుంటూ, భుజ్‌, కచ్‌ ప్రాంతాల ప్రజలు తమ కఠోర శ్రమతో ఈ ప్రాంతానికి నూతన విధిని లిఖిస్తున్నారని చెప్పారు. నేడు ఈ ప్రాంతంలో చాలా ఆధునిక వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. భుజ్‌లో నేడు అత్యాధునిక, సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రి అందుబాటులోకి వచ్చిందన్నారు. మెరుగైన ఆరోగ్య సదుపాయాలంటే కేవలం వ్యాధులకు చికిత్స మాత్రమే కాదని, సామాజిక న్యాయం కూడా జరగాలని అన్నారు. ఓ నిరుపేద వ్యక్తికి చౌకగా, ఉత్తమ చికిత్స అందితే, ఈ వ్యవస్థపై ఆయన నమ్మకం బలపడుతుందన్నారు. శ్రీ కచ్చి లేవ పటేల్‌ సమాజ్‌ ఆధ్వర్యంలో కేకే పటేల్‌ సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రిని నిర్మించారు. కచ్‌లో మొదటి చారిటబుల్‌ సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రి ఇదే. దీనిలో 200 పడకలు ఉన్నాయి. దీనిలో ఇంటర్వెన్షనల్‌ కార్డియాలజీ (క్యాత్‌ల్యాబ్‌), కార్డియోథొరాసిక్‌ సర్జరీ, రేడియేషన్‌ ఆంకాలజీ, మెడికల్‌ ఆంకాలజీ, సర్జికల్‌ ఆంకాలజీ, నెఫ్రాలజీ, యూరాలజీ, న్యూక్లియర్‌ మెడిసిన్‌, న్యూరో సర్జరీ, కీళ్ళ మార్పిడి, ఇతర సేవలు అందుబాటులో ఉంటాయి.

 

3.వైద్యపరికాలు,పరిశోధనలకు కేరాఫ్‌ హైదరాబాద్‌
` ప్రపంచటీకాకు హెడ్‌క్వార్టర్‌ మన నగరమే.
` మెడికల్‌ డివైస్‌ పార్కులో ఎస్‌ఎంటీ సంస్థ ప్రారంభించిన మంత్రి కెటిఆర్‌
సంగారెడ్డి,ఏప్రిల్‌ 15(జనంసాక్షి):తెలంగాణ వ్యాక్సిన్‌ క్యాపిటల్‌ ఆఫ్‌ వరల్డ్‌గా మారిందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్‌ పేర్కొన్నారు. వైద్యోపకరణాల తయారీ, పరిశోధనల కోసం హైదరాబాద్‌కు ప్రాధాన్యం పెరిగిందన్నారు. సంగారెడ్డి జిల్లాలోని సుల్తాన్‌పూర్‌లోని మెడికల్‌ డివైస్‌ పార్కులో సహజానంద్‌ మెడికల్‌ టెక్నాలజీ(ఎస్‌ఎంటీ) సంస్థను ప్రారంభించారు. ప్రాజెక్టు సంజీవని పేరుతో స్టెంట్ల తయారీ యూనిట్‌ను ఎస్‌ఎంటీ సంస్థ ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్‌ మాట్లాడుతూ.. కరోనాతో ప్రపంచం వెనుకబడినా ఎస్‌ఎంటీ వేగం తగ్గలేదు. ఆసియాలోనే అతిపెద్ద స్టెంట్ల తయారీ, పరిశోధన సంస్థ ఎస్‌ఎంటీ అని కొనియాడారు. దేశంలో మెడికల్‌ డివైసెస్‌ తయారీతో ఔషధాలు, వైద్యోపకరణాల ధరలు తగ్గాయి. బయో ఆసియా సదస్సులో వైద్యోపకరణాల తయారీ సంస్థలను కలిశానని గుర్తు చేశారు. దేశంలో 80 శాతం వైద్యోపకరణాలు విదేశాల నుంచి తెస్తున్నామని కేటీఆర్‌ తెలిపారు.అవిూన్‌పూర్‌ మండలంలోని సుల్తాన్‌పూర్‌, దాయర గ్రామాల మధ్య ఏర్పాటు చేసిన మెడికల్‌ డివైజెస్‌ పార్కులో రూ.250 కోట్లతో సహజానంద్‌ మెడికల్‌ టెక్నాలజీ ప్రైవేట్‌ లిమిటెడ్‌ (ఎస్‌ఎంటీ) పరిశ్రమ స్టెంట్ల ఉత్పత్తిని చేపట్టింది. ఈ పరిశ్రమ ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా రెండు వేల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. ఏటా 1.2 మిలియన్ల కార్డియాక్‌ స్టెంట్లు, 2 మిలియన్ల కార్డియాక్‌ బెలూన్లు ఉత్పత్తి చేయనున్నారు. వృద్ధుల కోసం టీఏవీఐ, పిల్లలు, గుండె రంధ్రం ఉన్న వారి కోసం ఆక్టూడర్‌ వంటి ఆధునిక సాంకేతికతను ఉపయోగించి స్టెంట్లు తయారు చేస్తారు. గుండె సంబంధిత బాధితులకు వేసే స్టెంట్లు ఇప్పటివరకు విదేశాల నుంచి దిగుమతి అవుతున్నాయి. దీంతో రోగులపై ఆర్థికంగా భారం పడుతున్నది. ఇప్పుడు ఈ సంస్థ ఇక్కడ ఉత్పత్తి ప్రారంభించనుండటంతో తక్కువ ధరకు స్టెంట్లు లభిస్తాయి.

 

4.పెండిరగ్‌ కేసులు పరిష్కారం అవ్వాలంటే కొత్తజడ్జీల నియామకం అవసరం
` తెలంగాణ న్యాయధికారుల సదస్సులో చీఫ్‌ జస్టిస్‌ రమణ
` అందుకు తనవంతుగా కృషి చేస్తున్నా
` తెలంగాణలో జడ్జిల సంఖ్యనుపెంచాం
` తెలంగాణలో కేసీఆర్‌ 4వేల320కి పైగా ఉద్యోగాల కల్పన
` చేతికి ఎముక లేదన్న ట్రేడ్‌ మార్క్‌ సీఎం కెసిఆర్‌దే
` కొత్త జిల్లాల్లోనూ కోర్టు భవనాలు నిర్మిస్తాం:సీఎం కేసీఆర్‌
` భారత న్యాయవ్యవస్థ మరింత బలోపేతం
` అందరి సహకరాంతో పురోగమిస్తున్నామన్న ముఖ్యమంత్రి
హైదరాబాద్‌,ఏప్రిల్‌ 15(జనంసాక్షి):భారత న్యాయవ్యవస్థను మరింత బలపరచాలని భావిస్తున్నట్లు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ తెలిపారు. హైదరాబాద్‌లో జరుగుతున్న తెలంగాణ న్యాయధికారుల సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తెలంగాణ హైకోర్టులో రెండేళ్లుగా పెండిరగ్‌లో ఉన్న జడ్జిల పెంపు అంశాన్ని పరిష్కరించామని చెప్పారు. జిల్లా కోర్టుల్లోనూ జడ్జిల సంఖ్య పెంచుతున్నామన్నారు. దేశవ్యాప్తంగా ప్రభుత్వ ఉద్యోగుల సంఖ్య తగ్గించాలని భావిస్తుంటారని…. తెలంగాణలో కేసీఆర్‌ మాత్రం 4 వేల 320కి పైగా ఉద్యోగాలను సృష్టించారని అభినందించారు. చేతికి ఎముక లేని తనానికి ట్రేడ్‌ మార్క్‌గా కేసీఆర్‌ అని జస్టిస్‌ ఎన్వీ రమణ వ్యాఖ్యానించారు. హైదరాబాద్‌ గచ్చిబౌలిలోని అన్వయ కన్వెన్షన్‌లో జరిగిన న్యాయాధికారుల సదస్సుకు సీజేఐ ఎన్వీ రమణ, హైకోర్టు సీజే జస్టిస్‌ సతీష్‌ చంద్ర శర్మ, ఏపీ హైకోర్టు సీజే జస్టిస్‌ ప్రశాంత్‌ కుమార్‌ మిశ్ర, సీఎం కేసీఆర్‌, మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి హాజరయ్యారు. న్యాయవ్యవస్థ బలోపేతానికి కేసీఆర్‌ కృషిచేస్తున్నారని తెలిపారు. హైకోర్టులో ఇటీవల జడ్జిల సంఖ్య పెంచాం. కేసుల త్వరితగతిన పరిష్కారానికి జడ్జిల సంఖ్య పెంపు అవసరం అన్నారు. రెండేళ్లుగా పెండిరగ్‌లో ఉన్న జడ్జిల సంఖ్య పెంపు అంశాన్ని పరిష్కరించాం. న్యాయవ్యవస్థను ఇంకా బలపరచాలని భావిస్తున్నాం జిల్లా కోర్టుల్లోనూ జడ్జిల సంఖ్య పెంచుతున్నాం. దేశవ్యాప్తంగా ప్రభుత్వ ఉద్యోగుల సంఖ్య తగ్గించాలని భావిస్తుంటారు.ఇటీవల హైదరాబాద్‌లో అంతర్జాతీయ ఆర్బిట్రేషన్‌ విూడియేషన్‌ సెంటర్‌ వచ్చింది. వివాదాల సత్వర పరిష్కారానికి ఈ కేంద్రం ఉపయోగపడుతోంది. తమ రాష్టాల్లోన్రూ ఇలాంటి కేంద్రం ఏర్పాటు చేయాలని కోరుతున్నారని జస్టిస్‌ ఎన్వీ రమణ అన్నారు. న్యాయవ్యవస్థ బలోపేతానికి కేసీఆర్‌ కృషిచేస్తున్నారని చెప్పారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత న్యాయాధికారుల సమావేశం జరగడం ఇదే తొలిసారని వెల్లడిరచారు. న్యాయవ్యవస్థను బలపరిచేందుకు ఈ సమావేశం ఉపయోగపడు తుందన్నారు. ఇటీవల హైదరాబాద్‌లో అంతర్జాతీయ ఆర్బిట్రేషన్‌ విూడియేషన్‌ సెంటర్‌ వచ్చిందని చెప్పారు. వివాదాల సత్వర పరిష్కారానికి ఈ కేంద్రం ఉపయోగపడుతుందన్నారు. తమ రాష్టాల్ల్రోనూ ఇలాంటి కేంద్రం ఏర్పాటు చేయాలని కోరుతున్నారని వెల్లడిరచారు. ఎనిమిదేండ్ల క్రితం అవతరించిన తెలంగాణ రాష్ట్రం అందరి సహకారంతో పురోగమిస్తున్నదని సీఎం కేసీఆర్‌ అన్నారు. చక్కటి ఆర్థిక క్రమశిక్షణతో అన్నిరంగాల్లో దూసుకుపోతున్నామని చెప్పారు. విద్యుత్‌ రంగంలో అద్భుతమైన పురోగతి సాధిస్తున్నామని, వ్యవసాయ, పారిశ్రామిక రంగంలో ముందుకెళ్తున్నామన్నారు. పరిపాలన సంస్కరణలు తీసుకొచ్చి 33 జిల్లాలు ఏర్పాటు చేశామన్నారు. ఆర్‌బీఐ లెక్కల ప్రకారం తెలంగాణ తలసరి ఆదాయం రూ.2.78 లక్షలు అని చెప్పారు. తెలంగాణ రాష్ట్ర న్యాయ పరిపాలన విభాగం ఇంకా ముందుకెళ్లాలని, దేశానికి ఆదర్శంగా నిలవాలని ఆకాంక్షించారు.హైదరాబాద్‌ పట్ల జస్టిస్‌ ఎన్వీ రమణకు చాలా ప్రేమ ఉన్నదని చెప్పారు. సుదీర్ఘకాలం హైదరాబాద్‌లో
పనిచేసినందున ఆయనకు అన్ని విషయాలు తెలుసున్నారు. హైకోర్టు విడిపోయిన తర్వాత బెంచీల సంఖ్య పెంచాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరినప్పటికీ పెండిరగ్‌లో పెట్టారని చెప్పారు. అయితే సీజేఐ రమణ చొరవతో హైకోర్టు బెంచీలను 24 నుంచి 42కు పెంచారన్నారు. న్యాయ వ్యవస్థలో గతంలో 780 పోస్టులు మంజూరు చేశామని సీఎం కేసీఆర్‌ వెల్లడిరచారు. మరో 885 అదనపు పోస్టులు హైకోర్టుకు మంజూరు చేశామన్నారు. జిల్లా కోర్టులకు అదనంగా 1730 పోస్టులు మంజూరు చేశామన్నారు. జిల్లా కోర్టులలో పనిభారం ఉందని తెలిసిందన్నారు. 23 జిల్లాల్లో జిల్లా కోర్టు భవనాలు చేపడతామని వెల్లడిరచారు. రాష్ట్రంలో ఇప్పటివరకు కోటి 52 లక్షల ఎకరాల భూములను డిజిటలైజ్‌ చేశామన్నారు. రెవెన్యూ కోర్టులను ప్రభుత్వం రద్దు చేసిందని తెలిపారు. న్యాయమూర్తులు హోదాకు తగ్గట్లుగా 30 ఎకరాల్లో క్వార్టర్స్‌ నిర్మిస్తామని, సీజేఐ రమణతో శంకుస్థాపన చేయిస్తామన్నారు.

 

5.కేంద్ర అభివృద్ధిని రాష్ట్రంలో అడ్డుకుంటున్నారట!
` ప్రజాసంగ్రామ యాత్రలో బండి సంజయ్‌
గద్వాల,ఏప్రిల్‌ 15(జనంసాక్షి): సీఎం కేసీఆర్‌ను గద్దె దించే సమయం వచ్చిందని బీజేపీ నేత బండి సంజయ్‌ చెప్పారు. ప్రజాసంగ్రామ యాత్ర రెండో దశను జోగుళాంబ ఆలయం నుంచి ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో సంజయ్‌ మాట్లాడుతూ కేసీఆర్‌ డబ్బులిచ్చి ఇతర రాష్టాల్రకు తిరుగుతున్నారని విమర్శించారు. ఉద్యోగాలకు ఎదురుచూసి నిరుద్యోగుల ఆత్మహత్యలు చేసుకున్నారని తెలిపారు. కేసీఆర్‌ నిరుద్యోగులను ఆదుకోవాలన్నారు. ఢల్లీిలో కేసీఆర్‌ దొంగ దీక్ష చేశారని తప్పుబట్టారు. తెలంగాణ సాధించుకున్నది కేసీఆర్‌ కుటుంబం రాజ్యం ఏలడానికా? అని ప్రశ్నించారు. కేసీఆర్‌ కుటుంబాన్ని ప్రశ్నిస్తే.. జైలుకు పంపుతున్నారని బండి సంజయ్‌ దుయ్యబట్టారు. రాష్ట్రంలో పేదోడు పేదవాడిగానే ఉండేలా.. ఉన్నోడు కోట్లు సంపాదించేలా సీఎం కేసీఆర్‌ పాలన ఉందని బండి సంజయ్‌ అన్నారు. అలంపూరు మండలం లింగనవాయి గ్రామంలోని గ్రామస్థులతో బండి సంజయ్‌ మాటామంతి నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… సీఎం కేసీఆర్‌ అబద్దాలాడి గద్దెనెక్కారన్నారు. తెలంగాణలో కరెంట్‌, ఆర్టీసీ ఛార్జీలు పెంచుతూ పేదల నడ్డివిరిచే విధంగా కేసీఆర్‌ వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. అమరుల త్యాగాల వల్ల తెలంగాణ సాధించుకుంటే కేసీఆర్‌ కుటుంబం అడ్డగోలుగా దోచుకుతింటోందని ఆరోపించారు. తెలంగాణలో పేదోళ్ల ప్రభుత్వం రావాలని బండి సంజయ్‌ ఆకాంక్షించారు.

 

 

6.అమ్మవారి సాక్షిగా అబద్ధాలా!
` జోగుళాంబ కన్నెర్రజేస్తుంది..జాగ్రత్త!
` బండి పాదయత్రపై మండిపడ్డ నిరంజన్‌ రెడ్డి
వనపర్తి,ఏప్రిల్‌ 15(జనంసాక్షి): బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి అమ్మవారి సాక్షిగా అబద్ధాలు చెప్పడం మానుకోవాలని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌ రెడ్డి సూచించారు. బండి సంజయ్‌ పాదయాత్రపై మంత్రి స్పందించారు. పాద యాత్రల పేరుతో తెలంగాణ ప్రజలను మోసం చేయొద్దన్నారు. 2014 పాలమూరు ఎన్నికల ప్రచార సభలో పాలమూరు` రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని చేపట్టాలని నరేంద్రమోదీ స్వయంగా చెప్పింది నిజం కాదా ? దానిని తెలంగాణ ప్రభుత్వం సొంతంగా చేపట్టింది నిజం కాదా ? అని ప్రశ్నించారు.పాలమూరు, రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి కేంద్రం పావలా ఇయ్యనిది నిజం కాదా ? కనీసం ఈ ఎత్తిపోతలకు జాతీయ హోదా ఇవ్వాలని ఎన్నడైనా తెలంగాణ బీజేపీ నేతలు నోరు తెరిచి అడిగిన పాపాన పోయారా ? అని వారిని సూటిగా ప్రశ్నించారు. ఇదే విూకు ఉమ్మడి పాలమూరు జిల్లా విూద ఉన్న ప్రేమనా ? నడిగడ్డకు, ఉమ్మడి పాలమూరుకు నష్టం కలిగించే కర్ణాటకలోని అప్పర్‌ భద్ర ప్రాజెక్టుకు జాతీయహోదా ఇచ్చిన కేంద్రం తెలంగాణలోని పాలమూరు, రంగారెడ్డి ఎత్తిపోతలకు జాతీయహోదా ఎందుకు ఇవ్వదు ? బండి సంజయ్‌ కిషన్‌ రెడ్డిలు ఎందుకు నోరు తెరిచి అడగరని సూటిగా ప్రశ్నించారు.ఏడేళ్లుగా కృష్ణా నదిలో నీటి వాటాలు తేల్చకపోవడమే విూ గొప్పతనమా ? కృష్ణా నది వాటర్‌ మేనేజ్‌ మెంట్‌ బోర్డు పేరుతో కుట్రలు చేస్తున్నది నిజం కాదా ? తెలంగాణ నీటి వనరులను గుప్పిట పట్టాలని భావిస్తున్నది నిజం కాదా ? తెలంగాణలో యాసంగిలో పండే బాయిల్డ్‌, రా రైస్‌ ప్రతి గింజా కొనిపించే బాధ్యత నాది అని కిషన్‌ రెడ్డి చెప్పింది నిజం కాదా అని అన్నారు. వడ్ల కొనుగోళ్లతో తెలంగాణ ప్రభుత్వానికి ఏం సంబంధం ? కేంద్రాన్ని ఒప్పించే బాధ్యత నాది.. కొనిపించే బాధ్యత నాది. రైతులు వరి సాగు చేయాలని బండి సంజయ్‌ చెప్పింది నిజం కాదా ? ఆ తర్వాత రా రైస్‌ .. బాయిల్డ్‌ రైస్‌ పేరుతో రాజకీయం చేసింది నిజం కాదా ? ఇప్పుడు ధాన్యం కొనుగోలు మా ఘనత అని చెప్పుకోవడానికి విూకు సిగ్గు అనిపించడం లేదా ?అని ఘాటుగా విమర్శించారు. దక్షిణ భారతదేశంలో 5వ శక్తిపీఠంగా ఉన్న అలంపూరు జోగులాంబ అమ్మవారి ఆలయ పరిసరాలు పురావస్తు శాఖ పరిధిలో ఉన్నందున తెలంగాణ ప్రభుత్వం ఏ అభివృద్ధి పనిని చేపట్టలేకపోతున్నది. కేంద్రమంత్రిగా ఉన్న కిషన్‌ రెడ్డి జోగులాంబ అమ్మవారి ఆలయ అభివృద్ధికి కేంద్రం నుంచి అనుమతులు తీసుకువచ్చి సీఎం కేసీఆర్‌ యాదగిరిగుట్టను రూ.1200 కోట్లతో పునర్నిర్మించినట్లుగా కనీసం రూ.500 కోట్లు కేంద్రం ద్వారా తీసుకువచ్చి జోగులాంబ ఆలయాన్ని అభివృద్ధి చేయిస్తాం అని వాగ్ధానం చేసే దమ్ముందా ?అని ప్రశ్నించారు. దశాబ్దాలుగా పాలమూరు, కందనూలు, గద్వాల ప్రాంత ప్రజల కల గద్వాల ? మాచర్ల రైల్వే లైన్‌ ను దేశంలో అన్నిచోట్లా కేంద్రం నిర్మిస్తున్నట్లు .. ఇక్కడ కూడా నిర్మించేలా కేంద్రం నుంచి నిధులు కేటాయించి పనులు ప్రారంభిస్తాం అని చెప్పే ధైర్యం ఉందా ? ముందు ఈ ప్రశ్నలకు సమాధానాలు చెప్పి పాదయాత్ర చేయాలన్నారు. ప్రజలను మభ్యపెట్టి, అబద్ధాలతో కాలం వెళ్లదీసే తప్పుడు పనులు మానుకోవాలని మంత్రి నిరంజన్‌ రెడ్డి హితవు పలికారు.

 

7.ఇదేమీ విచిత్రం..)కి
ఆ బడిలో చదివిన వందమందికి క్యాన్సర్‌..
` మిస్టరీగా మారిన న్యూజెర్సీ ఉన్నత పాఠశాల
న్యూజెర్సీ,ఏప్రిల్‌ 15(జనంసాక్షి):అదో ఉన్నత పాఠశాల. అక్కడ చదువుకున్న విద్యార్థులు, పనిచేసిన సిబ్బంది ప్రస్తుతం వేర్వేరు చోట్ల స్థిరపడ్డారు.కానీ, కాలం గడిచేకొద్దీ అనుహ్యంగా ఆ పాఠశాలలో చదువుకున్న విద్యార్థులు క్రమంగా క్యాన్సర్‌ బారినపడుతున్నట్లు తేలింది. ఇలా ఆ పాఠశాలకు చెందిన 100 మంది పూర్వ విద్యార్థులు, ఉపాధ్యాయుల్లో ఈ అరుదైన క్యాన్సర్‌ గుర్తించడం సంచలనం రేపుతోంది. తనకు క్యాన్సర్‌ ఏవిధంగా సోకిందోనని ఓ పూర్వవిద్యార్థి చేసిన అన్వేషణలో ఈ విషయం బయటపడిరది. అమెరికాలోని న్యూజెర్సీలో చోటుచేసుకున్న ఈ మిస్టరీ ఉదంతంపై అధికారులు దర్యాప్తు మొదలుపెట్టారు.న్యూజెర్సీ వూడ్‌బ్రిడ్జ్‌లోని కలోనియా హైస్కూల్‌లో చదువుకున్న ఆల్‌ లుపియానోకు 20 ఏళ్ల క్రిందటే మెదడులో అరుదైన క్యాన్సర్‌ కణతిని గుర్తించారు. లుపియానోతో పాటు ఆయన సోదరి, భార్యలోనూ అటువంటి (ఉశ్రీతినీపశ్రీజీబబినీఎజీ) ట్యూమర్‌ వెలుగు చూసింది. ఈ వ్యాధి నుంచి లుపియానో కోలుకున్నప్పటికీ.. దురదృష్టవశాత్తూ ఆయన సోదరి, భార్య ఇటీవలే కన్నుమూశారు. ఇలా ఒకే కుటుంబంలోని వారికి ఒకేవిధమైన క్యాన్సర్‌ సోకడం పట్ల అనుమానం వ్యక్తం చేసిన లుపియానో.. కారణాలను అన్వేషించే పనిలో పడ్డారు.క్యాన్సర్‌ కారణాలను వెతకడం మొదలుపెట్టిన లుపియానో తాను చదువుకున్న కలోనియా హైస్కూల్‌ పూర్వ విద్యార్థుల ఆరోగ్యంపై ఆరా తీశారు. 1975 నుంచి 2000 సంవత్సరం మధ్య కాలంలో అదే పాఠశాలలో చదువుకున్న 102 మంది ఇదేరకమైన బ్రెయిన్‌ క్యాన్సర్‌ బారినపడినట్లు గుర్తించారు. దీంతో ఈ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఇది కాస్త దేశవ్యాప్తంగా సంచలనంగా మారడంతో అధికారులు రంగంలోకి దిగారు. ఈ అసాధారణ ఉదంతానికి గల కారణాలను అన్వేషించడంలో భాగంగా పాఠశాల గదుల్లోని రేడియోధార్మికతపై అనుమానాలు వ్యక్తం చేశారు. దీంతో అక్కడ గదుల్లోని ర్యాండన్‌ మూలకంతోపాటు ఇతర నమూనాలను సేకరించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు.ఒకే పాఠశాలకు చెందిన వంద మంది క్యాన్సర్‌ బారినపడిన విషయం బయటపడడంతో ఆ పాఠశాల ఉన్న స్థానికుల్లో ఆందోళన మొదలయ్యింది. ఈ విషయంపై స్పందించిన వూడ్‌బ్రిడ్జ్‌ మేయర్‌ జాన్‌ మెక్‌కార్మాక్‌.. ‘దీనిపై స్థానికులందరిలో ఆందోళన నెలకొంది. ఇది కచ్చితంగా అసాధారణమైన విషయమే. ఇందుకుగల కారణాలను తెలుసుకోవాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారు’ అని అన్నారు. మరోవైపు ఒకే పాఠశాలకు చెందిన ఇంతమంది బాధితులుగా మారడానికి సమాధానాలు లభించే వరకూ విశ్రాంతి తీసుకోనని 50ఏళ్ల లుపియానో స్పష్టం చేస్తున్నారు.ఇదిలాఉంటే, గ్లియోబ్లాస్టోమా అనేది చాలా అరుదైన క్యాన్సర్‌. ప్రతి లక్ష జనాభాలో కేవలం 3.2 మందిలోనే ఇది బయటపడే అవకాశం ఉంటుందని అమెరికన్‌ అసోసియేషన్‌ సర్జన్స్‌ గణాంకాలు చెబుతున్నాయి. కలోనియా హైస్కూల్‌కు చెందిన పూర్వ విద్యార్థుల్లో వెలుగు చూసిన క్యాన్సర్‌ ఈ రకానికి సంబంధించినదే.

 

 

10.కీవ్‌పై క్షిపణుల వర్షం తప్పదు..
` ఉక్రెయిన్‌కు రష్యా హెచ్చరిక
మాస్కో,ఏప్రిల్‌ 15(జనంసాక్షి):ఉక్రెయిన్‌పై రష్యా దండయాత్ర నానాటికీ మరింత తీవ్రరూపం దాల్చుతోంది. ఉక్రెయిన్‌ సైన్యం తమపై దాడులకు పాల్పడుతోందని రష్యా ఆరోపిస్తోంది.దీనికి ప్రతీకారం తీర్చుకోక తప్పదని బెదిరిస్తోంది. తమ భూభాగంపై విధ్వంసాలకు దిగితే.. కీవ్‌పై క్షిపణుల వర్షం తప్పదని రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ హెచ్చరించింది.’’రష్యా భూభాగంపై ఏదైనా ఉగ్రదాడులు లేదా విధ్వంసానికి పాల్పడాలని చూస్తే కీవ్‌పై క్షిపణి దాడులు మరింత పెరుగుతాయి’’ అని రష్యా రక్షణశాఖ ఓ ప్రకటన విడుదల చేసింది. రష్యా సరిహద్దు నగరాలను లక్ష్యంగా చేసుకుని ఉక్రెయిన్‌ క్షిపణి దాడులు చేస్తోందని క్రెమ్లిన్‌ ఆరోపిస్తోంది. ఈ నేపథ్యంలోనే తాజా హెచ్చరికలు చేసింది.మరోవైపు కీవ్‌ శివారుల్లో ఉన్న ఓ మిలిటరీ ఫ్యాక్టరీపై రష్యా క్షిపణి ప్రయోగించింది. ఈ ఘటనలో భారీగానే ఆయుధ నష్టం సంభవించినట్లు తెలుస్తోంది. ఇక, ఖార్ఖివ్‌కు సవిూపంలో ఉన్న ఓ గ్రామంపై రష్యా వ్యూహాత్మక రాకెట్‌ బలగాలు విరుచుకుపడ్డాయి. ఉక్రెయిన్‌ కోసం పోరాడుతోన్న 30 మంది పోలాండ్‌ సైనికులను హత్య చేసినట్లు రష్యా మిలిటరీ తెలిపింది.