పర్యావరణ విధ్వంసంతోనే వరదపోటు

share on facebook

గతేడాదితో పోలిస్తే ఈ యేడు వర్షాలు అధికంగానే కురిసాయి. అత్యధిక వర్షపాతం నమోదయినా ఎక్కడా వాననీటి నిల్వలజాడ కానరావడం లేదు. జలశక్తి అభియాన్‌ పేరుతో అధికారులు పర్యటనలు చేస్తున్నా ఎక్కడా వాటి ఫలితాలు కానరావడం లేదు. నీటి సంరక్షణపై పాలకుల్లో చిత్తశుద్ది లోపించడంతో పాటు, అమలు చేయాలన్న లక్ష్యం కానరావడం లేదు. దీనికితోడు ఇటీవల వరదలు దేశవ్యాప్తగా అతలాకుతలం చేశాయి. అయినా వరదల్లో ప్రజల కష్టాలు వర్ణనాతీతంగా ఉన్నా పట్టించుకోలేదు. ఎపి, తెలంగాణలో పలుప్రాంతాలతో పాటు ఉత్తరాదిలో వరదలు ముంచెత్తాయి. బీహార్‌ రాజధాని పాట్నా కూడా వరదనీటిలో మునిగిపోయింది. వరదలు వస్తే తోణ చర్యలు తీసుకునే అవకావం లేకుండా పోయింది. నగరాలతో పాటు, సవిూప ప్రాంతాల్లో ఉన్నచెరువులను కుంటలను ఆక్రమించుకున్న కారణంగా కుండపోత వర్షంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ప్రధానంగా రెండు రోజులుగా సాయంత్రం కురుస్తున్న వర్షాలతో హైదరాబాద్‌ నగరవాసులు వణికిపోతున్నారు.  క్యూములోనింబస్‌ మేఘాలతో పలు ప్రాంతాల్లో కుండపోత వాన కురిసిందని వాతావరణ శౄఖ అధికారులు చెబుతున్నారు. కేవలం గంట పాటు కురిసిన భారీవర్షానికే రహదారులు చెరువులను తలపిస్తున్నాయి. రోడ్లపై భారీగా వరదనీరు నిలిచిపోవడంతో వాహనదారులు తీవ్ర అవస్థలు పడడం ఇప్పుడు పట్టణవాసులకు షరా మామూలయ్యింది. క్యుములోనింబస్‌ మేఘాలకు తోడు ఉపరిత ఆవర్తనం కారణంగా దేశవ్యాప్తంగా జోరు వానలు పడుతున్నాయి. ప్రకృతి విద్వంసం వల్ల వాతావరణ విపరీత ధోరణులు కానవస్తున్నాయి. వరదలు పంటలను, ప్రజలను నష్టాలపాల్జేశాయి. ఖరీఫ్‌ సీజనులో వ్యవసాయం సాగేందుకు వీలుగా సమతుల్య వానలు పడాల్సి ఉండగా దేశంలో ఒక ప్రాంతంలో కరువు, మరో ప్రాంతంలో సాధారణ స్థాయి కంటే కొన్ని రెట్ల అధిక వర్షాలు పడటం పర్యావరణ సమస్య తీవ్రతకు సంకేతం. ఆంధప్రదేశ్‌ లోనే చూసుకుంటే రాయలసీమ, నెల్లూరు తీవ్ర వర్షాభావం ఎదుర్కొం టున్నాయి. మహారాష్ట్ర లోనూ అంతే విదర్భ ఇత్యాది ప్రాంతాల్లో అనావృష్టి తిష్ట వేయగా కోల్హాపూర్‌, సాంగ్లీ జిల్లాల్లో నదులు పొంగి పొర్లుతూ నష్టాలు కలిగిస్తున్నాయి. భారీ వర్షాలు, వరదల వలన కలిగే నష్టాలు విషాదకరం. నదీ ప్రవాహాలను సమర్ధవంతంగా నియంత్రించి నీటిని ఒడిసిపట్టే బదులు పర్యావరణ నిబంధనలను ప్రభుత్వమే ఉల్లంఘించి వరదనీటి ప్రవాహాలు అదుపు తప్పేందుకు కారణభూతమవుతోంది. దీర్ఘకాలంలో పర్యావరణానికి చేటు కలిగిస్తున్న మానవ తప్పిదాలు ఊహించని ఉత్పాతాలకు కారణం కావడం మిక్కిలి ఆందోళనకరం. ర్యావరణ, సంస్కృతి, జీవ వైవిధ్యాల పరంగా ప్రాశస్త్యం కలిగిన పశ్చిమ కనుమలు రాను రాను ప్రమాద భరితంగా తయారవడానికి దోపిడీతో కూడిన మానవ తప్పిదాలే కారణమని పర్యావరణవేత్తలు నెత్తీనోరూ మొత్తుకుంటున్నారు. మితివిూరిన గనుల, క్వారీల తవ్వకాలు, అడవుల విధ్వంసం, పట్టణీకరణ, అటవీ భూములను అటవేతర పనులకు మార్పు చేయడం, నదులు, నదీ ప్రవాహ ప్రాంతాలకు అడ్డంగా పక్కా నిర్మాణాల వంటివి పశ్చిమ కనుమలను విధ్వంసం చేస్తున్నాయి. కేరళ, తమిళనాడు, గోవా, కర్నాటక, మహారాష్ట్ర, గుజరాత్‌ పశ్చిమ కనుమల్లో భాగం. గతేడాది నాటి కేరళ మ¬గ్ర వరదలతో సహా ప్రస్తుత జల విపత్తుల వరకు అన్నీ పడమటి కనుమల్లోనే సంభవిస్తుండటాన్ని బట్టి చూస్తే పర్యావరణవేత్తల ఆందోళనలు వాస్తవిక రూపం దాల్చుతున్నాయని భావించాల్సి ఉంటుంది. 2013లో ఉత్తరాఖండ్‌ను అకస్మిక వరదలు ముంచెత్తినప్పుడు నదులపై ఇబ్బడిముబ్బడిగా నెలకొల్పిన జల విద్యుత్‌ ప్రాజెక్టులు నదుల ప్రవాహాన్ని ఆటంకపర్చి చుట్టుపక్కనున్న ప్రాంతాలను ముంచెత్తాయని కనుగొన్నారు. కానీ ఎలాంటి చర్యలూ చేపట్టలేదు. మళ్లీ ఎప్పుడైనా వరదలొచ్చినప్పుడు మాత్రమే అలాంటి
అక్రమాలు చర్చకొస్తాయి. ప్రభుత్వాలకు ఉద్దేశపూర్వక నిర్లక్ష్యం అబ్బినందున ప్రజలకు కష్టనష్టాలు తప్పట్లేదు. మొత్తంగా వరదలకు దేశంలోని దక్షిణ, పశ్చిమ ప్రాంతాలు అతలాకుతలం అవుతున్నాయి. భారీ వర్షాలు, వరదల ఉధృతికి కేరళ, కర్నాటక, మహారాష్ట్ర, గుజరాత్‌,బీహార్‌లు  జలదిగ్భంధంలో చిక్కు కున్నాయి. ఇప్పటికే 200కుపైగా మృతి చెందారని సమాచారం. లెక్కల్లోకి రాని మరణాలెన్నో చెప్పలేం. అధికారిక సమాచారం మేరకు కేరళలో 72 మంది, కర్నాటకలో 40, మహారాష్ట్రలో 40, గుజరాత్‌లో 31 మంది జలవిలయానికి చనిపోయారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలతో జనజీవనం అస్తవ్యస్త మవుతోంది. లక్షలాది మందిని సహాయ శిబిరాలకు తరలించారు. బీహార్‌లో ఇంకా జలదిగ్బంధం నుంచి బయటపడలేదు. ఇటీవల ముంబయి, బెంగళూరు నగరాలను కలిపే 4వ నెంబర్‌ జాతీయ రహదారి పాడైపోవడంతో ఆ మార్గంలో భారీగా రవాణ స్తంభించింది. లక్షలాది ఎకరాల్లో పంటలకు, ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులకు అపార నష్టం వాటిల్లింది. ఆర్థిక నగరం ముంబయి ఈ నెల రోజుల్లో మూడు తడవలు ముంపునకు గురైంది. ఉత్తరాఖండ్‌లో నదులు పొంగి పొర్లాయి. గువ రాష్టాల్లో కురిసిన వానలకు గోదావరి ఉప్పొంగి మన దగ్గర ఉభయ గోదావరి జిల్లాల్లోని లంక, ఏజెన్సీ గ్రామాలు వారం రోజులుగా నీటి ముంపునకు గురయ్యాయి. తాజాగా వాయువ్య బంగాళాఖాతం, దానిని ఆనుకుని ఉన్న పశ్చిమ బెంగాల్‌, ఉత్తరకోస్తా, ఒడిశా ప్రాంతాలలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం.. వాయువ్య రాజస్థాన్‌ నుంచి గాంగ్‌టక్‌ వరకు ఏర్పడిన ఉపరితల ద్రోణిలో విలీనమైందని, దక్షిణ తమిళనాడు దాని పరిసర ప్రాంతాల్లో 0.9 కి.విూ. ఎత్తు వరకు ఏర్పడిన ఉపరితల ఆవర్తనం బలహీనంగా మారిందని తెలిపారు.
—————————
—- ——————

Other News

Comments are closed.