రోడ్డుకేక్కిన నాయక్ పోడు కులస్తులు

 

 

 

నిజాంసాగర్ సెప్టెంబర్ 10 (జనం సాక్షి)మహ్మద్ నగర్ మండలంలోని నాయక్ పోడు కులస్థులు రోడ్డికెక్కరు. తమకు స్థానిక తహసీల్దార్ కుల ధ్రువీకరణ పత్రాలు ఇవ్వకుండా ఇబ్బందులకు ఉరిచేస్తున్నాడని భధవారం నాడు జాతీయ రహదారిపై భారీగా రాస్తారోకో నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమ పూర్వీకరణ నుండి ఇక్కడ నివాసం ఉంటున్నప్పటికీ ప్రస్తుతం మహమ్మద్ నగర్ మండల తాసిల్దార్ సవాయి సింగ్ కుల ధ్రువీకరణ పత్రం లు ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నాడని వారు అన్నారు కుల తిరుగుతరణ పత్రం మంజూరు చేయటంతో తమ పిల్లలు చదువులలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని పలువురికి ఉద్యోగాలు సైతం వచ్చి ఉన్నాయని కుల ధ్రువీకరణ పత్రాలు లేకపోవడంతో వారు ఉద్యోగాలు పొందలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఉమ్మడి సాగర్ నిజాంసాగర్ మండలాల్లో సుమారుగా 3000 మంది జనాభా కలిగి ఉన్నారని అన్నారు మండల కేంద్రానికి భారీగా నాయక పోడు bవర్గాలు తాసిల్ కార్యాలయానికి చేరుకొని ధర్నా నిర్వహించారు జిల్లా పాలనధికారి వచ్చేంతవరకు ధర్నాలు కొనసాగిస్తామని పట్టుబట్టడంతో బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి ఘటన స్థలానికి చేరుకొని మాట్లాడారు.రూరల్ సీఐ తిరుపతయ్య. నిజాంసాగర్ ఎస్సై శివకుమార్ ఘటన స్థలానికి చేరుకొని పరిస్థితి నీ అపకడానికి ప్రయత్నం చేసారు. సబ్ కలెక్టర్ కిరణ్ మై వచ్చి వారిని శాంతింప చేసి పంపించారు. ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ కిరణ్మయి మాట్లాడుతూ ఉన్నతాధికారుల సంప్రదించి ఈ సమస్యను పరిష్కరిస్తామని అన్నారు కొంతమందికి ఉన్నతవిద్యాపరంగా, ఉద్యోగాల పరంగా ఇబ్బందులు ఉన్నవారికి త్వరగా ఎంక్వయిరీ చేసి సర్టిఫికెట్లు అందేలా చూస్తామని అన్నారు. ఉమ్మడి నిజం సాగర్ మండలాల నాయక్ కోడ్ అధ్యక్షుడు మిట్ట పెంటయ్య ఉపాధ్యక్షుడు, కంది సాయిలు, సాయిరాం మన్నె సాయిరాం టెంకటి సాయిరాం, గణేష్ పెంకేటి గణేష్,కార్యనిర్వాహక అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శి కుర్తి రవీందర్ సభ్యులు సిర్నాపల్లి సాయి అన్న కుర్తి కాశీరాం వేముల కాశీరాం తదితరులు పాల్గొన్నారు