మూసీకి వదరపోటు
` భారీ వర్షాలతో జంటజలాశయాలు నిండటంతో నదిలో పెరిగిన ప్రవాహం
` పరివాహక ప్రజలను అప్రమత్తం చేసిన అధికారులు
` ఉపరితల ఆవర్తనంతో బంగాళాఖాతంలో అల్పపీడనం
` తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలకు అవకాశం
హైదరాబాద్(జనంసాక్షి):తెలంగాణతో పాటు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ జంట జలాశయాలకు మరోమారు భారీగా వరద నీరు చేరుకుంది. అలాగే మూసీకి కూడా భారీగా వరద నీరు చేరుకోవడంతో మూసీ పరివాహక ప్రాంతాల్లో జీహెచ్‌ఎంసీ అధికారులు రెడ్ అలర్ట్ జారీ చేశారు. ఈ నేపథ్యంలో మూసీ పరివాహక ప్రాంత ప్రజలను అప్రమత్తం చేశారు జీహెచ్‌ఎంసీ అధికారులు. జంట జలాశయాల గేట్లు- ఎత్తడంతో ఉగ్రరూపం దాల్చింది మూసీ. జియాగూడ, పురానాఫూల్, చాదర్ ఘాట్, మూసారాంబాగ్ వద్ద ఉధృతంగా ప్రవహిస్తోంది మూసీ. ఈ క్రమంలో జియాగూడ, పురానాఫుల్ వద్ద ఆలయాలు, ధోబీ ఘాట్లు- నీట మునిగాయి. భారీగా వరద నీరు చేరడంతో జియాగూడ 100 ఫీట్ రోడ్డు మార్గం మూసివేశారు. అలాగే, హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ జంట జలాశయాలకు భారీగా వరద నీరు చేరుకుంది. భారీగా వరద ప్రవాహంతో హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ ఎనిమిది గేట్లు- ఎత్తివేశారు. జంట జలాశయాల నుంచి 8,000 క్యూసెక్కుల వరద నీరు విడుదల చేశారు. హిమాయత్ సాగర్ నాలుగు గేట్లను 4 అడుగుల మేర ఎత్తి.. 5, 215 క్యూసెక్కుల నీటిని మూసీలోకి వదులుతున్నారు. అలాగే ఉస్మాన్ సాగర్ నాలుగు గేట్లను 4 అడుగుల మేర ఎత్తి.. 2800 క్యూసెక్కుల నీటిని మూసీలోకి వదులుతున్నారు అధికారులు. హిమాయత్ సాగర్ ఇన్ ప్లో 5500 క్యూసెక్కులకు చేరింది. ఉస్మాన్ సాగర్ ఇన్ ప్లో 2300 క్యూసెక్కులకు చేరింది.
ఉపరితల ఆవర్తనంతో బంగాళాఖాతంలో అల్పపీడనం
ఉపరితల ఆవర్తనం ప్రభావంతో బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిరదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో తెలంగాణలోని పలు జిల్లాల్లో రానున్న రెండురోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని వెల్లడిరచింది. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో వర్షాలు కురిసే వీలుందని తెలిపింది. ఆదివారం వరకు మరికొన్ని జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు పడే అవకాశముందని వాతావరణ కేంద్రం పేర్కొంది. ఇవాళ ఆదిలాబాద్, కుమురం భీం ఆసిఫాబాద్, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, సూర్యాపేట, ఖమ్మం జిల్లాల్లో అతిభారీ వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది. ఈ జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరిక జారీ చేసింది. శనివారం నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొంది. వర్షాల ప్రభావంతో గంటకు 30 నుంచి 40 కి.విూ వేగంతో ఈదురుగాలులు వీచే వీలుందని తెలిపింది.జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో వర్షాలు దంచి కొడుతున్నాయి. భారీ వర్షాలకు వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. దీంతో మానేరు వాగుకు ఇంతకింతకూ పెరుగుతూ భయంకరంగా ప్రవహిస్తోంది. శుక్రవారం ఉదయం ఇసుక కోసం వెళ్లిన ట్రాక్టర్లు మానేరు వరదలో చిక్కుకున్నాయి. ఎనిమిది ట్రాక్టర్లు వరదల్లో చిక్కుకోవడంతో భయాందోళన పరిస్థితులు నెలకొన్నాయి. భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలం గర్మిల్లపల్లి- ఒడేడ్ గ్రామాల మధ్య గల మానేరు వాగులోకి ఇసుకకోసం వెళ్లిన 8 ట్రాక్టర్లు వరదలో చిక్కుకున్నాయి. మొదట అంతగా వరద లేకపోవడంతో ఇసుకను తవ్వుతూ ఉన్నారు. ఉన్నట్లుండి ఒక్కసారిగా నీటి ప్రవాహం పెరగటంతో ట్రాక్టర్లను అక్కడే వదిలేసి డ్రైవర్లు, కూలీలు వెంటనే బయటకు పరుగెత్తారు. ప్రవాహం పెరుగుతుండటంతో పరిస్థితి భయంకరంగా తయారైంది. వరద ఉధృతికి ట్రాక్టర్లు ఒరిగి పోయిన దృశ్యాలు ఆంతోళన కలిగిస్తున్నాయి. అయితే ఎలాంటి ప్రాణ నష్టం లేకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు పోలీసులు. వెంటనే అక్కడికి చేరుకుని సిబ్బందితో కలిసి సహాయక చర్యలు స్థానిక పోలీసులు చేపట్టారు. ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద పోటెత్తడంతో ఉస్మాన్ సాగర్ జలాశయం నిండుకుండలా మారింది. దీంతో జలమండలి అధికారులు గండిపేట జలాశయం ఆరు గేట్లను నాలుగు అడుగుల మేర పైకి ఎత్తి 2652 క్యూసెక్కుల వరద నీటిని దిగువనున్న మూసీలోకి విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం జలాశయంలోకి 2000 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోందని అధికారులు తెలిపారు. మరోవైపు గేట్లు- ఎత్తడంతో మూసీలో వరద ఉద్ధృతి మరింత పెరిగింది. నార్సింగి, మంచిరేవుల మధ్య ఉన్న కల్వర్టు పైనుంచి ఈ వరద నీరు ప్రవహించడంతో అధికారులు ఇరువైపులా రాకపోకలను నిలిపివేశారు. మూసీలో వరద ప్రవాహం అధికంగా ఉండటంతో మున్సిపల్, రెవెన్యూ, పోలీసు శాఖల అధికారులు లోతట్టు- ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేసినట్లు తెలిపారు. కరీంనగర్ జిల్లా సైదాపూర్ పరిధిలో గురువారం రాత్రి భారీ వర్షం కురిసింది. న్యాళ చెరువు, ఆకునూరు ఊర చెరువు సహా పలు కుంటలు వరదనీటితో నిండిపోయాయి. దీంతో పలు గ్రామాల్లో పంటపొలాలు నీటమునిగాయి. సోమారంలో ఆదర్శ పాఠశాల పరిసరాలు జలమయమయ్యాయి. అక్కడి వసతి గృహం చుట్టూ మోకాలి లోతు నీరు చేరింది. దీంతో విద్యార్థులు ఇబ్బందులు పడ్డారు. మండలంలోని బొమ్మకల్ వద్ద కల్వర్టుపై వరద ఉద్ధృతి అధికంగా ఉండడంతో రాకపోకలు నిలిచిపోయాయి. వెనుకేపల్లి తుమ్మలచెరువు మత్తడి పడుతుండడంతో అటు-వైపు రైతులు పంట పొలాలకు వెళ్లేందుకు ఇబ్బందులు ఎదుర్కొంటు-న్నారు. మరో మూడు రోజుల పాటు- భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ వెల్లడిరచడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సైదాపూర్ తహశీల్దార్ శ్రీనివాస్, ఎస్సై తిరుపతి కోరారు. అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లొద్దన్నారు. రైతులు పంట పొలాలకు వెళ్లే విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. గురువారం రాత్రి సైదాపూర్‌లో 102 మిల్లీవిూటర్ల వర్షపాతం నమోదైనట్లు- అధికారులు తెలిపారు. రంగారెడ్డి జిల్లాలో కురిసిన భారీ వర్షానికి వాగులు, కుంటలు పొంగి ప్రవాహిస్తున్నాయి. అబ్దుల్లాపూర్‌మెట్ మండలం అనాజ్‌పూర్ గ్రామ పరిధిలోని ఇందిరాసాగర్ నిండుకుండలా మారి అలుగు పోస్తోంది. మజీద్‌పూర్, గుంతపల్లి గ్రామాల మధ్య ఏరులో వరద నీరు ఉరకలేస్తోంది. కల్వర్టు విూదుగా వరద ప్రవహిస్తుండటంతో రాకపోకలకు ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.