తండ్రి అంత్యక్రియలకు వచ్చి కొడుకు మృతి
పిట్లం సెప్టెంబర్ 10(జనం సాక్షి)పిట్లం మండలంలోని ధర్మారం గ్రామానికి చెందిన వడ్డే ప్రకాష్ వయస్సు 36 గారికి గత కొంత కాలంగా తన భార్య అయిన తులసి తో కుటుంబ సంసారం విషయంలో తరచు గొడవలు జరుగుతుండడంతో ఆమె తన పుట్టింటి దగ్గర ఉంటున్నది అయితే తేదీ 09.09.25 నాడు రాత్రి సమయంలో ప్రకాష్ తండ్రి అయిన ఒడ్డే నాగయ్య అనారోగ్యం తో చనిపోగా అట్టి చావుకు వచ్చిన కొడుకు వడ్డే ప్రకాష్ తన భార్య, బామ్మర్దులతో తేదీ 10.09.25 నాడు ఉదయం ప్రకాష్ గొడవ పడి తన ఇంట్లో కి వెళ్లి తలుపులు పెట్టుకొని ఉరి వేసుకొని చనిపోయాడు మృతునికి ఇద్దరు కూతుళ్లు ఒక కొడుకు సంతానం కలరు. మృతుడి తమ్ముడు అయిన బుచ్చయ్య పిర్యాదు ఇవ్వగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వెంకట్ రావు వివరించారు