వార్డు అభివృద్ధే లక్ష్యం- కౌన్సిలర్ కొండ ప్రవీణ్ గౌడ్.

share on facebook

*రాజేంద్రనగర్. ఆర్.సి (జనం సాక్షి)* : ఉట్ పల్లి వార్డు అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్నానని శంషాబాద్ మున్సిపాలిటీ ఉట్ పల్లి 12వ వార్డు కౌన్సిలర్ కొండ ప్రవీణ్ గౌడ్ అన్నారు.
వార్డు ప్రజల కోరిక మేరకు రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని 12వ వార్డు ఉట్ పల్లి కౌన్సిలర్ కొండ ప్రవీణ్ గౌడ్ 6,50,000 వేల సొంత నిధులతో వాటిలోని రెండు రోడ్డులకు మరమ్మతు పనులను సోమవారం ప్రారంభించిన కౌన్సిలర్ కొండ ప్రవీణ్ గౌడ్.
ఈ సందర్భంగా మాట్లాడుతూ శంషాబాద్ మున్సిపాలిటీ ఏర్పడి ఇప్పటికి మూడు సంవత్సరాలు గడుస్తున్న ఎన్నోసార్లు ఎమ్మెల్యేకు మున్సిపల్ కమిషనర్ కు వార్డు అభివృద్ధి కొరకు నిధులు కేటాయించాలని వినతి పత్రాలు ఇచ్చిన ఇప్పటివరకు నిధులు కేటాయించలేదన్నారు. దానిని దృష్టిలో ఉంచుకొని ప్రజలకు ఇబ్బందులు కలగకూడదనే ఉద్దేశంతోనే సొంత నిధులతో రోడ్డు మరమత్తు పనులు చేయించడం జరిగిందన్నారు. ఇప్పటికైనా వార్డు అభివృద్ధి కొరకు నిధులు కేటాయించి అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సిసి రోడ్లు పనులు ప్రారంభమయ్యేలా చర్యలు తీసుకోవాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో నాయకులు తుడుం జగన్,నవీన్, భాస్కర్,దేవానంద్, మధు తదితరులు పాల్గొన్నారు.
ఫోటో రైటప్ : ఉట్ పల్లిలో రోడ్డు మరమ్మతు పనులను ప్రారంభిస్తున్న కౌన్సిలర్ కొండ ప్రవీణ్ గౌడ్.
Attachments area

Other News

Comments are closed.