మైనింగ్ జోన్ ప్రజాభిప్రాయ సేకరణ ఏర్పాట్లను అడ్డుకున్న తెరాస నాయకులు

యాచారం మండలం  మొండిగౌరెల్లి గ్రామాల సరిహద్దు లోని యాచారం గ్రామ రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్: 141,144 గల నెంబర్లలో మైనింగ్ జోన్ ఏర్పాటు విషయమై అధికారుల తీరుపట్ల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వారికి అండగా గతం నుండి   ఇబ్రహింపట్నం శాసనసభ్యులు  మంచిరెడ్డి కిషన్ రెడ్డి పలు మార్లు మైనింగ్ జోన్ వస్తే అడ్డుకుంటామని తేల్చి చెప్పారు.  శుక్రవారం మండల టిఆర్ఎస్ అధ్యక్షుడు కర్నాటి రమేష్ గౌడ్,ప్రధాన కార్యదర్శి పాచ్య బాష మొండి గౌరెళ్లి సర్పంచ్ బండి మీది కృష్ణ తో కలసి అక్కడి గ్రామల రైతులతో, ప్రజలతో కలిసి మైనింగ్ జోన్ ప్రాంతాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతులకు, ప్రజలకు ఎల్ల వేళలా మైనింగ్ జోన్ రాకుండా అండగా ఉంటామని, మైనింగ్ జోన్ వస్తే సహించేది లేదనిఅన్నారు. అదేవిధంగా రైతులతో, ప్రజలతో కలిసి మైనింగ్ జోన్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో మండల తెరాస నాయకులు ,ఓరుగంటి యాదయ్య, సత్యపాల్, కల్లూరి శివ, కాజు, సంపత్,పంది సుధాకర్, తదితరులు పాల్గొన్నారు.