హైదరాబాద్‌ సేఫ్‌ సిటీ

` దేశంలోనే అత్యంత సురక్షిత నగరాల్లో మూడవ స్థానంలో నిలిచిన మహానగరం
` 2021 జాతీయ క్రైమ్‌ రికార్డ్‌ బ్యూరో నివేదికలో వెల్లడి
` ప్రథమ,ద్వితీయ స్థానాల్లో కోల్‌కతా,పుణే..
హైదరాబాద్‌(జనంసాక్షి):దేశంలో అత్యంత సురక్షిత మూడు  మెట్రో నగరాల్లో హైదరాబాద్‌ ఒకటిగా నిలిచింది. కేంద్ర నేర రికార్డుల విశ్లేషణా సంస్థ (ఎన్సీఆర్బి ) ప్రకటించిన దేశంలోని అత్యంత సురక్షిత నగరాల్లో కొలకత్తా ప్రధమ స్థానంలోనూ, పూణే ద్వితీయ స్థానంలో ఉండగా హైదరాబాద్‌ మహానగరం తృతీయ స్థానంలో నిలిచింది. తెలంగాణలో శాంతి భద్రతల పరిరక్షణకు సి.ఎం. కేసీఆర్‌ ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యతను ఈ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. దేశంలో రెండు మిలియన్‌ జనాభా ఉన్న నగరాల్లో విచారణకు అర్హమైన నేరాల (కాగ్నిజబుల్‌ అఫెన్స్‌) నమోదును ఎన్సీఆర్బి విశ్లేషించింది. ఈ నివేదికను ఇటీవలే ఎన్సీఆర్బి విడుదల చేసింది. ఈ నివేదిక ప్రకారం,  ప్రతి మిలియన్‌ జనాభాకు హైదరాబాద్‌ నగరంలో కేవలం 2599 నేరాలు మాత్రమే జరుగుతున్నాయి. ఇదే భారత రాజధాని ఢల్లీి లో ప్రతి మిలియన్‌ జనాభాకు 18 ,596 నేరాలతో దేశంలోనే క్రైమ్‌ పరంగా అగ్ర స్థానంలో నిలిచింది. కేవలం 1034 నేరాల నమోదుతో కొలకత్తా అత్యంత తక్కువ నేరాలు జరిగే మెట్రో నగరంగా అగ్రస్థానంలో నిలవగా, 2568 నేరాలతో పూణే మెట్రో ద్వితీయ స్థానంలో నిలిచింది. పైన చెప్పైనట్టు ప్రతి మిలియన్‌ జనాభాకు కేవలం 2599 నేరాలు మాత్రమే నమోదవుతూ తృతీయ స్థానంలో ఉన్న ఐటి నగరమైన హైదరాబాద్‌ సురక్షిత నగరంగా కొనసాగుతూ ఉంది. ఇక, అత్యంత అధిక నేరాలతో ఢల్లీి నగరం అగ్రస్థానంలో ఉండగా, సూరత్‌, కొచ్చిన్‌, అహ్మదాబాద్‌, చెన్నై నగరాలు తర్వాతి స్థానాల్లో నిలిచాయి.దక్షణాది మెట్రో నగరాల్లో అతితక్కువ నేరాలు జరిగే నగరంగా హైదరాబాద్‌ నగరం నిలువగా, మరో ఐటి నగరంగా పిలుచుకునే బెంగళూర్‌ లో ప్రతీ మిలియన్‌ జనాభాకు 4272 నేరాలు నమోదవుతూ సురక్షిత నగరాల్లో ఐదవ స్థానాన్ని పొందింది. వీటినే, ఒక లక్ష జనాభాకు తీసుకుంటే, కలకత్తాలో 104 .4 నేరాలు నమోదు కాగా, 256 .8 నేరావులు పూణేలో, 259 .9 హైదరాబాద్‌ లో నమోదయ్యాయి. 427 .2  బెంగుళూరు లో, 428 .4  ముంబాయిలో నమోదయ్యాయి.ఇక, హత్యల విషయానికొస్తే, కొలకత్తా లో 45 , హైదరాబాద్‌ లో 98 , బెంగళూర్‌ లో 152 , ఢల్లీిలో 454 , ముంబాయి లో 162   జరిగాయి. హత్యాయత్నం కేసులవిషయాని కొస్తే కోల్కత్తా 135 , హైదరాబాద్‌ లో 192 , బెంగళూర్‌ లో 371 , ఢల్లీి లో 752 , ముంబాయిలో 349 గా  నమోదయ్యాయి. మాన భంగం కేసులను పరిశీలిస్తే కోల్కత్తాలో 11 , హైదరాబాద్‌ లో 116 , బెంగుళూరు లో 117 , ఢల్లీి లో 1226 ,ముంబయి లో 364   గా ఉన్నాయి. మహిళలపై దాడులను పరిశీలిస్తే 127 కోల్కత్తాలో, 177 హైదరాబాద్‌ లో, 357 బెంగుళూర్‌ లో, 1023 ఢల్లీిలో జరిగాయి. డెకాయిటీ లను చూస్తే, కలకత్తాలో 3 , హైదరాబాద్‌ లో 11 , బెంగుళూరు లో 36 , ఢల్లీి లో 25 , ముంబాయి లో 16   గా ఉన్నాయి. దొంగతనాల అంశానికొస్తే కలకత్తాలో 1246 , హైదరాబాద్‌ లో 2419 , బెంగుళూరు లో 6066 , ఢల్లీి లో 1980 , ముంబాయి లో 7820  గా నమోదయ్యాయి.