అంగన్‌వాడీ కేంద్రాల అభివృద్ధికి చర్యలు
కర్నూలు, జూలై 28 : అంగన్‌వాడీ కేంద్రాల అభివృద్ధికి అన్ని చర్యలు తీసుకున్నట్టు రాష్ట్ర మహిళ, శిశు సంక్షేమశాఖ మంత్రి వి. సునీతా లక్ష్మారెడ్డి చెప్పారు. శనివారం మామిడాలపాడు గ్రామంలోని అంగన్‌వాడీ కేంద్రాన్ని పరిశీలించారు. మహిళ, శిశు సంక్షేమశాఖ కమిషనర్ చిరంజీవి చౌదరి, జువేదా బేగం తదితరులు మంత్రి వెంట ఉన్నారు. అనంతరం ఆమె చిన్నపిల్లలతో ముచ్చటించారు. అంగన్‌వాడి కేంద్రాలు అన్ని ప్రాంతాల్లో బాగా పనిచేస్తున్నాయని, భవిష్యత్‌లో మరింత అభివృద్ధికి అన్ని చర్యలు తీసుకుంటామని అన్నారు. 2009లో వచ్చిన వరదల వల్ల మామిడాలపాడు గ్రామంలోని అంగన్‌వాడి కేంద్రం ఫ్లోరింగ్ పూర్తిగా దెబ్బతినడంతో వాటి మరమ్మతులకు బడ్జెట్ కేటాయిస్తున్నట్టు ఆమె తెలిపారు. పిల్లలందరికి వారానికి రెండు సార్లు గుడ్లు ఇస్తున్నామని టీచర్ మంత్రికి నివేదించారు.