ధరణి,భూభారతి కుంభకోణంలో 15మంది అరెస్ట్‌

` నిందితుల నుంచి రూ.63.19లక్షల నగదు స్వాధీనం
` మరో 9 మంది పరారీలో ఉన్నారు
` వరంగల్‌ కమిషనర్‌ సన్‌ ప్రీత్‌సింగ్‌
వరంగల్‌(జనంసాక్షి): తెలంగాణలో సంచలనం సృష్టించిన ధరణి, భూ భారతి కుంభకోణంలో 15 మందిని అరెస్టు చేసినట్టు వరంగల్‌ కమిషనర్‌ సన్‌ ప్రీత్‌సింగ్‌ తెలిపారు. మరో 9 మంది పరారీలో ఉన్నట్టు చెప్పారు. ప్రధాన నిందితులుగా బసవరాజు, జెల్లా పాండుగా గుర్తించాం. జనగామ, యాదాద్రి జిల్లాల్లో గతంలో అక్రమ రిజిస్టేష్రన్లు జరిగాయి. యాదగిరిగుట్టలోని ఆన్‌లైన్‌ సర్వీస్‌ సెంటర్ల ద్వారా మోసాలు జరిగాయన్నారు. రూ.3.90 కోట్ల ప్రభుత్వ ఆదాయానికి గండి పడిరది. వెబ్‌సైట్‌లో సాంకేతిక లోపాల ఆధారంగా లూటీ చేశారు. నిందితుల నుంచి రూ.63.19లక్షల నగదు స్వాధీనం చేసుకున్నాం. నిందితుల బ్యాంక్‌ ఖాతాల్లోని రూ.లక్ష సీజ్‌ చేశాం. రూ.కోటి విలువైన ఆస్తి పత్రాలు, కారు, ల్యాప్‌ టాప్‌లు, డెస్క్‌ టాప్‌లు, సెల్‌ ఫోన్లు స్వాధీనం చేసుకున్నాం. పరారీలో ఉన్న నిందితుల కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి. ధరణి` భూ భారతి కేసులో మరిన్ని అరెస్టులు జరిగే అవకాశముందని సీపీ తెలిపారు. మొత్తం మూడు కోట్ల 72 లక్షల రూపాయల కుంభకోణం జరిగినట్టు పోలీసులు వెల్లడిరచారు. జనగామ, యాదాద్రి జిల్లాల్లో సంచలనం సృష్టించిన ధరణి, భూ భారతి కుంభకోణం కేసులో కీలక ఆధారాలు సేకరించారు పోలీసులు.