జల్ జంగల్ జమీన్ కోసం నినదించిన జిల్లా..ఆదిలాబాద్ ఖిల్లా…
` తుమ్మడిహట్టి వద్ద ప్రాజెక్ట్ కట్టి తీరుతాం
` అభివృద్ది కోసమే నా ఆరాటం
` ఉమ్మడి జిల్లాకు యూనివర్సిటీ మంజూరు
బాసర ఐఐటిలోనే క్యాంపస్ ఏర్పాటు చేస్తాం
నిర్మల్ జిల్లాకు అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్ మంజూరు
ఆదిలాబాద్ విమానాశ్రాయానికి ప్రధానితో శంకుస్థాపన
పనుల కోసం ప్రధానితో భేటీ అవుతూనే ఉంటా
కేసీఆర్ అప్పులతో తెలంగాణ కుప్పయ్యింది
ఫాంహౌజ్ రాజకీయాలతో తెలంగాణకు నష్టం వాటిల్లింది
బీఆర్‌ఎస్ నాయకులు రాక్షసుల్లా అభివృద్ధికి అడ్డుపడుతున్నారు
అభివృద్ది కోసం ఆశీర్వదించండి..మున్సిపల్ ఎన్నికల్లోనూ ఆదరించండి
నిర్మల్ బహిరంగ సభలో సీఎం రేవంత్ పిలుపు
చనాకా`కొరాటా పంప్‌హౌస్, సదర్మట్ బ్యారేజీని ప్రారంభించిన ముఖ్యమంత్రి
నిర్మల్(జనంసాక్షి):పాలమూరు జిల్లాతో సమానాంగా ఆదిలాబాద్ జిల్లాకు నిధులు మంజూరు చేస్తామని సీఎం రేవంత్‌రెడ్డి హావిూ ఇచ్చారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాల అనంతరం నిర్మల్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం ప్రసంగించారు. నిర్మల్ ప్రజలు ఇచ్చిన భరోసా, మద్దతు వల్లే సీఎం అయ్యాను. ఆదిలాబాద్ జిల్లా పోరాటానికి, పౌరుషానికి గడ్డ అంటూ.. జల్, జంగల్, జీవిూన్ అంటూ కుమురం భీం కొట్లాడారని అన్నారు. ఈ జిల్లాలో జరగాల్సినంత అభివృద్ధి జరగలేదు. బాసర ట్రిపుల్ ఐటీలోనే యూనివర్సిటీ ఏర్పాటు చేస్తాం. జిల్లాలోని ప్రజాప్రతినిధులంతా ఇందుకు సహకరించాలి. పారిశ్రామికంగానూ ఆదిలాబాద్‌ను అభివృద్ధి చేస్తాం. జిల్లాకు ఎయిర్ బస్ తీసుకొస్తాం. ఎయిర్‌పోర్టు కోసం 10వేల ఎకరాల భూమిని సేకరించాల్సి ఉందన్నారు. విమానాశ్రయం ప్రారంభోత్సవానికి ప్రధాని మోదీని ఆహ్వానిద్దాం. తుమ్మిడిహట్టి వద్ద ప్రాజెక్టు కట్టాల్సిందే.. ఆదిలాబాద్ జిల్లాకు నీరు ఇవ్వాల్సిందే. ప్రతి 3 నెలలకు ఒకసారి ప్రధాని వద్దకు వెళ్తున్నాం. ఆయనకు ఇవ్వాల్సిన గౌరవం ఇచ్చి.. అడగాల్సిన ప్రాజెక్టులు అడుగుతున్నాం. మోదీని పదే పదే కలుస్తున్నానని కొంత మంది విమర్శిస్తున్నారు. రాష్టాన్రికి నిధులు, ప్రాజెక్టులు ఎవరు ఇస్తారు.. ప్రధాని కాదా? ప్రధానిని కలవకపోతే నిధులు, ప్రాజెక్టులు ఎలా వస్తాయి. పదేళ్ల పాటు కేంద్ర ప్రభుత్వాన్ని గత ప్రభుత్వం అడగలేదు. అడగకపోతే రాష్టాన్రికి ఏం కావాలో కేంద్రానికి ఎలా తెలుస్తుంది. పైరవీలు చేయను.. పర్సనల్ ఎంజెడా లేదు.. రాష్ట్ర అభివృధ్ధి కోసం, నిధుల కోసం.. ప్రధాని మోదీ, అమిత్ షా సహా ఎవరినైనా కలుస్తానని అన్నారు. ఎన్నికలు వచ్చినప్పుడే రాజకీయాలు.. ఆ తర్వాత అభివృద్ధే అందరి లక్ష్యం. పదేళ్లు అధికారంలో ఉన్న వారు ఈ ఆలోచన చేయకపోవడం వల్లే.. తెలంగాణకు తీరని నష్టం జరిగిందని పరోక్షంగా కెసిఆర్ తీరుపై మండిపడ్డారు.. రాష్ట్ర భాజపా నేతలు కూడా ప్రధాని మోదీని కలిసి రాష్టాన్రికి ప్రాజెక్టులు, నిధులు తేవాలి. నిర్మల్ జిల్లాకు అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్ మంజూరు చేస్తున్నాం. నాగోబా జాతరకు రూ.22కోట్లు మంజూరు చేసి అభివృద్ధి చేస్తాం. సమ్మక్క`సారలమ్మ జాతరకు రూ.300 కోట్లు కేటాయించి పునర్నిర్మాణం చేశాం. ప్రపంచ పెట్టుబడులకు హైదరాబాద్ స్వర్గధామంగా మారిందన్నారు. పెట్టుబడుల కోసం మేం ప్రయత్నిస్తుంటే.. స్థిరాస్తి వ్యాపారం చేస్తున్నామని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. పదేళ్లు అధికారాన్ని అనుభవించి రూ.8లక్షల కోట్లు అప్పు చేశారు.. రూ. వేల కోట్లు దోపిడీ చేశారని కెసిఆర్‌పై సీఎం రేవంత్ రెడ్డి విమర్శలు గుప్పించారు. భూసేకరణ కు నిధులు మంజూరు చేసి ప్రాజెక్టులు పూర్తి చేసుకున్నామని తెలిపారు. ఉమ్మడి జిల్లాకు వర్శిటీ లేదని.. ఈ ప్రాంతానికి వర్సిటీ మంజూరు
చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడిరచారు. త్వరలో వర్సిటీ మంజూరు అవుతుందన్నారు. బాసర వర్సిటీ ఏర్పాటు చేసుకుంటున్నామని.. దానికి ఏర్పాట్లు చేయాలన్నారు. ఆదిలాబాద్ వర్సిటీ బాసరలో ఏర్పాటు చేస్తున్నామని.. ఉమ్మడి జిల్లా కు కావాల్సిన నిధులను బ్జడెట్ లో ప్రవేశ పెట్టుతామన్నారు.. తుమ్మడి హెట్టీ వద్ద ప్రాణహిత చేవెళ్ల పై నివేదిక తయారు చేస్తున్నామని.. తుమ్మడి హెట్టీ వద్ద ప్రాజెక్టు కట్టి తీరుతామని స్పష్టం చేశారు. ప్రతి నీటి చుక్కని ఓడి పట్టుతామన్నారు.. ఆదిలాబాద్‌కు ఎయిర్ పోర్ట్ తీసుకొచ్చే బాధ్యత తనదని హావిూ ఇచ్చారు. మోడీ చేతుల విూదుగా ఆదిలాబాద్ ఎయిర్ పోర్టు శిలాఫలకం వేయిస్తామని స్పష్టం చేశారు. ఎన్నికలు వచ్చాక రాజకీయం.. ఎన్నికల తర్వాత అభివృద్ధికి కలిసి నడుద్దామన్నారు. ప్రతి మూడు నెలలకు సారి కేంద్రాన్ని కలుస్తాం.. విూరు సైతం నా దగ్గరకు రండి.. సాధ్యం అయినంత పనులు చేస్తామని ప్రతిపక్ష నేతలకు సీఎం తెలిపారు. మోడీ నాకు చుట్టం కాదు దేశానికి ప్రధాని కాబట్టి మన ప్రాంతం అభివృద్ధి కావాలి కాబట్టి మోడీని కలుస్తున్నానని చెప్పారు. ప్రాంత అభివృద్ధి కోసం ఎవ్వైర్నినా కలుస్తా. పైరవీలు లేవు, పర్సనల్ పనులు నాకు లేవని సీఎం స్పష్టం చేశారు.
కేంద్రం వరంగల్ ఎయిర్ పోర్టు వచ్చింది. ఆదిలాబాద్ ఎయిర్ పోర్ట్ ఇస్తాం అని చెప్పినట్లు సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. ‘ఇవ్వన్నీ అడిగనిదే ఇవ్వరు. గత పాలకులు అడగకపోవడంతో ఈ పరిస్థితి వచ్చింది. వాళ్ల తప్పులకు ఇప్పుడు అప్పులు మిగిలాయి. ఆ ప్రభుత్వంలో ఇచ్చిన బియ్యం ఎవ్వరైనా తిన్నారా..? కాని మేము ఇచ్చే సన్న బియ్యం తింటున్నారు. నాడు పావలా వడ్డీ లేదు సున్నా వడ్డీ లేదు.. గుండు సున్నా మిగిల్చారు. వెయ్యికోట్ల భూమి మహిళలకు కేటాయించాం..రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక స్థితి వల్ల క్రమక్రమంగా అభివృద్ధి చేసుకుందాం.. రాష్ట్ర ప్రజలు అండగా నిలవండి, దేశంలోనే నంబర్ వన్ రాష్టాన్ని తీర్చిదిద్దుతా.. త్వరలో మున్సిపల్ ఎన్నికలు రాబోతున్నాయి? ప్రజా ప్రభుత్వంతో కలిసి పని చేసే వారిని గెలిపించండి.. కేవలం ఎన్నికల అప్పుడే రాజకీయాలు, అభివృద్ధికి అందరం ఒకటే..‘ అని సీఎం రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు.
పదేళ్ల పాలనలో అప్పులు తప్ప అభివృద్ది లేదు
ఆదిలాబాద్ జిల్లా అంటే తనకు ప్రత్యేకమైన అభిమానం ఉందని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. అత్యంత వెనుకబడిన ఈ జిల్లాకు ఆశించిన న్యాయం జరగలేదని పేర్కొన్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో శక్రవారం పర్యటించిన సిఎం రూ.386.46 కోట్లతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. హాతిఘాట్‌లో చనాకా ` కొరాట బ్యారేజ్ పంప్‌హౌస్ ప్రారంభించారు. సదర్మట్ బ్యారేజ్‌ను జాతికి అంకితం చేశారు. యాసంగి పంటకు నీరు విడుదల చేశారు. పొన్కల్ దగ్గర గోదావరి నదిపై సదర్మట్ బ్యారేజ్ నిర్మాణాన్ని ప్రారంభించారు. రూ.676 కోట్లతో ప్రభుత్వం సదర్మట్ బ్యారేజ్ నిర్మాణం చేపట్టిందని సీఎం ప్రసంగించారు. ఈ బ్యారేజ్ ద్వారా 18 వేల ఎకరాలకు సాగునీరును ప్రభుత్వం అందించనుందన్నారు. కేసీఆర్ హయాంలో చిత్తశుద్ధిగా పనిచేసి ఉంటే చనాక ` కొరాట ప్రాజెక్టు ఎప్పుడో పూర్తయ్యేదని తెలిపారు. చనాక ` కొరాట, సదర్మట్ బ్యారేజీలు గత పదేళ్లలో పూర్తికాలేదని ఈ సందర్భంగా సీఎం చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే అవసరమైన నిధులు మంజూరు చేసి పనులు పూర్తి చేశామని వెల్లడిరచారు. కాళేశ్వరానికి రూ.లక్షా 10 వేల కోట్లు ఖర్చుచేసినా.. చుక్కనీరు రాలేదని విమర్శించారు. రైతులకు నీరు రావాలంటే తుమ్మిడిహెట్టి దగ్గర ప్రాజెక్టు కట్టాల్సిందేనని స్పష్టం చేశారు. ఈ ప్రాజెక్టు నిర్మాణానికి అవసరమైన పక్రియ ప్రారంభమైందని పేర్కొన్నారు. ఒక్కొక్కటిగా సమస్యలు పరిష్కరించుకుంటూ ముందుకెళ్తున్నామని తెలిపారు. తెలంగాణ అభివృద్ధి విషయంలో రాజకీయాలు చేయొద్దని హితవు పలికారు. నాటి పాలకులు చేసిన అప్పులే ఇప్పుడు ఉరి తాడు అయ్యాయి. మేం ఫ్యూచర్ సిటీ అంటే మమ్మల్ని రియల్ ఎస్టేట్ బ్రోకర్స్ అంటున్నారు’ అని ప్రతిపక్షాలనుద్దేశించి అన్నారు ముఖ్యమంత్రి.’పదేళ్ల పాలనలో ఏవిూచేయని వ్యక్తి ప్రజాపాలనను భరించలేక పోతున్నారు. 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఉన్న వ్యక్తి ఇలాగేనా మాట్లాడేది. చేతనైతే మమ్మల్ని ఆశీర్వదించండి.. లేకుంటే ఫామ్‌హౌస్‌లోనే ఉండండి. మారీచుడు, సుగ్రీవుడు తరహాలో రాక్షసుల్లా.. అభివృద్ధికి అడ్డుపడుతున్నారు. శుక్రాచార్యుడిలా ఫామ్‌హౌస్‌లో ఉన్న వ్యక్తి ప్రోత్సహిస్తున్నారు. పదేళ్లు అధికారంలో ఉండి రూ.8 లక్షల కోట్ల అప్పులు చేశారు. బీఆర్‌ఎస్ నేతలకు అభివృద్ధి అంటే ఇష్టం లేకపోతే ఫామ్‌హౌస్‌లో విశ్రాంతి తీసుకోవచ్చు. బావాబామ్మర్దులు అభివృద్ధిని అడ్డుకుంటున్నారు. మొన్న పంచాయతీ ఎన్నికల్లో 66శాతం కాంగ్రెస్ సర్పంచ్‌లను గెలిపించారు ప్రజలు. వారి నమ్మకాన్ని వమ్ము చేయం. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లోనూ మంచి వాళ్లను ఎన్నుకోండి. సమస్యలను పరిష్కరించే వాళ్లను, ప్రజా ప్రభుత్వంతో కలిసి పనిచేసిన వాళ్లనే గెలిపించుకోండి. నేను ఓడిపోయిన వాళ్ల గురించి మాట్లాడను. మేం పాలకులం కాదు.. సేవకులం. విూ మనసు గెలుస్తాం.. రాబోయే ఎన్నికల్లో విజయం సాధిస్తాం. 2038వరకు అధికారంలో ఉంటాం’ అని సీఎం రేవంత్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.
చనాకా`కొరాటా పంప్‌హౌస్‌ను ప్రారంభించిన సిఎం
ఆదిలాబాద్ జిల్లాలో సిఎం రేవంత్ రెడ్డి శుక్రవారం పర్యటించిన సందర్భంగా భోరాజ్ మండలం హతిఘాట్‌లో చనాకా`కొరాటా పంప్‌హౌస్‌ను ప్రారంభించి ప్రధాన కాలువకు నీటిని విడుదల చేశారు. జిల్లా పర్యటనలో భాగంగా రూ.386.46 కోట్లతో పలు అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేసారు. ఈ కార్యక్రమంలో సిఎంతోపాటు మంత్రులు ఉత్తమ్‌కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, పలువురు ఎమ్మెల్యేలు ఉన్నారు. అనంతరం నిర్మల్ జిల్లాలో సిఎం పర్యటించారు. పొంకల్ గ్రామంలో సదర్మట్ బ్యారేజీని ప్రారంభించారు. ఆంధప్రదేశ్ చేపట్టిన నల్లమల సాగర్ కు తాము వ్యతిరేకమని ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిస్పష్టం చేశారు. సుప్రీంకోర్టులో దీనిపై పోరాటం చేస్తున్నామని తెలిపారు. గోదావరి జలాల్లో చుక్క నీరు కూడా వదులుకునేది లేదని అన్నారు. నిర్మల్ లో ఏర్పాటు చేసిన సభలో మాట్లాడిన మంత్రి.. తుమ్మిడిహట్టి నుంచి గ్రావీటి ద్వారా సుందిళ్ల ప్రాజెక్టుకు తరలిస్తామని చెప్పారు. సుందిళ్ల నుంచి ఎల్లంపల్లి ప్రాజెక్టుకు నీటిని తరలిస్తామని తెలిపారు. ఉమ్మడి జిల్లాలో చెనాక కోరాట బ్యారేజి కోసం మరో వంద కోట్ల నిధులు విడుదల చేయనున్నట్లు తెలిపారు` మంత్రి ఉత్తమ్. చెనాక కోరాట బ్యారేజికి మాజీ మంత్రి రామచంద్రా రెడ్డి పేరు , సదర్ మఠ్‌కు పి.నర్సారెడ్టి పేర్లు పెడుతున్నట్లు చెప్పారు. పీపీ ప్రాజెక్టు, మత్తడి, కుప్టి ప్రాజెక్టులకు ప్రాధాన్యత ఇస్తామని తెలిపారు. 27 ప్యాకేజీలకు రూ.97 కోట్లతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో లక్ష ఎకరాలకు సాగునీరు అందిస్తామని హావిూ ఇచ్చారు.
త్వరలోనే అన్నీ ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తాం
` గత ప్రభుత్వం సొంత లాభం చూసుకుంది
` కుటుంబం, పార్టీ, రాజకీయ అవసరాలే ప్రాధాన్యంగా గత ప్రభుత్వం పని చేసింది
` నిరుద్యోగ యువత.. రాజకీయ పార్టీల చేతిలో ఆయుధాలుగా మారొద్దు: సీఎం రేవంత్‌రెడ్డి
` గ్రూప్`3 ఉద్యోగాల నియామక పత్రాల పంపిణీలో సీఎం రేవంత్ రెడ్డి
హైదరాబాద్(జనంసాక్షి):గత ప్రభుత్వ పెద్దల ఉద్యోగాలు ఊడగొట్టి.. తమకు ఉద్యోగాలు ఇచ్చే ప్రజా ప్రభుత్వాన్ని యువత తెచ్చుకున్నారని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. వివిధ శాఖల్లో గ్రూప్`3 ఉద్యోగాలకు ఎంపికైన 1,370 మందికి శిల్పకళా వేదికలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో నియామక పత్రాలను సీఎం చేతుల విూదుగా అందజేశారు. 2014 నుంచి బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఉద్యోగాలు భర్తీ చేయలేదని ఆక్షేపించారు. గత ప్రభుత్వం సొంత లాభం చూసుకుందని, కుటుంబం, పార్టీ, రాజకీయ అవసరాలే ప్రాధాన్యంగా పని చేసిందని మండిపడ్డారు. వారి ఉద్యోగాలు ఊడితేనే నిరుద్యోగులకు కొలువులు వస్తాయని యువత భావించిందన్నారు. దీంతో వారి ఉద్యోగాలు ఊడగొట్టి, ఉద్యోగాలు ఇచ్చే ప్రజా ప్రభుత్వాన్ని తెచ్చుకున్నారని పేర్కొన్నారు. 14 ఏళ్ల పాటు గ్రూప్`1 పరీక్షలు నిర్వహించలేదని మండిపడ్డారు.ఉద్యోగాల కోసం సన్నద్ధమయ్యే వారు సంవత్సరాలుగా నోటిఫికేషన్ల కోసం ఎదురు చూశారని అన్నారు. గత ప్రభుత్వం పోటీ పరీక్షలు నిర్వహించకపోవడం బాధ్యతారాహిత్యమని అభిప్రాయపడ్డారు. పరీక్షల పేపర్లు లీకవ్వడం, మళ్లీ మళ్లీ పరీక్షలు నిర్వహించడం మరో బాధ్యతారాహిత్యమని మండిపడ్డారు. దీని ద్వారా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ విశ్వసనీయతను దెబ్బతీశారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఉద్యోగాలు ఇవ్వడం మా బాధ్యత : గ్రూప్`1 ఉద్యోగ నియామకపత్రాలు ఇచ్చే సమయంలో కూడా కొంతమంది కోర్టుకు వెళ్లి కుట్రలు చేశారని, అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాదిలోనే 60 వేల ఉద్యోగ నియామకపత్రాలు అందించినట్లు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఉద్యోగాలు ఇవ్వడం తమకు బాధ్యత అని విూకు జీవితమని కొత్త ఉద్యోగులను ఉద్దేశించి అన్నారు. ప్రభుత్వ ఉద్యోగం అంటే జీతం తీసుకోవడం కాదు ఒక భావోద్వేగమని అభివర్ణించారు.ప్రస్తుతం అందరికీ విద్య అందుతుంది కానీ నాణ్యమైన విద్య అందడం లేదని సీఎం రేవంత్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ప్రైవేటు పాఠశాలల విూద ప్రజలకు ఎందుకు విశ్వాసం పెరిగింది? అని ప్రశ్నించారు. ఉచితంగా విద్య ఇస్తున్నా ప్రభుత్వ పాఠశాలలకు పిల్లలు ఎందుకు రావట్లేదు? అని ఆలోచించాలన్నారు. నాణ్యమైన విద్యను అందిస్తే, ప్రభుత్వ పాఠశాలలకు పిల్లలను వారి తల్లిదండ్రులే పంపిస్తారని పేర్కొన్నారు.
విద్యతోనే పేదరికం పోతుంది : ఇప్పుడు ఆహార ధాన్యాలకు ఎటువంటి లోటు లేదని, ప్రోటీన్ ఫుడ్ ఇవ్వలేకపోతున్నామని సీఎం అన్నారు. నాణ్యమైన, బలమైన ఆహారం పేదలకు ఇవ్వలేకపోతున్నట్లు తెలిపారు. లక్షల మంది విద్యార్థులు ఇంజినీరింగ్ చేసి బయటకు వస్తున్నారని, అందరికీ ఎందుకు ఉద్యోగాలు రావట్లేదు? అని అన్నారు. జాబ్ మార్కెట్‌లో అవకాశాలు ఉన్నా స్కిల్ లేక అందుకోలేకపోతున్నట్లు తెలిపారు. నైపుణ్యాభివృద్ధి కోసం యువత ప్రయత్నించాలని కోరారు. ఒకప్పుడు పేదరికం పోగొట్టడానికి ప్రభుత్వం భూములు ఇచ్చేదని, ఇప్పుడు ఇవ్వడానికి భూములు లేవని, కేవలం నాణ్యమైన విద్యను మాత్రమే అందించగలమని పేర్కొన్నారు. విద్య ఒక్కటే పేదరికాన్ని పోగొడుతుందని, విద్యతోనే గౌరవం వస్తుందని, మిగతా వాటితో రాదని తెలిపారు. 2047 నాటికి తెలంగాణ రాష్ట్రాన్ని 3 ట్రిలియన్ డాలర్ల ఎకానవిూగా మార్చాలని విజ్ఞప్తి చేశారు.
రాబోయే రోజుల్లో ఉద్యోగ నోటిఫికేషన్లు వేస్తాం : త్వరలోనే అన్ని ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తామని, యువత రాజకీయ నాయకుల ఉచ్చులో పడొద్దని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగంలో మూడు దశలు గరం, నరం, భేషరం ఉంటాయంటా చమత్కరించారు. ఉద్యోగం వచ్చినప్పుడు ఉన్న గరం చివరి దశ వరకు ఉండాలన్నారు. తల్లిదండ్రులను సరిగా చూసుకోకపోతే ఉద్యోగుల జీతంలో 15 శాతం కోత విధిస్తామని సీఎం తెలిపారు. అత్తగారి ఇంటికి వెళ్లినా తల్లిదండ్రుల బాధ్య ఆడవాళ్లదే అని చెప్పారు. అత్తగారి ఇంటి నుంచి ఒత్తిడి ఉంటే తనకు చెప్పాలని, విూ జీతం నుంచి 15 శాతం విూ తల్లిదండ్రులకు ఇచ్చేస్తామన్నారు. తల్లిదండ్రులను సరిగ్గా చూసుకోనివారు సమాజంలో మానవ జన్మ ఎత్తడానికి అర్హులు కాదని పేర్కొన్నారు.



