ఇరాన్‌నుంచి భారతీయులు వెనక్కి వచ్చేయండి
` భారతీయులకు విదేశాంగశాఖ సూచన
న్యూఢల్లీి(జనంసాక్షి):ఇరాన్‌లో ఆందోళనలు హింసాత్మకంగా మారుతున్న నేపథ్యంలో.. అక్కడి భారత రాయబార కార్యాలయం ఆ దేశంలో ఉంటున్న మన పౌరులను అప్రమత్తం చేసింది. అందుబాటులో ఉన్న రవాణా మార్గాల్లో దేశాన్ని వీడాలని సూచిందింది. మరోవైపు భారత విదేశాంగశాఖ సైతం.. తదుపరి నోటీసు ఇచ్చేవరకు ఆ దేశానికి ప్రయాణించొద్దని సూచించింది.‘‘స్థానికంగా మారుతున్న పరిస్థితుల దృష్ట్యా ఇరాన్‌లోని భారత పౌరులు, భారత సంతతికి చెందినవారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఆందోళనలు, ప్రదర్శనలు జరుగుతున్న ప్రాంతాలకు దూరంగా ఉండాలి. రాయబార కార్యాలయంతో టచ్‌లో ఉండాలి. భారత పౌరులు తమ పాస్‌పోర్ట్‌లు, గుర్తింపు కార్డులు సహా ప్రయాణ, ఇమిగ్రేషన్ పత్రాలను సిద్ధంగా ఉంచుకోవాలి. ఎంబసీలో రిజిస్టర్ కాకపోతే వెంటనే చేసుకోవాలి’’ అని ఇరాన్‌లోని భారత రాయబార కార్యాలయం సూచించింది.ఇరాన్‌లో ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు ఉద్రిక్తంగా మారాయి. ఇప్పటివరకు 2500 మందికిపైగా మృతి చెందారు. మరోవైపు.. నిరసనలు కొనసాగించాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పిలుపునిచ్చారు. ఈ పరిణామాలపై భారత విదేశాంగశాఖ ఇప్పటికే ఓసారి పౌరులను అప్రమత్తం చేసింది. ఇరాన్‌కు అనవసర ప్రయాణాలను మానుకోవాలని తెలిపింది.


