జనంసాక్షి జనంవైపే ఉండాలి

పత్రికలు వాస్తవాలు రాసి సమాజాన్ని చైతన్యం చేయాలి
జనంసాక్షి క్యాలండర్ ఆవిష్కరణలో ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్
షాద్ నగర్ : ఎన్నికల సర్వేలో జనంసాక్షి సర్వేతో ప్రజల్లో ఒక ప్రత్యేక స్థానం సంపాదించుకుందనీ, అలాగే జనంసాక్షి జనం వైపు ఉండాలని షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు. శనివారం నాడు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ఆధ్వర్యంలో రంగారెడ్డి జిల్లా జనంసాక్షి ప్రతినిథి మిద్దెల సత్యనారాయణ జనంసాక్షి విలేకరులతో కలిసి క్యాలెండర్ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పత్రికలు వాస్తవాలు రాసి,సమస్యలు లేవనెత్తి పరిష్కారం దిశగా పని చేయాలని సూచించారు కార్యక్రమంలో జనంసాక్షి జర్నలిస్టులు మోడ్స్ నరేందర్, మల్లేష్ , V6 రాజేష్, నమస్తే తెలంగాణ కృష్ణ, ఎన్టీవీ నరసింహ, ఆలుగొండ శీనయ్య తదితరులు పాల్గొన్నారు.



