సోషల్‌ మీడియా ఓవరాక్షన్‌పై డీజీపీ సీరియస్‌

హైదరాబాద్ (జనంసాక్షి) : సోషల్‌ మీడియా ఓవర్‌ యాక్షన్‌పై డీజీపీ శివధర్‌ రెడ్డి మరోసారి సీరియస్‌ అయ్యారు. ఆయన బాధ్యతలు చేపట్టిన సందర్భంగా సోషల్‌ మీడియాకు గట్టి హెచ్చరికలు పంపిన డీజీపీ.. తాజాగా ఫేక్‌ న్యూస్‌ ప్రచారంపై ఘాటుగా స్పందించారు. సోషల్‌ మీడియా పేరుతో వ్యక్తిత్వ హననం చేస్తే తప్పకుండా యాక్షన్‌ తీసుకుంటామని, ఇతరుల శీల హననం, క్యారెక్టర్‌ అసాషినేషన్‌ చేస్తే కఠిన చర్యలు తప్పవన్నారు. ఇతరుల కుటుంబ సభ్యుల గురించి సైతం తప్పుడు వార్తలు రాయొద్దని సూచించిన ఆయన.. ఫేక్‌ న్యూస్‌ సర్కులేట్‌ చేసి వ్యక్తిగత విషయాలు జోలికి వెళ్లరాదని, అబద్ధాలు ప్రసారం చేయకూడదని అన్నారు. చట్టానికి లోబడి నాలుగు గోడల మధ్య ఎలాంటి విమర్శ చేసుకున్నా తమకు సమస్య లేదన్నారు. అది దాటి వ్యవహరిస్తే మాత్రం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.