ఫిరాయింపు ఎమ్మెల్యేల వ్యవహారం

స్పీకర్‌కు నాలుగు వారాల గడువు
విచారణ సందర్భంగా సుప్రీం వెల్లడి
న్యూఢల్లీి(జనంసాక్షి):పార్టీ ఫిరాయించారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న మరో ముగ్గురు ఎమ్మెల్యేలపై నిర్ణయం తీసుకునేందుకు సుప్రీంకోర్టు నాలుగు వారాలు గడువు ఇచ్చింది. ఈ నాలుగు వారాల్లో ముగ్గురు ఎమ్మెల్యేల విచారణ పూర్తిచేసి నిర్ణయం వెలువరించాలని స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌కుమార్‌కు సుప్రీంకోర్టు ధర్మాసనం సూచించింది. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై స్పీకర్‌ సత్వరమే నిర్ణయం తీసుకునే విధంగా ఆదేశించాలంటూ దాఖలైన పిటిషన్‌లపై జస్టిస్‌ సంజయ్‌ కరోల్‌, జస్టిస్‌ మసీప్‌ాలతో కూడిన ధర్మాసనం ఇవాళ మరోసారి విచారణ జరిపింది.ఈ విచారణలో సుప్రీంకోర్టుకు హావిూ ఇచ్చి, కోర్టు ఇచ్చిన ఆదేశాలను అమలు చేయడంలో స్పీకర్‌ పూర్తిగా విఫలమయ్యారని పిటిషనర్లు పాడి కౌశిక్‌ రెడ్డి, వివేకానంద్‌, కేటీఆర్‌ తరపు న్యాయవాదులు వివరించారు. విచారించిన ధర్మాసనం స్పీకర్‌కు 4 వారాల సమయమిస్తూ వాయిదా వేసింది.ఇవాళ సుప్రీంకోర్టులో బీఆర్‌ఎస్‌ వేసిన పిటిషన్‌ విచారణకు వస్తున్న నేపథ్యంలో స్పీకర్‌ నిన్ననే స్పందించారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలు పోచారం శ్రీనివాస్‌ రెడ్డి, కాలే యాదయ్య బీఆర్‌ఎస్‌లోనే ఉన్నట్లు తెలంగాణ స్పీకర్‌? ప్రసాద్‌కుమార్‌ నిన్న క్లీన్‌చిట్‌ ఇచ్చారు. వారు పార్టీ మారారనేందుకు ఆధారాలు లేవన్నారు.బీఆర్‌ఎస్‌ ఫిర్యాదు చేసిన పది మందిలో గతంలోనే ఐదుగురు ఎమ్మెల్యేలకు స్పీకర్‌ క్లీన్‌చిట్‌ ఇచ్చేశారు. వీరు కాకుండా ఎమ్మెల్యేలు దానం నాగేందర్‌, కడియం శ్రీహరిపై వచ్చిన ఫిర్యాదులపై స్పీకర్‌ విచారణ జరపాల్సి ఉంది. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌పై దాఖలైన అనర్హత పిటిషన్‌పై విచారణ పూర్తి అయింది. కానీ తీర్పును ఇంకా వెల్లడిరచలేదు. స్పీకర్‌ తీర్పును రిజర్వులో ఉంచారు.గత నెలలో తెలంగాణలో ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఈ అంశంపై సర్వోన్నత న్యాయస్థానం తెలంగాణ స్పీకర్‌?కు మరో 4 వారాల గడువు ఇచ్చింది. ఈ లోపు నిర్ణయం తీసుకోవాలని సూచించింది. కేసు విచారణను కూడా 4 వారాలకు వాయిదా వేసింది. ఈ మేరకు ఎమ్మెల్యేల అనర్హతకు సంబంధించి వాదనలను వినేందుకు స్పీకర్‌ నిర్ణయం తీసుకున్నారు. ఫిరాయించారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న మరో ముగ్గురు ఎమ్మెల్యేలపై నిర్ణయం తీసుకునేందుకు సుప్రీంకోర్టు 4 వారాలు గడువు విధించింది. తమ పార్టీకి చెందిన 10 మంది శాసనసభ్యులు బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి(గద్వాల), ఎం.సంజయ్‌(జగిత్యాల), గూడెం మహిపాల్‌రెడ్డి (పటాన్‌చెరు), పోచారం శ్రీనివాస్‌రెడ్డి(బాన్సువాడ), కాలె యాదయ్య(చేవెళ్ల), తెల్లం వెంకట్రావు(భద్రాచలం) అరెకపూడి గాంధీ(శేరిలింగంపల్లి), ప్రకాశ్‌గౌడ్‌(రాజేంద్రనగర్‌), కడియం శ్రీహరి(స్టేషన్‌ఘన్‌పూర్‌), దానం నాగేందర్‌(ఖైరతాబాద్‌)లు కాంగ్రెస్‌ పార్టీలో చేరారని, ఫిరాయింపు నిరోధక చట్టం కింద వారిని అనర్హులుగా ప్రకటించాలని స్పీకర్‌కు భారాస ఎమ్మెల్యేలు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, జగదీశ్‌రెడ్డి, కేపీ వివేకానంద, డాక్టర్‌ కల్వకుంట్ల సంజయ్‌, చింత ప్రభాకర్‌, పాడి కౌశిక్‌ రెడ్డి ఫిర్యాదు చేశారు. అయితే ఈ ఫిర్యాదులపై స్పీకర్‌ నిర్ణయం తీసుకోవడంలో జాప్యం చేస్తున్నారని బీఆర్‌ఎస్‌ పార్టీ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. దీంతో సుప్రీంకోర్టు విచారించగా పార్టీ ఫిరాయింపు ఫిర్యాదులపై నిర్ణయం తీసుకోవడానికి స్పీకర్‌కు ఒకసారి 3 నెలలు, మరోసారి 4 వారాల గడువు ఇచ్చింది. డిసెంబర్‌ 19వ తేదీతో రెండోవిడత గడువు ముగిసింది.ఈ మేరకు న్యాయనిపుణులు, అడ్వొకేట్‌ జనరల్‌తో చర్చించిన స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌కుమార్‌ ఆ 10 మంది ఎమ్మెల్యేలకు నోటీసులు జారీచేశారు. ఎనిమిది మంది ఎమ్మెల్యేలు తమ వివరణలను సభాపతికి సమర్పించారు. దీంతో వారు అఫిడవిట్‌ దాఖలు చేశారు. మరోవైపు ఫిర్యాదు చేసిన బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు ఆ ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించారంటూ ఆధారాలను స్పీకర్‌?కు సమర్పించారు. రెండు దశల్లో ఎనిమిది మంది ఎమ్మెల్యేలపై వచ్చిన ఫిరాయింపు ఫిర్యాదులను విచారించిన సభాపతి తీర్పు వెల్లడిరచారు

 

ఒక్క వాయిదా పడినా వచ్చేస్తున్నారు

` ఆర్టికల్‌ 32 దుర్వినియోగమవుతోంది
` హైకోర్టులో పెండిరగ్‌లో ఉన్న వాటిపై సుప్రీంకోర్టును ఆశ్రయించడంపై ధర్మాసనం ఆగ్రహం
న్యూఢల్లీి(జనంసాక్షి):ప్రాథమిక హక్కుల పరిరక్షణ కోసం భారత రాజ్యాంగంలో అత్యంత కీలకమైన ఆర్టికల్‌ 32ను దుర్వినియోగం చేస్తున్నారంటూ సుప్రీంకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. హైకోర్టుల్లో కేసులు పెండిరగ్‌లో ఉండగానే, నేరుగా సుప్రీంకోర్టును ఆశ్రయించే అలవాటు ఎక్కువవుతోందని ఆందోళన వ్యక్తం చేసింది. ఈ విషయంలో స్పష్టమైన హెచ్చరిక చేస్తూ, ఇలాంటి చర్యలు కోర్టు ప్రక్రియకు విరుద్ధమని తేల్చి చెప్పింది.శుక్రవారం నాడు జస్టిస్‌ బీవీ నాగరత్న, జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్‌?తో కూడిన ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. బాంబే హైకోర్టులో ఇదే అంశంపై ఇప్పటికే పిటిషన్‌ విచారణలో ఉండగానే, అదే విషయాన్ని ప్రస్తావిస్తూ ఒక వ్యక్తి నేరుగా సుప్రీంకోర్టులో ఆర్టికల్‌ 32 కింద పిటిషన్‌ దాఖలు చేయడాన్ని ధర్మాసనం తీవ్రంగా తప్పుబట్టింది. ఈ పిటిషన్‌ను కోర్టు ప్రక్రియను, చట్టాన్ని తీవ్రంగా దుర్వినియోగం చేసిన చర్యగా పేర్కొంటూ, వెంటనే కొట్టివేసింది.ఈ సందర్భంగా ధర్మాసనం తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ‘‘ఆర్టికల్‌ 32ను స్పష్టంగా దుర్వినియోగం చేస్తున్నారు. ఈ ఆర్టికల్‌ కింద దాఖలయ్యే పిటిషన్ల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ప్రతి చిన్న విషయానికీ, హైకోర్టులో ఒక్క వాయిదా పడితే చాలు, ఇక్కడికి వచ్చి ఆర్టికల్‌ 32 కింద పిటిషన్‌ వేస్తున్నారు. ముఖ్యంగా దిల్లీ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి ఇలాంటి పిటిషన్లు ఎక్కువగా వస్తున్నాయి. ఇది ఏమిటి? ఇది పూర్తిగా దుర్వినియోగమే’’ అంటూ అసహనం వ్యక్తం చేసింది.
ప్రతి సందర్భంలోనూ వినియోగించుకోవడం సరికాదు!
ఆర్టికల్‌ 32 అనేది పౌరుల ప్రాథమిక హక్కుల ఉల్లంఘన జరిగినప్పుడు, నేరుగా సుప్రీంకోర్టును ఆశ్రయించే హక్కును కల్పిస్తుంది. దీనిని రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ రాజ్యాంగానికి హృదయం, ఆత్మగా అభివర్ణించారు. ఈ ఆర్టికల్‌ ద్వారా పౌరులు తమ హక్కులకు తక్షణ న్యాయ పరిరక్షణ పొందే అవకాశం ఉంది. అయితే, ఈ హక్కును ప్రతి సందర్భంలోనూ వినియోగించుకోవడం సరికాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
వేగంగా ఉపశమనం పొందేందుకు ఉపయోగించకూడదు ప్రత్యేకంగా, హైకోర్టులు ఇప్పటికే ఆ విషయాన్ని విచారిస్తున్నప్పుడు, లేదా హైకోర్టును ఆశ్రయించే అవకాశం ఉన్నప్పుడు, నేరుగా సుప్రీంకోర్టుకు రావడం సరికాదని ధర్మాసనం తేల్చి చెప్పింది. అలాంటి సందర్భాల్లో ఆర్టికల్‌ 226 కింద హైకోర్టులను ఆశ్రయించాల్సిన అవసరం ఉందని గుర్తు చేసింది. ఆర్టికల్‌ 32ను హైకోర్టులను దాటవేసేందుకు లేదా వేగంగా ఉపశమనం పొందేందుకు ఉపయోగించకూడదని స్పష్టంగా హెచ్చరించింది.
పిటిషన్‌ దాఖలు చేయడం అనవసరం
ఈ కేసులో, బాంబే హైకోర్టులో సంబంధిత పిటిషన్‌ ఇప్పటికే పెండిరగ్‌లో ఉండగా, అదే అంశంపై సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేయడం అనవసరమని ధర్మాసనం అభిప్రాయపడిరది. ఇది న్యాయవ్యవస్థలో గందరగోళం సృష్టించడమే కాకుండా, అత్యున్నత న్యాయస్థాన సమయాన్ని వృథా చేయడమేనని వ్యాఖ్యానించింది. సుప్రీంకోర్టు గతంలోనూ పలుమార్లు ఇదే అంశంపై స్పష్టమైన మార్గదర్శకాలు ఇచ్చిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసింది.
హైకోర్టుల్లో సరైన పరిష్కారం లభించని సందర్భాల్లోనే!
ఆర్టికల్‌ 32ను అత్యవసర పరిస్థితుల్లో, నిజంగా ప్రాథమిక హక్కుల ఉల్లంఘన జరిగినప్పుడు మాత్రమే వినియోగించాల్సిన అవసరం ఉందని మరోసారి స్పష్టం చేసింది. హైకోర్టుల్లో సరైన పరిష్కారం లభించని సందర్భాల్లోనే సుప్రీంకోర్టును ఆశ్రయించాలని సూచించింది. మొత్తంగా, ఆర్టికల్‌ 32 కింద దాఖలైన ఈ పిటిషన్‌ను కోర్టు ప్రక్రియకు, చట్టానికి స్పష్టమైన దుర్వినియోగంగా అభివర్ణించిన ధర్మాసనం, దానిని పూర్తిగా కొట్టివేసింది. భవిష్యత్తులో ఇలాంటి పిటిషన్ల విషయంలో మరింత కఠినంగా వ్యవహరించే అవకాశం ఉందన్న సంకేతాలను కూడా సుప్రీంకోర్టు ఈ సందర్భంగా ఇచ్చిందని న్యాయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.